ఫోర్జా 300 మ్యాక్సీ స్కూటర్ డెలివరీలను ప్రారంభించిన హోండా

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన సంస్థలలో హోండా మోటార్స్ ఒకటి. హోండా కంపెనీ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో చాలా వాహనాలను విడుదల చేసింది. ఇప్పుడు హొండా తన ఫోర్జా 300 మ్యాక్సీ స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. ఈ కొత్త ఫోర్జా 300 మ్యాక్సీ స్కూటర్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం!

గుడ్ న్యూస్.. హోండా ఫోర్జా 300 మ్యాక్సీ స్కూటర్ ఇండియాకి వచ్చేసింది

హోండా మోటార్‌సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా తన మొట్టమొదటి మిడ్ సైజ్ స్కూటర్ ఫోర్జా 300 ను పంపిణీ చేసింది. కొత్త హోండా ఫోర్జా 300 దేశంలో మొట్టమొదటి ప్రీమియం మిడ్-సైజ్ ఫ్లాగ్‌షిప్ మ్యాక్సీ-స్కూటర్. ఇది బిగ్‌వింగ్ షోరూమ్‌ల ద్వారా ప్రత్యేకంగా లభిస్తుంది.

గుడ్ న్యూస్.. హోండా ఫోర్జా 300 మ్యాక్సీ స్కూటర్ ఇండియాకి వచ్చేసింది

హోండా కంపెనీ ఇండియన్ మార్కెట్ కోసం హొండా ఫోర్జా 300 ని పరిచయం చేసింది. ఫోర్జా 300 మాక్సి స్కూటర్ బ్రాండ్ యొక్క టెంప్లేట్ ‘సినర్జైజింగ్ మొబిలిటీ, స్టైల్ మరియు పెర్ఫార్మెన్స్' పై నిర్మించబడింది.

గుడ్ న్యూస్.. హోండా ఫోర్జా 300 మ్యాక్సీ స్కూటర్ ఇండియాకి వచ్చేసింది

హోండా మోటార్ సైకిల్స్ ఇండియా ప్రెసిడెంట్ మరియు సిఇఓ అయిన "మినోరు కటో" మాటాడుతూ హోండా యొక్క వాహనాలకు విఫణిలో మంచి ఆదరణ ఉందని, ఇప్పుడు ఫోర్జా 300 మ్యాక్సీ స్కూటర్ ను ప్రవేశపెట్టడంతో స్కూటరైజేషన్ స్థాయి మరింత పెరిగింది. ఇది ఎంతో గర్వకారణంగా ఉందని, ఇది లగ్జరీగా ఉండటమే కాకుండా మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా ఇస్తుందని తెలిపాడు.

గుడ్ న్యూస్.. హోండా ఫోర్జా 300 మ్యాక్సీ స్కూటర్ ఇండియాకి వచ్చేసింది

హోండా కంపెనీ యొక్క సేల్స్ & మార్కెటింగ్ మేనేజర్ యాద్వీందర్ సింగ్ గులేరియా మాటాడుతూ, వినియోగదారులు చూపిన అత్యంత ఉత్సాహం వల్లనే ఈ స్కూటర్ ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం అని, ఈ స్కూటర్ యొక్క మొదటి ఉత్పత్తిని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

గుడ్ న్యూస్.. హోండా ఫోర్జా 300 మ్యాక్సీ స్కూటర్ ఇండియాకి వచ్చేసింది

హోండా ఫోర్జా 300, 279 సిసి లిక్విడ్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7000 ఆర్‌పిఎమ్ వద్ద 24.8 బిహెచ్‌పి ని ఉత్పత్తి చేస్తుంది. బెల్ట్ డ్రైవ్‌తో వి-మ్యాటిక్ ట్రాన్స్‌మిషన్ సెటప్‌తో జత చేయబడింది. మ్యాక్సీ-స్కూటర్ 1510 ఎంఎం కాంపాక్ట్ వీల్‌బేస్‌తో వస్తుంది. ఇది ముందు భాగంలో 33 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో 7 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ని కలిగి ఉంది.

గుడ్ న్యూస్.. హోండా ఫోర్జా 300 మ్యాక్సీ స్కూటర్ ఇండియాకి వచ్చేసింది

మ్యాక్సీ స్కూటర్లో బ్రేకింగ్ వ్యవస్థను గమనించినట్లయితే ముందు భాగంలో 256 మిమీ డిస్క్ మరియు వెనుక వైపున 240 ఎంఎం డిస్క్ చేత నిర్వహించబడుతుంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ సిస్టమ్ కూడా ఉంటుంది. హోండా ఫోర్జా 300 మాక్సి-స్కూటర్ యొక్క ముందు భాగంలో 14 అంగుళాల చక్రాలు, వెనుక భాగంలో 15 అంగుళాల చక్రాలను కలిగి ఉంటుంది.

గుడ్ న్యూస్.. హోండా ఫోర్జా 300 మ్యాక్సీ స్కూటర్ ఇండియాకి వచ్చేసింది

హోండా ఫోర్జా 300 మ్యాక్సీ స్కూటర్ యొక్క ఫీచర్స్ ని గమనింస్తే ఇందులో అనలాగ్ స్పీడోమీటర్ మరియు డిజిటల్ రెవ్-కౌంటర్ కలిగిన సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్‌ల్యాంప్‌లు, డిఆర్‌ఎల్‌లు మరియు టైల్లైట్‌లు, స్మార్ట్ కీ, ఫేస్ హెల్మెట్లు, అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్ మరియు 12 వి ఛార్జింగ్ సాకేట్ వంటి వాటితో పాటు, లార్జ్ అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఉంటుంది.

గుడ్ న్యూస్.. హోండా ఫోర్జా 300 మ్యాక్సీ స్కూటర్ ఇండియాకి వచ్చేసింది

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా ఫోర్జా 300 మ్యాక్సీ స్కూటర్ భారతదేశంలో మొట్టమొదటి మిడ్ సైజ్ ప్రీమియం స్కూటర్. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, వినియోగదారునికి చాల అనుకూలంగా ఉంటుంది. సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 150 మరియు అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 వంటి వాటితో పాటు మ్యాక్సీ స్కూటర్ 150 సిసి విభాగం క్రింద ఉంటాయి.

Most Read Articles

English summary
Honda Forza 300 Maxi Scooter Deliveries Begin In India: Part Of Its BigWing Portfolio Expansion. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X