Just In
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Don't Miss
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- News
ఏపీలో టెన్షన్, టెన్షన్- మొదలుకాని నామినేషన్లు- ఎస్ఈసీ ఆఫీసులోనే నిమ్మగడ్డ
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Movies
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హోండా సిడి 110 బైక్ కొనుగోలుపై ఇప్పుడు 5000 ఆదా చేసే అవకాశం.. ఎలాగో తెలుసా ?
ఆటో పరిశ్రమలో దాదాపు తయారీదారు పండుగ సీజన్ ఆఫర్లు భారీగా ప్రకటించారు. ఈ పండుగ సీజన్ ఆటో పరిశ్రమకి బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు కంపెనీలు ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలో హోండా కంపెనీ కూడా తన సిడి 110 బైక్ పై భారీ అఫర్ ని ప్రకటించింది. దీని గురించి పూర్తి సమాచరం ఇక్కడ తెలుసుకుందాం.

హోండా సిడి 110 పై కంపెనీ క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ మరియు ఇఎంఐపై రూ. 5000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ కంపెనీ మోడల్ యొక్క డీలక్స్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. దీనికి డాక్యుమెంటేషన్, డౌన్ పేమెంట్ అవసరం లేదని కంపెనీ తెలిపింది.

హోండా సిడి 110 స్టాండర్డ్ మరియు డీలక్స్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. హోండా సిడి 110 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 64,508 కాగా, డీలక్స్ వెర్షన్ ధర రూ. 65,508 గా ఉంటుంది.
MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

కంపెనీ ప్రవేశపెట్టిన ఈ అఫర్ ద్వారా రూ. 5000 ఆదా చేయగా ఇప్పుడు దీనిని 60,508 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది సంస్థ యొక్క ఎంట్రీ లెవల్ మోడళ్లలో ఒకటి, అంతేకాకుండా అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో కూడా ఒకటి. ఇది పండుగ సీజన్ తర్వాత కూడా వినియోగదారులను ఆకర్షించడానికి కెంపెనీ ఈ ఆఫర్‌ను తీసుకువచ్చింది.

కొంతకాలం క్రితం, కంపెనీ కొత్త ఫైనాన్స్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద, మీరు హోండా యొక్క ఏదైనా ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు మరియు దాని ఖర్చులో 95 శాతం ఫైనాన్స్ తీసుకునే సదాహుపాయం ఉంటుంది. వినియోగదారులు మొదటి మూడు నెలల్లో కొత్త ద్విచక్ర వాహన ఇఎంఐలో సగం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన ఇఎంఐలను తరువాతి నెలల్లో తిరిగి చెల్లించవచ్చు.
MOST READ:ఈ బుల్లి ఫోక్స్‌వ్యాగన్ బీచ్ బాంబ్ విలువ రూ.1.1 కోట్లకు పైమాటే!

వినియోగదారులు లోన్ యొక్క గడువును 36 నెలలకు పొడిగించవచ్చు, కాబట్టి వారికి సమయం సమస్య ఉండదు. కస్టమర్ యొక్క ప్రొఫైల్‌ను చూడటం ద్వారా ఈ ఆఫర్ యొక్క ప్రయోజనం ఇవ్వబడుతుంది, ఇది ఫైనాన్షియర్ అవసరానికి అనుగుణంగా ఉండాలి.

సిడి 110 బైక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో తీసుకురాబడింది. మెరుగైన స్మార్ట్ పవర్ కూడా ఇందులో ఉపయోగించబడింది, దీని కింద హోండా ఎసిజి స్టార్టర్ కూడా ఇవ్వబడింది, దీని కారణంగా దాని మైలేజ్ కూడా పెరిగింది. కొత్త హోండా సిడి 110 డ్రీమ్‌లో కొత్త డిసి హెడ్‌ల్యాంప్ ఉంది.
MOST READ:భారతదేశ మసాలా కింగ్ ధరంపాల్ గులాటి కార్లు.. మీరు చూసారా !

హొండా సిడి 110 బైక్ యొక్క సీటు మునుపటికంటే 15 మిమీ పొడవుగా ఉంటుంది. కావున సీటు ఇప్పుడు చాల సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో బ్రేకింగ్ కోసం కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఉపయోగించబడింది. దీని ట్యాంక్ మరియు సైడ్ కవర్ ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ కలిగి ఉంటుంది.

హొండా సిడి 110 బైక్ డీలక్స్ వేరియంట్లలో బ్లాక్, జెన్నీ గ్రే మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ మరియు అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ అనే కలర్ ఆప్సన్స్ ఉంటాయి. హోండా 2020 నవంబర్‌లో మొట్ట 433,206 యూనిట్ల వాహనాల అమ్మకాలు జరిగాయి. ఈ గణాంకాల ప్రకారం అమ్మకాలు మునుపటికంటే 9 శాతం వృద్ధి చెందింది.
MOST READ:భారత నావీలో మరో బ్రహ్మాస్త్రం.. శత్రువుల గుండెల్లో గుబేల్..