భారత్‌కు రానున్న హోండా సిబి హార్నెట్ 200ఆర్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎమ్ఎస్‌ఐ) భారత మార్కెట్లో మరో కొత్త మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. జిగ్‌వీల్స్ ప్రచురించిన కథనం ప్రకారం, హోండా తమ పాపురల్ మోటార్‌సైకిల్ 'సిబి హార్నెట్ 200ఆర్'ను దేశీయ విపణిలో విడుదల చేసే అవకాశం ఉంది.

భారత్‌కు రానున్న హోండా సిబి హార్నెట్ 200ఆర్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

కొత్త హోండా సిబి హార్నెట్ 200ఆర్ మోడల్‌నుకంపెనీ ఆగస్టు 27, 2020వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. కొత్త సిబి హార్నెట్ 200ఆర్ దాని చిన్న డిస్‌ప్లేస్‌మెంట్ వెర్షన్ సిబి హార్నెట్ 160ఆర్ స్థానాన్ని రీప్లేస్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మోడల్ ఇంకా బిఎస్6కి అనుగుణంగా అప్‌డేట్ కాలేదు.

భారత్‌కు రానున్న హోండా సిబి హార్నెట్ 200ఆర్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

బిఎస్4 మరియు బిఎస్6 మోడళ్ల మధ్య ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో, కంపెనీ 160ఆర్ స్థానాన్ని 200ఆర్ స్థానంతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ అందిస్తున్న మరో మోడల్ 'ఎక్స్‌బ్లేడ్' దీనికి సరైన ఉదాహరణ. హోండా ఎక్స్‌బ్లేడ్ బిఎస్4 మోడల్‌ను బిఎస్6కి అప్‌డేట్ తర్వాత దాని ధర రూ.17,000 పెరిగింది. ఈ నేపథ్యంలో హార్నెట్ 160ఆర్ కొనుగోలుదారులను ఎక్స్‌బ్లేడ్ ఆకర్షించే అవకాశం ఉంది. అందుకే కంపెనీ 160ఆర్ మోడల్‌ను దాని పెద్ద 200సిసి మోడల్‌తో భర్తీ చేయటం ఆర్థికంగా మంచిదని కంపెనీ యోచిస్తోంది.

MOST READ:కారులో భార్య ఉంగరం పోయింది.. భర్త దాన్ని ఎలా కనిపెట్టించాడో తెలుసా ?

భారత్‌కు రానున్న హోండా సిబి హార్నెట్ 200ఆర్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

సిబి హార్నెట్ 200ఆర్ ద్వారా హోండా భారత మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న 200సీసీ మోటార్‌సైకిల్ విభాగంలోకి ప్రవేశించనుంది. ఇది ఈ విభాగంలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్200, టివిఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి మొదలైన మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

భారత్‌కు రానున్న హోండా సిబి హార్నెట్ 200ఆర్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

హోండా ఇంతకు ముందు భారతదేశంలో సిబిఎఫ్ 190 ఆర్‌కు పేటెంట్ ఇచ్చింది, బహుశా ఇది హార్నెట్ 200ఆర్ ఆధారంగా తయారు చేసే మోడల్ కావచ్చు. హోండా సిబి హార్నెట్ 200ఆర్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ భారతదేశంలోనే తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా చేయటం వలన కంపెనీ సరసమైన ధరకే ఈ మోడల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

MOST READ:ఫారం 20 సవరణకు నాయకత్వం వహించనున్న కేంద్ర ప్రభుత్వం

భారత్‌కు రానున్న హోండా సిబి హార్నెట్ 200ఆర్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

హోండాకి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ తమ ఎక్స్-బ్లేడ్ ధరలను రూ.576 మేర పెంచింది. తాజాగా ధరల పెంపు తర్వాత ప్రస్తుతం మార్కెట్లో హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్6 కొత్త ధరలు ఇలా ఉన్నాయి. ఎక్స్-బ్లేడ్ సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,06,687 గాను మరియు డ్యూయెల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,10,968 గాను (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.

భారత్‌కు రానున్న హోండా సిబి హార్నెట్ 200ఆర్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్6 మోడల్‌లో ఇదివరకటి 160సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌నే కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించారు. ఈ ఇంజన్ 8000 ఆర్‌పిఎమ్ వద్ద 13.67 బిహెచ్‌పి శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 14.7 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:మొదటి రోజు భారీ బుకింగ్స్ నమోదు చేసిన కియా సోనెట్ ; ఎంతో తెలుసా ?

భారత్‌కు రానున్న హోండా సిబి హార్నెట్ 200ఆర్; దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

హోండా సిబి హార్నెట్ 200ఆర్ మోడల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హోండా సిబి హార్నెట్ 200ఆర్ భారతదేశంలో ప్రవేశపెడితే, ఇండియన్ 200 సిసి మోటార్‌సైకిల్ విభాగంలో హోండాకి ఇది బలమైన మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ విభాగంలో మంచి కాంపిటీటివ్ ధరకు ఈ మోడల్‌ను ప్రవేశపెట్టి, ధర నిర్ణయించినట్లయితే, హార్నెట్ 200ఆర్ భారత మార్కెట్లో బ్రాండ్‌కు ప్రసిద్ధ ఉత్పత్తిగా మారే అవకాశం ఉంది.

Source: gaadiwaadi

Most Read Articles

English summary
Honda Motorcycle & Scooters India (HMSI) is all set to introduce a new motorcycle in the Indian market. According to ZigWheels, this new motorcycle could be a brand new 200cc model, in the form of the CB Hornet 200R. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X