వచ్చే నెలలో ప్రారంభం కానున్న హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా, గడచిన మార్చ్ నెలలో లాక్‌డౌన్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే తమ సరికొత్త 2020 'హోండా ఆఫ్రికా ట్విన్' మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. విడుదల సమయంలోనే ఈ మోటార్‌సైకిల్ కోసం బుకింగ్‌లను ప్రారంభించగా, మే నెలలో డెలివరీలు ప్రారంభమవుతాయని అందరూ భావించారు.

వచ్చే నెలలో ప్రారంభం కానున్న హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు

అయితే, ఆ తర్వాత అనుకోకుండా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించడం మరోవైపు దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న కోవిడ్-19 పరిస్థితుల కారణంగా ఈ మోటార్‌సైకిల్ డెలివరీ ఆలస్యమైంది. కాగా, టీమ్‌బిహెచ్‌పి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కొత్త 2020 హోండా ఆఫ్రికా ట్విన్ వచ్చే నెల నుంచి డీలర్‌షిప్‌లు మరియు కస్టమర్లకు చేరుకుంటుందని సమాచారం.

వచ్చే నెలలో ప్రారంభం కానున్న హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు

ప్రారంభంలో భాగంగా, కేవలం మాన్యువల్ వేరియంట్ హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో డిసిటి ఆటోమేటిక్ వేరియంట్ జనవరి 2021 నాటికి డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులోకి రావచ్చని అంచనా.

MOST READ: భీమా డబ్బు కోసం తప్పుడు కేసు పెట్టిన ఆడి A4 కార్ ఓనర్

వచ్చే నెలలో ప్రారంభం కానున్న హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు

భారత మార్కెట్లో 2020 హోండా ఆఫ్రికా ట్విన్ రెండు వేరియంట్లలో ఆఫర్ చేయనున్నారు. అందులో ఒకటి స్టాండర్డ్, మరొకటి అడ్వెంచర్ స్పోర్ట్స్. దేశీయ విపణిలో ఈ బైక్ ప్రారంభ ధర రూ.15.35 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది. మునుపటి సంవత్సరం మోడల్‌తో పోల్చుకుంటే ఈ కొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో మరిన్ని అదనపు ఫీచర్లు, అప్‌గ్రేడ్స్, కనెక్టింగ్ టెక్నాలజీ మరియు అప్‌డేటెట్ ఇంజన్ వంటి మార్పులు ఉన్నాయి.

వచ్చే నెలలో ప్రారంభం కానున్న హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు

హోండా ఆఫ్రికా ట్విన్ స్టాండర్డ్ వేరియంట్‌తో పోల్చుకుంటే ఇందులోని ‘అడ్వెంచర్ స్పోర్ట్స్' మరిన్ని ఎక్కువ ఫీచర్లు లభిస్తాయి. ఇందులో క్రాష్ ప్రొటెక్టివ్ ఎక్స్‌టర్నల్ ఫ్రేమ్, ఎత్తు-సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్, ట్యూబ్‌లెస్ టైర్ రెడీ సెటప్‌తో కూడిన స్పోక్డ్ అల్లాయ్ వీల్స్ మరియు బాష్ ప్లేట్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

MOST READ: బిడది ప్లాంట్‌లో టొయోటా సేవలు పునఃప్రారంభం

వచ్చే నెలలో ప్రారంభం కానున్న హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు

కొత్త 2020 హోండా ఆఫ్రికా ట్విన్ మోటార్‌సైకిల్‌లో 1084సీసీ పారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500rpm వద్ద గరిష్టంగా 101bhp శక్తిని మరియు 6250rpm వద్ద 105Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది మరియు ఇందులో మూడు స్థాయిల ఎలక్ట్రానిక్ ఇంజన్ బ్రేకింగ్‌తో కూడిన డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా అందుబాటులో ఉంటుంది.

వచ్చే నెలలో ప్రారంభం కానున్న హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు

ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 6.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో అప్‌డేట్ చేసిన హెచ్‌ఎస్‌టిసి (హోండా సెలెక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్), సిక్స్-యాక్సిస్ ఇనెర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్, మూడు-స్థాయిల వీలీ కంట్రోల్ సిస్టమ్ మరియు మొత్తం ఆరు రైడింగ్ మోడ్స్ (టూర్, అర్బన్ , గ్రావెల్, ఆఫ్-రోడ్ మరియు రైడర్ ప్రకారం రెండు కస్టమైజ్డ్ ప్రోగ్రామ్స్) వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ: నదిలో పడిపోయిన కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఉన్న హోండా సిటీ, తర్వాత ఏం జరిగిందంటే ?

వచ్చే నెలలో ప్రారంభం కానున్న హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు

సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు వైపు 230 మిమీ ట్రావెల్‌తో కూడిన షోవా 45 మిమీ కార్ట్రిడ్జ్-టైప్ ఇన్‌వెర్టెడ్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుక వైపు 220 మిమీ ట్రావెల్‌తో మోనో-షాక్ సస్పెన్షన్లను ఇందులో జోడించారు. అలాగే బ్రేకింగ్ సిస్టమ్‌ను గమనిస్తే, ఇందులో ముందు వైపు డ్యూయెల్ 310 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు 256 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉపయోగించారు. ఆఫ్-రోడ్ రైడింగ్ సమయంలో వెనుక చక్రంలో రైడర్‌కు మరింత మద్దతు ఇచ్చేలా స్విచ్-ఆఫ్ చేసే సామర్ధ్యంతో కూడిన డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్ సిస్టమ్‌ను ఇందులో జోడించారు.

వచ్చే నెలలో ప్రారంభం కానున్న హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు

హోండా ఆఫ్రికా ట్విన్ మోటార్‌సైకిల్ డెలివరీలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఇతర కంపెనీల మాదిరిగానే హోండా కూడా ప్రభావితమైంది. ఈ కొత్త 2020 ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ మోటారుసైకిల్‌ను మునుపటి మోడల్‌తో పోలిస్తే ఇందులో ఎక్కువ మార్పులు ఉన్నాయి. కేవలం ఆన్-రోడ్‌పై మాత్రమే కాకుండా రోడ్లు సైతం లేని ఆఫ్-రోడ్ టెర్రైన్లపై కూడా నడిపేందుకు వీలుగా దీనిని డిజైన్ చేశారు.

Most Read Articles

English summary
The 2020 Honda Africa Twin was launched in March just before the nation-wide lockdown came into effect. Bookings for the motorcycle began at the time of launch and the deliveries were expected to begin in May. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X