Just In
- 9 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 21 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 21 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 24 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- Sports
RCB vs KKR: ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే.. ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శిస్తామో తెలీదు: డివిలియర్స్
- News
కరోనా టీకానే వివేక్‌ను బలి తీసుకుంది.. నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆరోపణలు
- Movies
Vakeelsaab 9 days collections: టార్గెట్‌కు ఇంకా కొద్దీ దూరంలోనే.. కోవిడ్ కష్టకాలంలో సాధ్యమేనా?
- Finance
జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో ట్రాన్సాక్షన్స్ ఛార్జీలపై ఎస్బీఐ వడ్డీ రేటు, ఫ్రీ ట్రాన్సాక్షన్స్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సరికొత్త మైలురాయిని చేరుకున్న హోండా షైన్; ఇప్పటికీ నెంబర్ వన్ ఛాయిస్..
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ హోండా సిబి షైన్ ఇప్పుడు ఓ కొత్త మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది.

భారత టూవీలర్ మార్కెట్లోని 125సీసీ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా కొనసాగుతున్న హోండా సిబి షైన్‌ను మార్కెట్లో విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ 90 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.

హోండా షైన్ మోటార్‌సైకిల్‌ను తొలిసారిగా 2006లో ప్రారంభించారు. ఇప్పటికీ ఇది 125సీసీ విభాగంలో కస్టమర్లకు నెంబర్ వన్ ఛాయిస్‌గా కొనసాగుతోంది. హోండా షైన్ ఈ విభాగంలో అత్యధికంగా 39 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
MOST READ:ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ డ్రైవింగ్ లైసెన్స్ 9 నెలలు సస్పెండ్ : ఎందుకో తెలుసా ?

గడచిన నవంబర్ 2020 నెలలోనే హోండా గరిష్టంగా 94,413 షైన్ మోడళ్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (నవంబర్ 2019లో) 75,144 యూనిట్ల షైన్ మోడళ్లు అమ్ముడయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే ఇవి 26 శాతం వృద్ధిని సాధించాయి.

హోండా షైన్ 125సిసి ఇంజన్‌తో లభిస్తుంది. ఈ బిఎస్6 ఇంజన్ గరిష్టంగా 10.72 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఇది అధికంగా 0.7 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?

భారత ద్విచక్ర వాహన మార్కెట్లోని 125సిసి విభాగంలో కంపెనీ పోర్ట్‌ఫోలియో నుండి అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో హోండా షైన్ ఒకటి. ఈ మోటారుసైకిల్ విడుదలైనప్పటి ఇప్పటి వరకూ ఇందులో అనేక రిఫ్రెష్డ్ వెర్షన్లు మార్కెట్లోకి వచ్చాయి. రానున్న సంవత్సరాల్లో ఈ మోడల్ మరింత అధిక సంఖ్యలో అమ్ముడువుతందని కంపెనీ ధీమాగా ఉంది.

షైన్ బ్రాండ్ సాధించిన మైలురాయి గురించి హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ మరియు సిఇఒ అట్సుషి ఒగాటా మాట్లాడుతూ, షైన్ బ్రాండ్‌పై 90 లక్షల మందికి పైగా కస్టమర్లు విశ్వాసం ఉంచడం పట్ల తమకెంతో సంతోషంగా ఉందని, దశాబ్ధాలుగా ఈ మోడల్‌ను కస్టమర్ అంచనాలకు, అభిరుచి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తూ వచ్చామని అన్నారు.

ఇదే విషయం గురించి హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యాద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, హోండా షైన్ భారతదేశానికి ఇష్టమైన 125సిసి మోటార్‌సైకిల్‌గా కొనసాగుతోందని మరియు ఇది తమ ప్రోడక్డ్ పోర్ట్‌ఫోలియోలో చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉందని అన్నారు.

హోండా మోటార్‌సైకిల్స్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ అందిస్తున్న హెచ్‌నెస్ సిబి 350 మోడల్‌పై కంపెనీ ఇయర్-ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 2020 ఆఫర్లలో భాగంగా, కంపెనీ ఈ మోడల్‌పై నగదు ప్రయోజనాలను మరియు ప్రత్యేక ఫైనాన్స్ పథకాలను అందిస్తోంది.

ఈ డిసెంబర్2020 నెలలో హోండా హెచ్‌నెస్ సిబి 350 రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌ను క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఈఎమ్ఐ ఫైనాన్స్ ఆఫర్ ఉపయోగించి కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేసిన కస్టమర్లు రూ.5,000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.