మీకు తెలుసా.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పుడు బిఎస్ 6 వెర్షన్లో కూడా

భారతదేశంలో ద్విచక్ర వాహనాల తయారీలో మొదటి స్థానంలో ఉన్న హీరో కంపెనీ నుంచి ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి బిఎస్-6 వెర్షన్ హీరో స్ప్లెండర్ ప్లస్ విడుదలైంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

మీకు తెలుసా.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పుడు బిఎస్ 6 వెర్షన్లో కూడా

హీరో స్ప్లెండర్ ప్లస్ బిఎస్-6 ,బిఎస్-4 వెర్షన్ మాదిరిగానే మూడు వేరియంట్ ఆఫర్లతో ఉన్నాయి. వీటి ధర రూ. 59,600 నుండి రూ. 63,110 వరకు ఉన్నాయి.

మీకు తెలుసా.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పుడు బిఎస్ 6 వెర్షన్లో కూడా

హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పుడు మోటారుసైకిల్ విభాగంలో తిరుగులేని రారాజు. ఇది వినియోగదారునికి అనుకూలంగా ఉండటంతో పాటు మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా ఇస్తుంది. చూడటానికి చాలా సరళంగా ఉంటుంది. ఇది సాంకేతిక అభివృద్ధిని అంతగా పొందలేదు.

మీకు తెలుసా.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పుడు బిఎస్ 6 వెర్షన్లో కూడా

సాధారణంగా ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం వాహనాలను బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయాలని నిర్ణయించింది. ఈ కారణంగా అన్ని సంస్థలు దాదాపుగా బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా నవీనీకరిస్తున్నాయి.

మీకు తెలుసా.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పుడు బిఎస్ 6 వెర్షన్లో కూడా

బిఎస్-6 హీరో స్ప్లెండర్ ప్లస్‌ ఎక్కువ నవీనీకరణలు చేయబడలేదు. చూడటానికి దాదాపు మునుపటి మోడల్లాగా ఉంటుంది. కానీ ఈ మోటార్ సైకిల్ కూని మార్పులను మాత్రం అందుకుంది. ఇందులో కొత్త డెకాల్స్ మరియు డ్యూయల్-టోన్ కలర్ థీమ్‌లతో అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుంది. అదే విధంగా ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ కారణంగా ఇంజిన్ చెక్ లైట్ లభిస్తుంది. ఇదే కాకుండా అదనంగా క్యటలిటిక్ కన్వర్టర్‌ను కూడా పొందుతుంది.

మీకు తెలుసా.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పుడు బిఎస్ 6 వెర్షన్లో కూడా

బిఎస్-6 హీరో స్ప్లెండర్ ప్లస్ 97.2 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఇందులో శక్తి మరియు టార్క్ అవుట్‌పుట్‌లు వరుసగా 8.36 హెచ్‌పి మరియు 8.05 ఎన్‌ఎమ్‌ల వద్ద ఉంటాయి. ఇంజిన్ 4-స్పీడ్ ట్రాన్స్మిషన్తో జతచేయబడుతోంది. ఇంధన సామర్థ్య సంఖ్య 80 కిలోమీటర్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

మీకు తెలుసా.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పుడు బిఎస్ 6 వెర్షన్లో కూడా

2020 బిఎస్-6 హీరో స్ప్లెండర్ ప్లస్ దేశవ్యాప్తంగా షోరూమ్‌లకు చేరుకోవడం ప్రారంభించింది. స్ప్లెండర్ ప్లస్ కాకుండా, బిఎస్ 6 క్లబ్‌లోని ఇతర హీరో ద్విచక్ర వాహనాలు స్ప్లెండర్ ఐస్‌మార్ట్, హెచ్‌ఎఫ్ డీలక్స్, మాస్ట్రో, డెస్టిని మరియు ప్లెజర్ ప్లస్. ఏప్రిల్ 1, 2020 కి ముందు మిగిలిన పోర్ట్‌ఫోలియో త్వరగా అప్‌గ్రేడ్ అవుతుందని భావిస్తున్నారు.

మీకు తెలుసా.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పుడు బిఎస్ 6 వెర్షన్లో కూడా

బిఎస్ 4 హీరో స్ప్లెండర్ ప్లస్ తో పోలిస్తే, బిఎస్ 6 స్ప్లెండర్ ప్లస్ ధరలను కొంత ఎక్కువగా ఉంటాయి. ఇది ఎప్పటిలాగే అమ్మకాలలో ముందంజలోనే ఉంటుందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. ఎప్పటిలాగే మార్కెట్లో ఎక్కువ ప్రజాదరణను కూడా పొందుతుంది.

మీకు తెలుసా.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పుడు బిఎస్ 6 వెర్షన్లో కూడా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎస్-6 హీరో స్ప్లెండర్ ప్లస్ కంటే ఇతర వాహనాలు కొంత ఎక్కువ మైలేజ్ ని అందించినప్పటికీ మార్కెట్లో వీటి అమ్మకాల స్థాయిని మాత్రం తగ్గించలేవు. ఇది ఇండియన్ మార్కెట్లో బజాజ్ ప్లాటినా, టివిఎస్ స్టార్ సిటీ ప్లస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
BS6 Hero Splendor Plus FI launch price Rs 60k – Up to Rs 7k hike. Read in Telugu.
Story first published: Saturday, February 15, 2020, 17:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X