కస్టమర్ల కోసం ఆన్‌లైన్ దుకాణం తెరచిన హీరో మోటోకార్ప్

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, కొనుగోలుదారులు బయటకు వచ్చేందుకు సంకోచిస్తున్న నేపథ్యంలో అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ కస్టమర్ల కోసం ఆన్‌లైన్ షాపులను తెరస్తున్నాయి. తాజాగా.. దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ వినియోగదారుల కోసం ఓ సరికొత్త ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది. హీరో మోటోకార్ప్ ఇ-షాప్ (eSHOP) కంపెనీ ప్రారంభించిన ఈ ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లో కస్టమర్లు నేరుగా తమ నచ్చిన బైక్ లేదా స్కూటర్‌ను సెలక్ట్ చేసుకోవటం నుంచి డెలివరీ వరకూ అన్నీ ఆన్‌లైన్‌లో చేయవచ్చు.

కస్టమర్ల కోసం ఆన్‌లైన్ దుకాణం తెరచిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ ఇ-షాప్ నుంచి కొనుగోలు చేయదలచిన కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ www.heromotocorp.com ను సందర్శించి అందులో ఇ-షాప్ (eSHOP) విభాగాన్ని ఎంచుకోవటం ద్వారా ఆన్‌లైన్ షాప్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో వాహనాల కొనుగోలుకు సంబంధించిన సమాచారం, తదుపరి చర్యలను చాలా సులువుగా, పారదర్శకంగా రూపొందించారు.

కస్టమర్ల కోసం ఆన్‌లైన్ దుకాణం తెరచిన హీరో మోటోకార్ప్

ఇ-షాప్‌ను సందర్శించిన కస్టమర్లు తమకు నచ్చిన వాహనాన్ని ఎంచుకోవటం లేదా తమ సమీపంలోని డీలరు నుంచి బుక్ చేసుకోవటం చేయవచ్చు. అలాగే, ఇందులో ప్రస్తుత ఆన్-రోడ్ ధర, మీరు ఎంచుకున్న మోడల్ స్టాక్‌లో ఉందా లేదా, ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సిన డాక్యుమెంట్స్, సమీప డీలరుకు తక్షణ సమాచారం అందించడం, ఫైనాన్సింగ్ ఆప్షన్స్, సేల్ ఆర్డర్ కన్ఫర్మేషన్, విన్ (VIN) నెంబర్ కేటాయింపు, డెలివరీ తేదీ వంటి అనేక అంశాలను కూడా దశల వారీగా తెలుసుకోవచ్చు.

కస్టమర్ల కోసం ఆన్‌లైన్ దుకాణం తెరచిన హీరో మోటోకార్ప్

ఈ సైట్‍‌లో కస్టమర్లు తమకు నచ్చిన వాహనం, వేరియంట్, కలర్ మరియు తాము డెలివరీ తీసుకోవాల్సిన నగరాన్ని కూడా ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకునే మోడల్ అవైలబిలిటీని బట్టి డీలర్‌షిప్ కేటాయింపు ఉంటుంది లేదా కస్టమర్లు తమకు నచ్చిన డీలరును ఎంచుకుని, చెల్లింపులు చేసే వెసలుబాటు కూడా ఉంటుంది.

కస్టమర్ల కోసం ఆన్‌లైన్ దుకాణం తెరచిన హీరో మోటోకార్ప్

ఒక్కసారి కస్టమర్ తనకు నచ్చిన వాహనాన్ని ఎంచుకున్న తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది, పేమెంట్ చేసేందుకు గాను వెరిఫికేషన్ కోసం కస్టమర్ల మొబైల్ ఫోన్‌కు ఓ విశిష్టమైన ఓటిపి పంపించబడుతుంది. ఇలా వెరిఫికేషన్ పూర్తయ్యాక కస్టమర్లు ఎంచుకున్న డీలర్‌షిప్ నుంచి సేల్స్ అసిస్ట్‌కు అనుసంధానం చేయబడుతుంది. ఒకవేళ కస్టమర్‌కు ఆసక్తి ఉంటే, పేమెంట్ ప్రాసెస్ సమయంలో ఫైనాన్స్ ఆప్షన్‌ను కూడా ఎంచుకోచ్చు.

కస్టమర్ల కోసం ఆన్‌లైన్ దుకాణం తెరచిన హీరో మోటోకార్ప్

రోజు రోజుకి పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలో, కొనుగోలుదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల కోసం కంపెనీ అనేక డిజిటల్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ప్రణాళికను కంపెనీ తీసుకొచ్చింది. అంటే, ఇకపై కస్టమర్లు తమకు కావల్సిన సేవల కోసం షోరూమ్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండానే అన్నింటినీ ఆన్‌లైన్ ద్వారా పరిష్కరించుకునే వెసలుబాటు అన్నమాట. ఈ సేవల్లో భాగంగా, డిజిటల్ సర్వీస్ జాబ్ కార్డ్, అకనాలెడ్జ్‌మెంట్ రిసీప్ట్, యాప్-బేస్డ్ సర్వీస్ బుకింగ్, వర్క్‌షాప్ పనిగంటలను పెంచడం వంటి ప్రణాళికలను హీరో మోటోకార్ప్ సిద్ధం చేసింది.

కస్టమర్ల కోసం ఆన్‌లైన్ దుకాణం తెరచిన హీరో మోటోకార్ప్

హీరో యాప్ (Hero App)ను ఉపయోగించి కస్టమర్లు తమకు సమీపంలో ఉన్న వర్క్‌షాప్ నుంచి బైక్ సర్వీస్ అపాయింట్‌మెంట్‌ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. జాబ్ కార్డులను కూడా నేరుగా యాప్‌లోనే ఉంచడం ద్వారా సర్వీస్‌కు సంబంధించిన పేపర్లను చేతులు మార్చుకునే అవకాశం ఉండదు. సామాజిక దూరం (సోషల్ డిస్టాన్స్)ను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.

కస్టమర్ల కోసం ఆన్‌లైన్ దుకాణం తెరచిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ ఇ-షాప్ ఆన్‌లైన్ స్టోర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులను చూస్తుంటే, వైరస్ వ్యాప్తి నివారణ కోసం హీరో మోటోకార్ప్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదనే చెప్పాలి. కొనుగోలుదారుల ఆసక్తిని దెబ్బతీయకుండా అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ, కేవలం కొన్ని క్లిక్కులతోనే కస్టమర్లు తమకు నచ్చిన బైక్‌ను కోనుగోలు చేయటం అనేది ఓ కొత్త అనుభూతిగా ఉంటుంది.

Article Published On: Tuesday, June 9, 2020, 9:40 [IST]
English summary
Hero MotoCorp has launched an integrated online sales platform - eSHOP to further strengthen its industry-leading digital initiatives for enhanced customer experience. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+