భారతదేశపు పాపులర్ బైక్ హీరో ప్యాసన్ ప్రో లేటెస్ట్ వెర్షన్ విడుదల: ధర & ప్రత్యేకతలు

భారతదేశపు అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ బెస్ట్ సెల్లింగ్ కమ్యూటర్ మోటార్ సైకిల్ హీరో ప్యాసన్ ప్రో బైకును బీఎస్6 వెర్షన్‌లో విపణిలోకి విడుదల చేసింది. సరికొత్త హీరో ప్యాసన్ ప్రో బీఎ6 వెర్షన్ ప్రారంభ ధర 64,990 రూపాయలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు నిర్ణయించారు.

డిజైన్ పరంగా పలు మార్పులు చేర్పులు చేర్పులతో పాటు ఎన్నో అప్‌డేట్స్ వచ్చాయి. హీరో ప్యాసన్ ప్రో కొనాలనుకుంటున్నారా..? అయితే దీని గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో..

భారతదేశపు పాపులర్ బైక్ హీరో ప్యాసన్ ప్రో లేటెస్ట్ వెర్షన్ విడుదల: ధర & ప్రత్యేకతలు

బీఎస్6 వెర్షన్ హీరో ప్యాసన్ ప్రో మోడల్ డ్రమ్ బ్రేక్స్ మరియు డిస్క్ బ్రేక్స్ అనే రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. డిస్క్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ. 67,190 కాగా, డ్రమ్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ. 64,990. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

భారతదేశపు పాపులర్ బైక్ హీరో ప్యాసన్ ప్రో లేటెస్ట్ వెర్షన్ విడుదల: ధర & ప్రత్యేకతలు

హీరో ప్యాసన్ ప్రో బైకులో అత్యాధునిక హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్‌తో పాటు అధునాతన బాడీ ప్యానల్స్ మరియు స్టైలిష్ బాడీ గ్రాఫిక్స్ వచ్చాయి. కండలు తిరిగిన ఫ్యూయల్ ట్యాంక్ మరియు యాంగ్యులర్ డిజైన్ ఎలిమెంట్స్ ప్యాసన్ ప్రో మోడల్‌కు కొత్త రూపాన్నిచ్చాయి. హీరో ప్యాసన్ ప్రో ఇది వరకు లభించే రంగులతో పాటు బ్లాక్, గ్రే, ఎల్లో మరియు రెడ్ అనే మరో నాలుగు అనదనపు కలర్ ఆప్షన్స్‌లో కూడా లభిస్తోంది.

భారతదేశపు పాపులర్ బైక్ హీరో ప్యాసన్ ప్రో లేటెస్ట్ వెర్షన్ విడుదల: ధర & ప్రత్యేకతలు

బీఎస్6 వెర్షన్ హీరో ప్యాసన్ ప్రో బైకులో సెమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ చాలా కొత్తగా వచ్చింది. ఇందులో మైలేజ్ మరియు రియల్ టైమ్ ఇంధన సామర్థ్యం (ఫ్యూయల్ ఎఫీషియన్సీ) తెలుసుకోవచ్చు.

భారతదేశపు పాపులర్ బైక్ హీరో ప్యాసన్ ప్రో లేటెస్ట్ వెర్షన్ విడుదల: ధర & ప్రత్యేకతలు

మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 15మిమీ వరకూ అధిక ట్రావెల్ గల ఫ్రంట్ సస్పెన్షన్ సిస్టమ్ వచ్చింది. ఇందులో వచ్చిన మరో ప్రధాన హైలెట్, కార్బోరేటర్ స్థానంలో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ వచ్చింది.

భారతదేశపు పాపులర్ బైక్ హీరో ప్యాసన్ ప్రో లేటెస్ట్ వెర్షన్ విడుదల: ధర & ప్రత్యేకతలు

బీఎస్4 వెర్షన్‌తో పోల్చుకుంటే బీఎస్6 హీరో ప్యాసన్ ప్రో మైలేజ్ 5% వరకూ పెరిగింది. దీంతో పాటు కఠినమైన ట్రాఫిక్‌లో ఈజీ రైడింగ్ కోసం "ఆటో సెయిల్" టెక్నాలజీని ప్రవేశపెట్టారు. దీంతో ఎలాంటి ట్రాఫిక్‌లోనైనా అత్యంత సునాయసంగా దూసుకెళ్లచ్చు.

భారతదేశపు పాపులర్ బైక్ హీరో ప్యాసన్ ప్రో లేటెస్ట్ వెర్షన్ విడుదల: ధర & ప్రత్యేకతలు

ఏదేమైనప్పటికీ బీఎస్6 మోడల్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు. సాంకేతికంగా అదే మునుపటి 110సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ ఇంజన్ యధావిధిగా అందించారు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 9బీహెచ్‌పి పవర్ మరియు 9.79ఎన్‌ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

110సీసీ కమ్యూటర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో హీరో ప్యాసన్ ప్రో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్. బీఎస్6 వెర్షన్‌లో ప్రవేశపెట్టడంతో సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. 110సీసీ సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్లకు ఇది మరింత గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Hero Passion Pro BS6 Launched In India: Prices Start At Rs 64,990. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X