కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'ఎక్స్‌ట్రీమ్ 160ఆర్‌'లో అప్‌డేటెడ్ 2020 బిఎస్6 వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఫ్రంట్ డిస్క్ మరియు డబుల్ డిస్క్ అనే రెండు వేరియంట్లలో కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటార్‌సైకిల్ లభ్యం కానుంది.

కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హీరో మోటోకార్ప్ గత 2019 EICMAలో ప్రదర్శించిన 1.R కాన్సెప్ట్ మోడల్ నుండి ప్రత్యక్ష ప్రేరణ పొంది హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్‌ను డిజైన్ చేశారు. ఇందులో ప్రొడక్షన్-రెడీ మోడల్ మొట్టమొదటిగా ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన హీరో వరల్డ్ కార్యక్రమంలో ప్రదర్శించారు.

కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటార్‌సైకిల్‌ను పూర్తిగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న హీరో బ్రాండ్ ఆర్ అండ్ డి ఫెసిలిటీలో డిజైన్ చేసి, డెవలప్ చేశారు. ఇది హీరో బ్రాండ్ నుండి వస్తున్న ప్రీమియం 160సీసీ మోటార్‌సైకిల్, ఇది బిఎస్6 కంప్లైంట్ ఇంజన్‌తో లభ్యం కానుంది. కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఇంజన్ మరింత క్లాస్-లీడింగ్ పెర్ఫార్మెన్స్ మరియు యాక్సిలరేషన్ ఫిగర్‌లను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

MOST READ: కెజిఎఫ్ స్టార్ యష్ లగ్జరీ కార్లు, ఎలా ఉన్నాయో చూసారా ?

కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటారుసైకిల్‌లో 163సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8500rpm వద్ద 15bhp శక్తిని మరియు 6500rpm వద్ద 14Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో హీరో బ్రాండ్ యొక్క ప్రోగ్రామ్డ్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇది సాటిలేని పెర్ఫార్మెన్స్‌ను, మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం, కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటార్‌సైకిల్ కేవలం 4.7 సెకన్లలోనే 0-60 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది సెగ్మెంట్లో కెల్లా ఉత్తతమైన పవర్-టు-వెయిట్ రేషియోని ఆఫర్ చేస్తుంది. బేస్-స్పెక్ మోడల్ మొత్తం 138.5 కిలోగ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఇందులో టాప్-స్పెక్ ట్రిమ్ బేస్ ట్రిమ్ కన్నా 1 కేజీ అధనపు బరువును కలిగి ఉంటుంది.

MOST READ: లగ్జరీ బైక్‌పై కనిపించిన భారత సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి

కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మరింత స్పోర్టీ డిజైన్‌తో మంచి స్టైల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో అనేక ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే, చుట్టూ ఎల్‌ఈడీ లైట్లు (హెడ్‌ల్యాంప్‌లు, డిఆర్‌ఎల్‌లు, ఇండికేటర్స్ మరియు టెయిల్ లైట్స్), ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, ముందు మరియు వెనుక భాగంలో పెటల్ డిస్క్ బ్రేక్‌లు, వీటిని సపోర్ట్ చేసే సింగిల్-ఛానల్ ఏబిఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇందులో మెకానికల్స్ విషయానికి వస్తే, కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ముందు భాగంలో 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుక భాగంలో 7-స్టెప్ రైడర్-అడ్డస్టబల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉంటాయి. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి బ్రేక్స్ మారుతూ ఉంటాయి. ఇందులో ముందు భాగంలో 276 మిమీ పెటల్ డిస్క్‌లు మరియు వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ లేదా 130 మిమీ డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఇందులో సింగిల్-ఛానల్ ఏబిఎస్ స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తుంది.

MOST READ: బుడతడు ఉపయోగించడానికి బుల్లి కారు తయారుచేసిన తండ్రి

కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ మోడల్‌ని మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, హీరో మోటోకార్ప్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ హెడ్ మాలో లే మాసన్ మాట్లాడుతూ "స్ట్రీట్ రేసర్ లాంటి పవర్ టూ వెయిట్ రేషియోతో పిల్లిలాంటి చురుకుదనం మరియు సెగ్మెంట్‌లో కెల్లా మొట్టమొదటి సారిగా పూర్తి టెక్-లోడెడ్ ఫీచర్లు, ఫుల్ ఎల్ఈడి లైట్ ప్యాకేజీతో రూపుదిద్దుకున్న ఈ కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ నిజమైన హెడ్-టర్నర్. పట్టణ వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ ఆధునిక స్ట్రీట్ ఫైటర్‌ను అభివృద్ధి చేశామ"ని అన్నారు.

కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

"స్ట్రీట్ నేకెడ్ నుండి స్పోర్ట్ వరకు ఎక్స్‌ట్రీమ్ 200ఎస్, అడ్వెంచర్ కోసం ఎక్స్‌పల్స్ 200, క్యాజువల్ టూరింగ్ కోసం ఎక్స్‌పల్స్ 200టి వంటి మోడళ్లతో తాము ఇప్పటికే ప్రీమియం మోటార్‌సైకిళ్ల విభాగంలో బలమైన పోటీనిస్తున్నామని, ఈ కొత్త మోడల్‌తో ఈ సెగ్మెంట్లో మరింత బలోపేతం అయ్యామని" అన్నారు.

MOST READ: కరోనా ఎఫెక్ట్ : పండ్లు అమ్ముకుంటున్న టాక్సీ & క్యాబ్ డ్రైవర్లు

కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హీరో మోటోకార్ప్ సేల్స్ అండ్ పార్ట్స్ హెడ్ నవీన్ చౌహాన్ మాట్లాడుతూ, "హీరో వరల్డ్ 2020 కార్యక్రమంలో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ప్రదర్శించబడినప్పటి నుండి, ఆ మోడల్‌ను త్వరలో మార్కెట్లో విడుదల చేయాల్సిందిగా తమకు చాలా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చాయని, ఇప్పుడు ఈ మోటార్‌సైకిల్‌కు మంచి స్పందన లభించిందని, ఈ విభాగంలో తమ వృద్ధిని కొనసాగించేందుకు కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఎంతగానో సహాయపడుతుందని తాము విశ్వసిస్తున్నామని" అన్నారు.

కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

భారత మార్కెట్లో హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఫ్రంట్ డిస్క్ వేరియంట్‌ను రూ.99,950 ధరకు ఆఫర్ చేస్తుండగా, టాప్-స్పెక్ అయిన 'డబుల్ డిస్క్' వేరియంట్‌ను రూ. 1.03 లక్షల ధరకు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విక్రయిస్తున్నారు.

MOST READ: విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP, ఎవరో తెలుసా ?

కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఇప్పుడు బ్రాండ్ యొక్క ఎక్స్‌-లైన్ శ్రేణి మోటార్‌సైకిళ్లలో ఎంట్రీ లెవల్ ప్రొడక్ట్‌గా నిలిచింది. ఇందులో ఇప్పటికే ఎక్స్‌ట్రీమ్ 200ఎస్, ఎక్స్‌పుల్స్ 200 మరియు ఎక్స్‌పుల్స్ 200టి మోడళ్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. కొత్తగా వచ్చిన హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ భారత మార్కెట్లోని ఈ బైక్ సెగ్మెంట్లో టివిఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి, బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 160 మరియు సుజుకి జిక్సర్ 150 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Hero MotoCorp has launched one of its most-anticipated motorcycles in the Indian market, the Xtreme 160R. The new Hero Xtreme 160R is offered in two variants: front disc and double-disc. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X