మార్చి 5న హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ విడుదల

జపాన్ మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజం హోండా, సరికొత్త హోండా సీఆర్ఎఫ్1100ఎల్ ఆఫ్రికా ట్విన్ (Honda CRF1100L Africa Twin) మోటార్ సైకిల్‌ను మార్చి 5 ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆవిష్కరించిన ఇందులో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు, సాంకేతిక మరియు కాస్మొటిక అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి.

మార్చి 5న హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ విడుదల

ప్రత్యేకించి ఇంజన్ పరంగా ఎన్నో కీలకమైన అప్‌డేట్స్ జరిగాయి. హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ బైకులో సాంకేతికంగా 1,084సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 101బిహెచ్‌పి పవర్ మరియు 105ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మార్చి 5న హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ విడుదల

ఇంజన్‌‌లో అల్యూమినియం సిలిండర్ స్లీవ్స్ మరియు రీ-డిజైన్ చేయబడిన కేసింగ్స్ అందివ్వడం వలన మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ మొత్తం బరువు 2.5కిలోలు తగ్గింది, అయితే డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ బరువు 2.2కిలోల వరకూ తగ్గింది.

మార్చి 5న హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ విడుదల

తేలికపాటి బరువున్న లైట్-ఫ్రేమ్ మీద దీనిని నిర్మించారు, బరువు తగ్గడంతో మైలేజ్ కూడా పెరిగింది. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ల మైలేజ్ లీటర్‌కు 20.4కిమీలు మరియు 20.8కిమీలుగా ఉంది.

మార్చి 5న హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ విడుదల

ఇంజన్‌ నాలుగు పవర్ లెవల్స్ మరియు త్రీ-లెవల్స్ ఎలక్ట్రానిక్ ఇంజన్ బ్రేకింగ్ ఫీచర్లు కలిగింది. దీంతో పాటు 7-లెవల్స్ హోండా సెలక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్ వచ్చింది. వీలీ కంట్రోల్ టెక్నాలజీ, రీ-డిజైన్ చేయబడిన బాడీ ఫెయిరింగ్, బ్లూటూత్ మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా వచ్చింది.

మార్చి 5న హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ విడుదల

6-యాక్సిస్ ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్ ద్వారా హోండా సెలక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్ టెక్నాలజీ వచ్చింది. సరికొత్త హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ మోటార్ సైకిల్‌లో అప్‌డేట్ చేయబడిన ఎలక్ట్రానిక్ సూట్ కలదు.

మార్చి 5న హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ విడుదల

2020 ఆఫ్రికా ట్విన్ మోటార్ సైకిల్‌లో నాలుగు విభిన్న రైడింగ్ మోడ్స్ వచ్చాయి, అవి- టూర్, అర్బన్, గ్రావెల్ మరియు ఆఫ్-రోడ్. అదనంగా రైడర్ల రైడింగ్ తీరుకు అనుగుణంగా రైడింగ్ మోడ్స్ కస్టమైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

మార్చి 5న హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ విడుదల

సస్పెన్షన్ డ్యూటీ కోసం ముందు వైపున 45మిమీల ట్రావెల్ గల షోవా క్యాట్రిడ్జ్ టైప్ ఇన్వర్టెడ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ప్రో-లింక్ మరియు షోవా గ్యాష్ ఛార్జ్ డ్యాంపర్ అల్యూమినియం మోనో-బ్లాక్ సస్పెన్షన్ సిస్టమ్ కలదు.

మార్చి 5న హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ విడుదల

CRF1100L ఆఫ్రికా ట్విన్ బైకులో వీల్స్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు. ముందు వైపున 21-ఇంచుల చక్రం మరియు వెనుక వైపున 18-ఇంచుల వీల్ అందించారు. ఆఫ్-రోడ్ మరియు ఆన్-రోడ్ రైడింగ్స్ వీల్స్ అత్యుత్తమ పర్ఫామెన్స్ చూపిస్తాయి.

మార్చి 5న హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ విడుదల

బ్రేకింగ్ విధులు నిర్వర్తించేందుకు 4-రేడియల్ పిస్టన్ కాలిపర్స్ గల 310మిమీ డ్యూయల్ వేవ్-టైప్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున 256మిమీ చుట్టుకొలత గల హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ టెక్నాలజీని తప్పనిసరి ఫీచర్‌గా అందించారు, అయితే రియర్ వీల్ ఏబీఎస్‌ను స్విచ్ ద్వారా ఆఫ్ చేసుకునే అవకాశం ఉంది.

మార్చి 5న హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ విడుదల

హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ మోటార్ సైకిల్ ఆఫ్రికా ట్విన్ మరియు ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనే వేరియంట్లలో లభ్యమవుతోంది. ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే.. వేరియంట్ల గురించి మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది.

మార్చి 5న హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ విడుదల

హోండా ఆఫ్రికా ట్విన్ బైక్ ధర ప్రస్తుతం రూ. 13.50 లక్షలుగా ఉంది. అయితే, 2020 మోడళ్ల ధరల శ్రేణి రూ. 14.50 లక్షల నుండి రూ. 16.50 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

మార్చి 5న హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆఫ్రికా ట్విన్ అసలుసిసలైన ఆఫ్-రోడ్ మోటార్ సైకిల్. ప్రపంచ మార్కెట్లో ఆఫ్-రోడింగ్ పదానికి చక్కటి నిర్వచనమిచ్చే మోడల్ కూడా ఇదే. మార్చి 5 విడుదల కాబోయే 2020 హోండా CRF1100L ఆఫ్రికా ట్విన్ మోడల్ పాత దానికంటే అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.

 

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda CRF1100L Africa Twin Models To Launch In India On 5 March: Details And Expected Prices
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X