Just In
- 17 min ago
2020 ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ డ్రాగ్ ఛాంపియన్షిప్ విజేతగా హేమంత్ ముద్దప్ప
- 1 hr ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- 1 hr ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 3 hrs ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
Don't Miss
- News
నిమ్మగడ్డతో పోరులో జగన్ వైఫల్యానికి కారణమిదే -తర్వాత స్టెప్ ఇదైతేనే సేఫ్: ఎంపీ రఘురామ
- Sports
'కార్టూన్ బాయ్' రిషభ్ పంత్‌ను ట్రోల్ చేసిన రషీద్ ఖాన్!! ఏమన్నాడంటే?
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు... ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న తొలి మహిళా పైలట్ స్వాతి రాథో
- Finance
కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే!
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కలిసొచ్చిన ఫెస్టివ్ సెంటిమెంట్.. హీరో బ్రాండ్‌పై కస్టమర్లలో అదే కమిట్‌మెంట్..
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గడచిన నవంబర్ 2020 నెలలో 14 శాతం వృద్ధిని కనబరిచినట్లు ప్రకటించింది. గత నెలలో కంపెనీ 5,75,957 యూనిట్లను విక్రయించింది. ఇటీవలి పండుగ సీజన్‌లో బలపడిన మార్కెట్ సెంటిమెంట్ కారణంగా కంపెనీ ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసింది.

గడచిన సంవత్సరం ఇదే సమయంలో (నవంబర్ 2019లో) హీరో మోటోకార్ప్ 5,05,994 యూనిట్లను విక్రయించింది. కంపెనీ మొత్తం విక్రయాల్లో మోటారుసైకిల్ అమ్మకాలు నవంబర్ 2020లో 541,437 యూనిట్లుగా ఉండగా, నవంబర్ 2019లో అవి 479,434 యూనిట్లు ఉండి, 12.9 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఇక స్కూటర్ల విక్రయాల విషయానికి వస్తే, నవంబర్ 2020లో కంపెనీ మొత్తం 49,654 స్కూటర్లను విక్రయించగా, నవంబర్ 2019లో 37,341 స్కూటర్లను విక్రయించి 32.97 శాతం వృద్ధిని నమోదు చేసింది.
MOST READ:ఒకే కారుని 77 సంవత్సరాలు ఉపయోగించాడు.. ఇంతకీ అతడెవరో తెలుసా ?

దేశంలో కోవిడ్-19 పరిస్థితుల తర్వాత హీరో మోటోకార్ప్ ఇంత అధికస్థాయిలో అమ్మకాలను నమోదు చేయటం ఇదే మొదటిసారి. ఇటీవలి పండుగ సీజన్ కూడా కంపెనీకి బాగా కలిసి వచ్చింది. ఈ సీజన్‌లో అమ్మకాలను పెంచుకునేందుకు హీరో మోటోకార్ప్ చేసిన మార్కెటింగ్ విధానాలు కూడా బాగా పనిచేశాయి.

బెస్ట్ ఇన్ క్లాస్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో, వివిధ రకాల పండుగ సీజన్ ఆఫర్లు మరియు కార్యక్రమాలు, కొత్త తరం డిజిటల్ సేల్స్ సొల్యూషన్స్ మరియు డీలర్‌షిప్‌లలో వినియోగదారులకు సురక్షితమైన మరియు పరిశుభ్రమైన కొనుగోలు అనుభవం కల్పించడం వంటి వివిధ కారణాల వలన సంస్థ అమ్మకాలు మెరుగుపడ్డాయని హీరో మోటోకార్ప్ ఒక ప్రకటనలో పేర్కొంది.
MOST READ:రూ. 1.26 కోట్ల రూపాలకు అమ్ముడైన 118 సంవత్సరాల పాత వెహికల్ నెంబర్.. ఎందుకో తెలుసా

ప్రపంచంలోనే అతిపెద్ద టూవీలర్ మేకర్ అయిన హీరో మోటోకార్ప్, భారత మార్కెట్లో కేవలం మోటారుసైకిల్ విభాగంలోనే కాకుండా స్కూటర్ విభాగంలో కూడా తన మార్కెట్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. భారతీయ కొనుగోలుదారులు కూడా హీరో వంటి అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతోంది.

అంతర్జాతీయ ఎగుమతుల్లో కూడా హారో మోటోకార్ప్ తన హవాని కొనసాగించింది. గడచిన నవంబర్ 2019లో కంపెనీ ఎగుమతి చేసిన 10,781 యూనిట్లతో పోలిస్తే నవంబర్ 2020లో కంపెనీ మొత్తం 15,134 యూనిట్ల ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసింది. మొత్తంగా చూసుకుంటే, హీరో మోటోకార్ప్ గడచిన నెలలో 5,91,091 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.
MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

హీరో మోటోకార్ప్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, దేశంలోని టూవీలర్ విభాగంలో కనెక్టెడ్ టెక్నాలజీకి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని కంపెనీ తమ ఉత్పత్తులో ఈ తరహా అధునాతన సాంకేతికతను పరిచయం చేసింది. దేశీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ తన మూడు ఉత్పత్తులలో 'హీరో కనెక్ట్' అనే పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త కనెక్టివిటీ ఫీచర్ ఇప్పుడు హీరో ఎక్స్‌ప్లస్ 200, డెస్టిని 125 మరియు ప్లెజర్ ప్లస్ మోడళ్లలో లభ్యం కానుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.