డీలర్ల వద్దకు చేరుకుంటున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, త్వరలో డెలివరీలు!

హీరో మోటోకార్ప్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ గత నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త నేకెడ్ మోటార్‌సైకిల్ ఫ్రంట్ డిస్క్ మరియు డబుల్ డిస్క్ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తోంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.99,950 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, త్వరలో డెలివరీలు!

ఇందులో టాప్-ఎండ్ డబుల్ డిస్క్ వేరియంట్ ధర ర .1.03 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. తాజాగా, జిగ్‌వీల్స్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటార్‌సైకిల్ దేశవ్యాప్తంగా వివిధ డీలర్‌షిప్‌ల వద్దకు రావడం ప్రారంభించింది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, త్వరలో డెలివరీలు!

ఈ మోటారుసైకిల్‌లో ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 160 సిసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 15 బిహెచ్‌పి శక్తిని మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 14 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:గర్భిణీ భార్య కోసం 4000 కి.మీ ప్రయాణించిన భర్త

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, త్వరలో డెలివరీలు!

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ కేవలం 4.7 సెకన్లలోనే 0-60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది బెస్ట్-ఇన్-క్లాస్ పవర్-టు-వెయిట్ రేషియోను కలిగి ఉంటుంది. ఫలితంగా ఇది ఈ విభాగంలో అత్యంత వేగవంతమైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా నిలిచింది. మోటారుసైకిల్ బేస్-స్పెక్ మోడల్ బరువు 138.5 కిలోలుగా ఉంటే, టాప్-స్పెక్ మోడల్ బరువు బేస్ వేరియంట్ కన్నా 1 కిలో ఎక్కువగా ఉంటుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, త్వరలో డెలివరీలు!

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ డిజైన్‌ను బ్రాండ్ ఎక్స్‌ట్రీమ్ 1.ఆర్ కాన్సెప్ట్ మోడల్ నుండి స్పూర్తి పొంది డిజైన్ చేశారు. ఈ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2019 లో ఈఐసిఎమ్ఏ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచారు. ఇందులో అగ్రెసివ్‌గా ఉండే ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ క్లస్టర్, రెండు చివర్లలో దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఉండే టర్న్ ఇండికేటర్స్ స్మోక్ట్ టెయిల్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:లంబోర్ఘిని ఉరుస్ కార్ డ్రైవ్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, త్వరలో డెలివరీలు!

ఇంకా ఇందులో డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్, సింగిల్-పీస్ సీట్, రియర్ ఫెయిరింగ్‌లో విలీనం చేయబడిన రియర్ గ్రాబ్-రైల్స్, రెండు చివర్లలో రిఫ్లెక్టర్ రిమ్స్ టేప్ కూడా ఉన్నాయి. ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది, ఇది రైడర్‌కు కావల్సిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, త్వరలో డెలివరీలు!

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటార్‌సైకిల్ నిటారుగా ఉండే హ్యాండిల్‌బార్‌ను కలిగి ఉంటుంది, ఇది రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది. ముందు భాగంలో 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో సెవన్-స్టెప్ అడ్జస్టబల్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్‌ ఉంటాయి.

MOST READ:గంటకు 300 కి.మీ వేగంతో రైడ్ చేసిన బెంగళూరు బైకర్ అరెస్ట్ ; 20 లక్షల బైక్ సీజ్

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, త్వరలో డెలివరీలు!

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 276 మిమీ మరియు వెనుక భాగంలో 220 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. లోయర్ వేరియంట్ మోడల్‌లో 130 మి.మీ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఈ మోటారుసైకిల్‌ను స్టాండర్డ్ సింగిల్-ఛానల్ ఎబిఎస్‌తో అందిస్తున్నారు.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, త్వరలో డెలివరీలు!

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఈ సెగ్మెంట్లో సుజుకి జిక్సర్ 150, యమహా ఎఫ్‌జెడ్ 16, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ కాంపిటీటివ్ ధర కారణంగా ఇది భారత మార్కెట్లో అత్యంత పోటీతత్వ మోటారుసైకిల్ విభాగాలలో ఒకటిగా నిలుస్తుంది.

MOST READ:పోలీసుల పెట్రోలింగ్ వాహనాలుగా మారిన సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 బైక్స్

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, త్వరలో డెలివరీలు!

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఈ బ్రాండ్ యొక్క ఎక్స్‌-లైనప్ మోటార్‌సైకిళ్లలో కొత్తగా వచ్చిన ఎంట్రీ లెవల్ మోడల్. ఈ మోటారుసైకిల్ అగ్రెసివ్ లుక్ మరియు ఆకట్టుకునే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది ప్రధానంగా యువ రైడర్లను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేయబడినది.

Source: Zigwheels

Most Read Articles

English summary
Hero MotoCrop recently launched the much-awaited Xtreme 160R motorcycle last month in the Indian market. The new naked motorcycle is offered in two variants: front disc and double-disc, with prices starting at Rs 99,950. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X