హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు ప్రారంభం; గుర్గావ్‌లో తొలి కస్టమర్‌కు డెలివరీ

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తమ సరికొత్త మోటార్‌సైకిల్2020 హోండా ఆఫ్రికా ట్విన్ డెలివరీలను భారత్‌లో ప్రారంభించింది. ఈ మొదటి అడ్వెంచర్ మోటార్‌సైకిల్ హర్యానాలోని గుర్గావ్‌లోని ఓ కస్టమర్‌కు పంపిణీ చేసింది. ఈ జపనీస్ టూవీలర్ బ్రాండ్ మాన్యువల్ వేరియంట్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడం ఇదే మొదటిసారి.

హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు ప్రారంభం; గుర్గావ్‌లో తొలి కస్టమర్‌కు డెలివరీ

వాస్తవానికి కొత్త 2020 హోండా ఆఫ్రికా ట్విన్ కోసం డెలివరీలు మే 2020లో ప్రారంభం కావాల్సి ఉంది. కాకపోతే, దేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి మరియు దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ల కారణంగా ఇది ఆలస్యమైంది.

హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు ప్రారంభం; గుర్గావ్‌లో తొలి కస్టమర్‌కు డెలివరీ

హోండా భారత్‌లో లాక్‌డౌన్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే తమ సరికొత్త 2020 ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ భారత్‌లో విడుదల చేసింది. హోండా ఆఫ్రికా ట్విన్ మాన్యువల్ మరియు డిసిటి (ఆటోమేటిక్) అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. దేశీయ విపణిలో మాన్యువల్ వేరియంట్ ధర రూ.15.35 లక్షలు, డిసిటి ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.16.1 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి.

MOST READ:కెజిఎఫ్ స్టార్ యష్ లగ్జరీ కార్లు, ఎలా ఉన్నాయో చూసారా ?

హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు ప్రారంభం; గుర్గావ్‌లో తొలి కస్టమర్‌కు డెలివరీ

భారత్‌లో తొలి హోండా ఆఫ్రికా ట్విన్ మోటార్‌సైకిల్ డెలివరీని చేసిన సందర్భంగా హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యాద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ.. "మా ప్రీమియం మోటార్‌సైకిల్ వ్యాపారంలో బిఎస్6 శకాన్ని ప్రారంభిస్తూ, హోండా ఈ ఏడాది మార్చిలో సరికొత్త 2020 ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ ట్రూఅడ్వెంచర్ మోటార్‌సైకిల్ మొదటి డెలివరీని ప్రారంభించినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. అడ్వెంచర్ ప్రియులను మరింత ఆకట్టుకునేలా ఈ బైక్ ఉంటుంద"ని అన్నారు.

హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు ప్రారంభం; గుర్గావ్‌లో తొలి కస్టమర్‌కు డెలివరీ

భారత మార్కెట్లో అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల కోసం హోండా అనేక యాక్ససరీలను విక్రయిస్తోంది. ఇందులో టాప్ బాక్స్, ఎక్స్‌టెండెడ్ విజర్, టూ-వే క్విక్ షిఫ్టర్, మెయిన్ స్టాండ్, ర్యాలీ స్టెప్, ఇంజన్ గార్డ్, ఫ్రంట్ ఫాగ్ లైట్లు మరియు స్మోక్డ్ విండ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆఫ్రికా ట్విన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు వెర్షన్లలోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి.

MOST READ:ప్రయాణికులకు గుడ్ న్యూస్ : తత్కాల్ సర్వీస్ ప్రారంభించిన ఇండియన్ రైల్వే

హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు ప్రారంభం; గుర్గావ్‌లో తొలి కస్టమర్‌కు డెలివరీ

ఈ కొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్ మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే మరిన్ని కొత్త హంగులతో వస్తుంది. ఇందులో అప్‌డేటెడ్ ఇంజన్, కనెక్టింగ్ టెక్నాలజీలు కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో ఎక్స్‌టర్నల్ క్రాష్ ప్రొటెక్టివ్ ఫ్రేమ్, ఎత్తు-సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్, పెద్ద ఇంధన ట్యాంక్, ట్యూబ్‌లెస్-రెడీ స్పోక్డ్ అల్లాయ్ వీల్స్ మరియు బాష్ ప్లేట్ ఉన్నాయి.

హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు ప్రారంభం; గుర్గావ్‌లో తొలి కస్టమర్‌కు డెలివరీ

కొత్త 2020 హోండా ఆఫ్రికా ట్విన్ బైక్‌లో 1084 సిసి పారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7500rpm వద్ద గరిష్టంగా 101bhp శక్తిని మరియు 6250rpm వద్ద 105Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ వేరియంట్‌లోని ఇంజన్ స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇకపోతే ఆటోమేటిక్ డిసిటి ట్రాన్స్‌మిషన్ వేరియంట్ మూడు స్థాయిల ఎలక్ట్రానిక్ ఇంజన్ బ్రేకింగ్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:లగ్జరీ బైక్‌పై కనిపించిన భారత సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి

హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు ప్రారంభం; గుర్గావ్‌లో తొలి కస్టమర్‌కు డెలివరీ

ఈ కొత్త మోటారుసైకిల్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 6.5 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఈ మోటార్‌సైకిల్‌ను నిటారుగా ఉంచడానికి, మూడు-స్థాయిల వీలీ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు రైడింగ్ మోడ్స్ (టూర్, అర్బన్, గ్రావెల్, ఆఫ్-రోడ్ మరియు రైడర్ ప్రకారం కస్టమైజ్ చేసుకోదగిన రెండు ప్రోగ్రామ్‌లు) ఉంటాయి.

హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు ప్రారంభం; గుర్గావ్‌లో తొలి కస్టమర్‌కు డెలివరీ

ఈ మోటారుసైకిల్ సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు వైపు 230 మిమీ ట్రావెల్‌తో షోవా 45 మిమీ కార్ట్రిడ్జ్-టైప్ ఇన్వెర్టెడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో 220 మిమీ ట్రావెల్‌తో మోనో-షాక్ సస్పెషన్లు ఉంటాయి. రెండు చివర్లలో ఉన్న సస్పెన్షన్లను పూర్తిగా సర్దుబాటు చేసుకునే సౌకర్యం ఉంది.

MOST READ:వాహదారులు అక్కడ 2 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా ?

హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు ప్రారంభం; గుర్గావ్‌లో తొలి కస్టమర్‌కు డెలివరీ

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయెల్ 310 మిమీ డిస్క్స్, వెనుక వైపు 256 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం వెనుక చక్రంలో రైడర్ సహాయాన్ని స్విచ్-ఆఫ్ చేసే సామర్ధ్యంతో డ్యూయెల్-ఛానల్ ఎబిఎస్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటారుసైకిల్ డ్యూయల్ పర్పస్ టైర్లను అమర్చారు, ఇందులో ముందు వైపు 21 ఇంచ్, వెనుక వైపు 18 ఇంచ్ టైర్లను ఉపయోగించారు.

హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు ప్రారంభం; గుర్గావ్‌లో తొలి కస్టమర్‌కు డెలివరీ

హోండా ఆఫ్రికా ట్విన్ మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ మోటారుసైకిల్ నిజంగా ఎక్కడికైనా వెళ్ళగలిగే మెషీన్. ఇటు ఆన్-రోడ్ రైడ్ కోసం అలాగే ఆఫ్-రోడ్ రైడ్ కోసం ఉద్దేశించి తయారు చేసిన అద్భుతమైన మోటార్‌సైకిల్ ఇది. అత్యంత సాహసోపేతమైన డకార్ ర్యాలీలో ఈ కూడా మోటార్‌సైకిల్‌ను ఉపయోగించారు, గతంలో కొన్ని విజయాలను కూడా ఇది నమోదు చేసుకుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
2020 Honda Africa Twin Deliveries Commence: First Motorcycle Delivered To Customer In Gurugram. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X