వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్, త్వరలో విడుదల!

భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్, మరికొద్ది రోజుల్లోనే దేశీయ మార్కెట్లో మరో కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనుంది. హీరో మోటోకార్ప్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బిఎస్6 మోటార్‌సైకిల్‌ను లిస్ట్ చేసింది. ఇది త్వరలోనే ఈ మోడల్ మార్కెట్లోకి రానుందని సూచిస్తోంది.

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్, త్వరలో విడుదల!

ప్రస్తుత పండుగ సీజన్‌లో కొత్త బిఎస్6 హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ ఎప్పుడైనా మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హీరో మోటోకార్ప్ ఇప్పటికే తమ 200సీసీ మోటార్‌సైకిల్ విభాగంలో హీరో ఎక్స్‌పల్స్ 200 మరియు ఎక్స్‌పల్స్ 200టి మోడళ్లలో బిఎస్6 వెర్షన్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే.

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్, త్వరలో విడుదల!

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బిఎస్6 మోడల్ యొక్క డిజైన్ మరియు ఫీచర్లు ఇదివరకటి బిఎస్4 మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే, ఇందులోని ఇంజన్‌ను మాత్రం బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ మోటార్‌సైకిల్‌లోని బిఎస్4 200సిసి లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ 18 బిహెచ్‌పి పవర్ మరియు 17.1 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేసేది. బిఎస్6లో ఈ గణంకాలు స్వల్పంగా మారే అవకాశం ఉంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ఇదే

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్, త్వరలో విడుదల!

మునుపటి బిఎస్4 హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మోడల్‌ను ధర రూ.98,500 (ఎక్స్-షోరూమ్) ధరతో విక్రయించేవారు. అయితే, కొత్త బిఎస్6 మోడల్ దాని ఇంజన్ అప్‌గ్రేడ్స్ కారణంగా మునుపటి ధర కన్నా రూ.10,000 ఉంటుందని అంచనా. అంతేకాకుండా, కంపెనీ ఈ బైక్‌ను కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా విడుదల చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్, త్వరలో విడుదల!

భారత మార్కెట్లో హీరో కరీజ్మా తరువాత, అంతగా పాపులారిటీని తెచ్చుకున్న మోడల్ ఈ హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్. రైడర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్‌లో సింగిల్ ఛానల్ ఏబిఎస్‌ను ఆఫర్ చేస్తున్నారు. హీరో మోటోకార్ప్ ఇటీవలే తమ వినియోగదారుల కోసం రోడ్ సైడ్ అసిస్టెన్స్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రాంను రూ.350 వార్షిక చందాతో కంపెనీ ప్రారంభించింది.

MOST READ:బాలీవుడ్ నటి చేసిన పనికి ఆనందంలో మునిగిపోయిన ఉద్యోగి.. ఇంతకీ ఎం చేసిందో తెలుసా?

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్, త్వరలో విడుదల!

రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు మీ బైక్ ఎక్కడైనా పాడైనా లేదా ఉన్నట్టుండి ఆగిపోయినట్లయితే, ఈ సభ్యత్వం ద్వారా మీరు హీరో రోడ్ సైడ్ అసిస్టెన్స్ సర్వీస్‌కు ఫోన్ చేసి, తగిన పరిష్కారాలను పొందవచ్చు. ఈ సేవను ఉపయోగించుకోవటం కోసం వినియోగదారులు హీరో రోడ్ సైడ్ అసిస్టెన్స్ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు లేదా మై హీరో మొబైల్ అప్లికేషన్ సాయంతో కూడా కస్టమర్ కేర్‌ను సంప్రదించవచ్చు.

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్, త్వరలో విడుదల!

హీరో రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌లో భాగంగా, కంపెనీ తమ వినియోగదారులకు ఆన్-కాల్ సపోర్ట్, రిపేర్ ఆన్-స్పాట్, బైక్ టోయింగ్, ఫ్యూయల్ డెలివరీ, టైర్ డ్యామేజ్ సపోర్ట్, బ్యాటరీ సపోర్ట్, ఆన్-డిమాండ్ యాక్సిడెంటల్ అసిస్టెన్స్ మరియు కీ సపోర్ట్ వంటి కొన్ని కీలక సేవలను అందిస్తుంది.

దేశంలో ఎక్కడైనా బైక్ లోపభూయిష్టంగా ఉంటే ఈ కార్యక్రమానికి సభ్యత్వం పొందిన వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కంపెనీ పేర్కొంది. దారిలో బైక్ చెడిపోయినట్లయితే, కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సర్వీస్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు. ఆ తర్వాత సర్వీస్ ఏజెంట్ కస్టమర్ తెలిపిన ప్రదేశానికి వచ్చి బైక్‌ను రిపేర్ చేయటానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ సమస్య పెద్దదైనట్లయితే, బైక్‌ను సమీపంలోని సర్వీస్ సెంటర్‌కు తరలించి మరమ్మత్తు చేస్తారు.

MOST READ:నీటిపై ల్యాండ్ అయ్యే విమానం మీరు ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

Most Read Articles

English summary
Hero Xtreme 200S BS6 listed on website, India launch expected very soon, details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X