Just In
- 21 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 23 hrs ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో వచ్చే ఏడాది హోండా సిబిఆర్650ఆర్ విడుదల - వివరాలు
భారత మార్కెట్లో ప్రీమియం మోటార్‌సైకిళ్లకు క్రమక్రంగా డిమాండ్ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో, జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా, ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన తమ సరికొత్త 2021 సిబిఆర్650ఆర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో కూడా విడుదల చేయాలని చూస్తోంది.

కొత్త 2021 హోండా సిబిఆర్605ఆర్ మోటార్‌సైకిల్ ఇప్పుడు మరింత క్లీన్ మరియు శక్తివంతమైన బిఎస్6 ఇంజన్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఇందులోని కొన్ని ఫీచర్లను కూడా అప్‌గ్రేడ్ చేశారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో హోండా తమ కొత్త 2021 సిబిఆర్650ఆర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ కొత్త బిఎస్6 మోటార్‌సైకిల్ ఇప్పుడు మరింత షార్ప్ డిజైన్‌ను కలిగి ఉంటుంది, ఇందుకు ప్రధాన కారణం దీనిలో రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్ యూనిట్ మరియు కొత్త సైడ్ ఫెయిరింగ్‌లుగా చెప్పుకోవచ్చు. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త సిబిఆర్650ఆర్ మోటార్‌సైకిల్‌కు మరింత స్పోర్టీయర్ ఛాస్సిస్ కూడా లభిస్తుంది.
MOST READ: అక్టోబర్ 8న ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల: అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో, ఇప్పుడు కొత్తగా 41 మిమీ షోయా స్పెషల్ ఫంక్షన్ బిగ్ పిస్టన్‌తో కూడిన అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌లు ఉంటాయి. అలాగే వెనుక వైపున ప్రో-లింక్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 310 మిమీ డ్యూయెల్ డిస్క్‌లు మరియు వెనుక భాగంలో 240 మిమీ రియర్ డిస్క్ బ్రేక్ ఉంటాయి.

ఇంజన్ విషయానికి వస్తే, ఇందులోని 649సిసి ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్ బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ ఇసియు, కామ్ లోబ్స్, ఇంటెక్ టైమింగ్, ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు క్రాంక్ షాఫ్ట్ కూడా పొందుతుంది. ఈ ఇంజన్ ఇప్పుడు గరిష్టంగా 12,000 ఆర్‌పిఎమ్ వద్ద 94 బిహెచ్‌పి పవర్‌ను మరియు 8500 ఆర్‌పిఎమ్ వద్ద 63 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ: టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్స్ విడుదల; ధర, వివరాలు

అయితే, భారతదేశంలో విక్రయించిన ఇదివరకటి హోండా సిబిఆర్650ఆర్ బిఎస్4 వేరియంట్ గరిష్టంగా 86 బిహెచ్‌పిల పవర్‌ను మరియు 60 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసేది. ఈ ఇంజన్ స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌లో స్విచ్ చేయగల హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ కూడా ఉంటుంది.

హోండా సిబిఆర్650ఆర్ మోడల్‌లోని ఏడు అంగుళాల ఎల్‌సిడి యూనిట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా రైడర్ అనేక రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ మోటార్‌సైకిల్‌లో సేఫ్టీ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ మరింత మెరుగుపరచబడింది. ఇది సమీపంలో ఉన్న మరియు రాబోయే వాహనాలను హెచ్చరించడానికి ఆకస్మిక హార్డ్ బ్రేకింగ్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్‌లో స్టాండర్డ్ డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది.
MOST READ: రెనో కార్లపై రూ.70,000 డిస్కౌంట్స్; ఏయే మోడల్‌పై ఎంతో తెలుసా?

భారత్‌లో హోండా సిబిఆర్650ఆర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
కొత్త 2021 హోండా సిబిఆర్650ఆర్ మునుపటి తరం మోడల్ కంటే చాలా సన్నగా మరియు షార్ప్‌గా కనిపిస్తుంది. మార్కెట్లో దీని ధర రూ.7.5 లక్షల నుండి రూ.8.5 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. మార్కెట్లో విడుదలైతే ఇది కవాసాకి నింజా 650 మరియు రాబోయే బెనెల్లి 600ఆర్ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.