హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 కోసం సీట్ కవర్స్, హెల్మెట్

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లో ఇంకా తమ బిఎస్6 వెర్షన్ 'హీరో ఎక్స్‌పల్స్ 200' మోటార్‌సైకిల్‌ను విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, హీరో ఎక్స్‌పల్స్ 200 విడుదలకు ముందే కంపెనీ ఈ బైక్ కోసం కొత్త యాక్ససరీలను విడుదల చేసింది. వీటిలో సీట్ కవర్ ఆప్షన్స్, మోటోక్రాస్ హెల్మెట్ మొదలైనవి ఉన్నాయి.

హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 కోసం సీట్ కవర్స్, హెల్మెట్

హీరో ఎక్స్‌పల్స్ 200 కోసం అందిస్తున్న కొత్త సీట్ కవర్లలో మోడ్రన్, టూరర్, అడ్వెంచర్ మరియు డ్యూయెల్ టోన్ అనే నాలుగు ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి సీట్ కవర్ దాని ప్రత్యేక ప్రయోజనం కోసం, ఆఫ్‌రోడింగ్ కోసం, పట్టణ మరియు హైవే రైడ్‌లకు అదనపు సౌకర్యం అందించడం కోసం తయారు చేయబడ్డాయి.

హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 కోసం సీట్ కవర్స్, హెల్మెట్

ఈ మోటార్‌సైకిల్ ఆఫ్-రోడర్ అయినందున, బిఎస్ 6 ఎక్స్‌పల్స్ 200 కోసం కంపెనీ ఆఫ్-రోడింగ్ హెల్మెట్‌ను కూడా విడుదల చేసింది. ఈ హెల్మెట్‌లో కలర్ కాంబినేషన్ ఉంటుంది, ఇది మోటారుసైకిల్‌లోని కలర్ ఆప్షన్లతో సరిపోయేలా ఉంటుంది మరియు ఇది డ్యూయెల్-స్పోర్ట్ డెకాల్స్‌తో వస్తుంది. ఈ యాక్ససరీల ధరలను హీరో మోటోకార్ప్ ఇంకా వెల్లడించలేదు. అయితే, బిఎస్6 వేరియంట్‌ను విడుదల చేయడంతో పాటు కంపెనీ వీటి ధరలను వెల్లడించే అవకాశం ఉంది.

MOST READ: 2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 కోసం సీట్ కవర్స్, హెల్మెట్

ఈ సంవత్సరం ప్రారంభంలో, బిఎస్6 హీరో ఎక్స్‌పల్స్ 200 మోడల్ పవర్, టార్క్ గణాంకాలను కంపెనీ వెల్లడించింది. ఈ మోటారుసైకిల్‌లో ఇదివరటి ఇంజన్‌నే బిఎస్6కి అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించారు. ఈ ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన 199.6 సిసి ఇంజన్‌ ఇప్పుడు ఎయిర్/ఆయిల్ కూల్డ్ మరియు ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌లను స్టాండర్డ్‌గా కలిగి ఉండనుంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 కోసం సీట్ కవర్స్, హెల్మెట్

ఈ బిఎస్6 ఇంజిన్ ఇప్పుడు గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.8 బిహెచ్‌పి శక్తిని మరియు 6,400 ఆర్‌పిఎమ్ వద్ద 16.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే బిఎస్4 మోడళ్లలో అయితే ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.1 బిహెచ్‌పి మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసేది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన కొత్త హెలికాఫ్టర్లు ఇవే

హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 కోసం సీట్ కవర్స్, హెల్మెట్

అంతే కాకుండా, బిఎస్6 మోడళ్లలోని ఎగ్జాస్ట్ పైపు యొక్క స్థానాన్ని కూడా మార్చారు. హెడర్ పైప్ ఇప్పుడు ఇంజన్ క్రింది వైపు నుండి వెనుక సీట్ మడ్‌గార్డ్ వరకూ పొడగించబడి ఉంటుంది. ఈ కొత్త ఎగ్జాస్ట్ పైపింగ్ కోసం స్థలం ఉండేలా ఇంజన్ బెల్లీ-పాన్ కూడా రీడిజైన్ చేశారు. ఇది మోటారుసైకిల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్‌ను ప్రభావితం చేస్తుందో లేదో వేచి చూడాలి.

హీరో ఎక్స్‌పల్స్ 200 బిఎస్6 కోసం సీట్ కవర్స్, హెల్మెట్

కొత్త హీరో ఎక్స్‌పల్స్ 200 బైక్ యాక్ససరీస్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త ఆఫ్-రోడింగ్ హెల్మెట్ మరియు సీట్ కవర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. హీరో మోటోకార్ప్ వీటిని విడుదల చేయటం ద్వారా ఎక్స్‌పల్స్ 200 కోసం కస్టమైజేషన్ ఆప్షన్లను పరిచయం చేసినట్లయింది. ఇదొక ఉత్తమమైన ఎంట్రీ లెవల్ ఆఫ్-రోడర్‌లలో ఒకటిగా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ మాదిరిగానే విశిష్టమైన ఫీల్ కోరుకునే వారికి ఈ యాక్ససరీస్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Hero MotoCorp is yet to launch the BS6 Hero XPulse 200 in the Indian Market. However, the company has recently revealed new accessories for the XPulse 200, that include seat cover options and a motocross helmet. Read in Telugu.
Story first published: Saturday, July 11, 2020, 21:09 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X