ఇప్పుడు బిఎస్ 6 హోండా అక్టీవా 125 స్కూటర్ మైలేజ్ ఎంతో తెలుసా!

సాధారణంగా వాహనాలను కొనే ఎవ్వరైనా ముందుగా వాటి యొక్క ఫీచర్స్ ని చూస్తారు. ఇందులో కూడా ముఖ్యంగా గమనించే విషయం ఏమిటంటే మైలేజ్. ప్రతి వినియోగదారుడు మైలేజ్ ఎక్కువగా ఇచ్చే వాహనాలను కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తాడు. కాబట్టి చాలా సంస్థలు కూడా మైలేజ్ ఎక్కువగా ఉండేట్లు వాహనాలను తయారు చేస్తారు. ఇప్పుడు హోండా నుండి వచ్చిన బిఎస్ 6 ఆక్టీవా 125 ఏకంగా 100 మి.లీ పెట్రోల్ తో ఏకంగా 7 కిలోమీటర్ల గరిష్ట పరిధిని అందిస్తుంది. దీని గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం!

ఇప్పుడు బిఎస్ 6 హోండా అక్టీవా 125 స్కూటర్ మైలేజ్ ఎంతో తెలుసా!

కొత్త వాహనం మార్కెట్లోకి వచ్చిన ప్రతి సారి అందరూ అడిగే మొదటి ప్రశ్న వాహనం యొక్క మైలేజ్ ఎంత అని. ఈ మైలేజ్ కి అనుగుణంగా హోండా బిఎస్ 6 వెర్షన్ ఆక్టీవా 125 ని తయారు చేయడం జరిగింది. ఆక్టీవా 125 స్కూటర్ ని చాలా సార్లు మైలేజ్ టెస్టులు చేయడం జరిగింది. హోండా యొక్క మైలేజ్ టెస్టులు జరిపిన వీడియో మనకు ఇక్కడ కనిపిస్తుంది.

ఇప్పుడు బిఎస్ 6 హోండా అక్టీవా 125 స్కూటర్ మైలేజ్ ఎంతో తెలుసా!

వీడియో స్కూటర్ ని చూపించడం నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ ని రైడ్ చేసే రైడర్ ముందుగానే ఇందులో ఉన్న మొత్తం పెట్రోల్ ని తీసివేసినట్లు చెప్పారు. తరువాత ఈ స్కూటర్లో 100 మీ.లీ పెట్రోల్ పోయడం మనం చూడవచ్చు. అప్పుడు ఓడోమీటర్ ని చూపిస్తుంది, మరియు ట్రిమ్ మీటర్ ని సున్నాకి రీసెట్ చేస్తారు.

ఇప్పుడు బిఎస్ 6 హోండా అక్టీవా 125 స్కూటర్ మైలేజ్ ఎంతో తెలుసా!

ఇవన్నీ సిద్ధం చేసుకున్న తరువాత ఆక్టివా 125 రద్దీగా ఉండే ప్రాంతం గుండా వెళుతుంది. అక్కడ స్కూటర్ యొక్క వేగం 40 కి.మీ. ఆక్టివాలోని పెట్రోల్ పూర్తిగా పూర్తయ్యే వరకు రైడర్ స్కూటర్‌ను నడుపుతూనే ఉన్నాడు. కొంత సమయం తరువాత స్కూటర్ తక్కువ పెట్రోల్ ఉన్న యొక్క సంకేతాలను చూపించడం ప్రారంభించింది మరియు చివరికి స్కూటర్లోని మొత్తం పెట్రోల్ అయిపోతుంది.

ఇప్పుడు బిఎస్ 6 హోండా అక్టీవా 125 స్కూటర్ మైలేజ్ ఎంతో తెలుసా!

అప్పుడు మనం ట్రిమ్ మీటర్ ని చూసినట్లయితే 7 కి.మీ దూరాన్ని కవర్ చేసినట్లు చూపించింది. అంటే 100 మీ.లీ పెట్రోల్ ని ఉపయోగించి రైడర్ 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. ఈ లెక్కన చూస్తే యాక్టివా 125 బిఎస్ 6 ఒక లీటర్ పెట్రోల్ తో దాదాపు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

ఇప్పుడు బిఎస్ 6 హోండా అక్టీవా 125 స్కూటర్ మైలేజ్ ఎంతో తెలుసా!

బిఎస్ 6 హోండా ఆక్టివా 125 లో మైలేజ్ తో పాటు ఫీచర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆక్టీవాలోని ఫీచర్స్ ని మనం ఒక సారి గమనయించినట్లైతే ఇందులో రివైజ్డ్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, ఫ్రంట్ ఎండ్ మరియు సైడ్‌లలో క్రోమ్ ట్రిమ్ వంటివి ఉంటాయి. ఈ స్కూటర్ ఎటువంటి మార్గాలలో అయిన రైడ్ చేయడానికి అనుగుణంగా తయారు చేయబడింది. ఇది స్త్రీ మరియు పురుషులు ఇద్దరినీ లక్ష్యంగా చేసుకుని తయారు చేయడం జరిగింది.

ఇప్పుడు బిఎస్ 6 హోండా అక్టీవా 125 స్కూటర్ మైలేజ్ ఎంతో తెలుసా!

యాక్టివా 125 యొక్క 125 సిసి సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పొందుతుంది. ఇప్పుడు ఇది 8.1 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉన్న ఫ్యూయల్ ఇంజెక్షన్ స్కూటర్‌ను మరింత సమర్థవంతంగా చేస్తుంది. యాక్టివా 125 బిఎస్ 6 వెర్షన్ 3 వేరియంట్లలో లభిస్తుంది. అవి వరుసగా స్టాండర్డ్, అల్లాయ్ మరియు డీలక్స్. ఈ మూడు వేరియన్ల ధరలు ఈ విధంగా ఉంటాయి. స్టాండర్డ్ ధర రూ. 67,490, అల్లాయ్, డీలక్స్ వేరియంట్ల ధరలు రూ. 70,990, రూ. 74,490.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

హోండా అక్టీవా 125 ఇప్పుడు ఒక లీటర్ పెట్రోల్ కి దాదాపు 70 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది వినియోగదారుని బాగా అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఉన్న ఫీచర్స్ మరియు ధరలు వినియోగదారులను ఎంతగానో ఆకర్షించడానికి ఉపయోగపడతాయి.

Image Courtesy: AAP K Vlogs/YouTube

Most Read Articles

English summary
Honda Activa 125 BS6 mileage test: Check it out [Video]. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X