బెంగళూరులో విడుదల చేసిన బిఎస్-6 హోండా డియో : ధర, ఇతర వివరాలు

జపాన్ ద్విచక్ర తయారీదారు అయిన హోండా మోటార్‌సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా బిఎస్ 6-కంప్లైంట్ డియోను బెంగళూరులో విడుదల చేసింది. కొత్త హోండా డియో బిఎస్ 6 ప్రారంభ ధర రూ. 64,584 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) తో అందించబడుతుంది.

బెంగళూరులో విడుదల చేసిన బిఎస్-6 హోండా డియో : ధర, ఇతర వివరాలు

బిఎస్-6 హోండా స్కూటర్ ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందించబడుతుంది. అవి ఒకటి స్టాండర్డ్, రెండవది డీలక్స్. ఈ రెండూ మునుపటి మోడల్‌తో పోలిస్తే చాలా ఫీచర్లను కలిగి ఉంటుంది.

బెంగళూరులో విడుదల చేసిన బిఎస్-6 హోండా డియో : ధర, ఇతర వివరాలు

హోండా ఇటీవల కాలంలోనే భారత మార్కెట్లో బిఎస్ 6 డియో స్కూటర్‌ను విడుదల చేసింది. అయితే దక్షిణ భారత ప్రాంతంలో స్కూటర్ కి ఉన్న అధిక ప్రాముఖ్యత వల్ల ఈ సంస్థ ఒక ప్రత్యేక కార్యక్రమంలో బెంగళూరులో స్కూటర్‌ను విడుదల చేసింది.

బెంగళూరులో విడుదల చేసిన బిఎస్-6 హోండా డియో : ధర, ఇతర వివరాలు

హోండా కంపెనీ యొక్క సీనియర్ వి.పి, సేల్స్ & మార్కెటింగ్, హెచ్‌ఎంఎస్‌ఐ యాద్వీందర్ సింగ్ గులేరియా ఈ కార్యక్రమంలో మాటాడుతూ హోండా కంపెనీకి దక్షిణ భారతదేశంలో మార్కెటింగ్ పరంగా దాదాపు 34% అమ్మకాలతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది అన్నారు.

బెంగళూరులో విడుదల చేసిన బిఎస్-6 హోండా డియో : ధర, ఇతర వివరాలు

దక్షిణ భారత దేశంలో ద్విచక్ర వాహన విభాగంలో అత్యధికంగా అమ్ముడైన వాహనాలలో హోండా అగ్రస్థానంలో నిలిచింది. దాని కొత్త స్పోర్టి డిజైన్ మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన ఈ కొత్త డియో బిఎస్-6 వినియోగదారులను మరింత ఆకర్షిస్తుందని విశ్వసిస్తున్నాము అన్నారు.

బెంగళూరులో విడుదల చేసిన బిఎస్-6 హోండా డియో : ధర, ఇతర వివరాలు

బిఎస్-6 హోండా డియో అప్డేట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్కూటర్లో ఫీచర్స్ గమనించినట్లయితే ఇందులో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, కొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు లోగో డిజైన్ మరియు డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ వంటివి ఉంటాయి. అంతే కాకుండా ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్ సస్పెన్షన్, పెద్ద 12-అంగుళాల ఫ్రంట్ వీల్, రియర్ స్ప్లిట్ గ్రాబ్ హ్యాండిల్, ఫుల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇంజిన్ కట్-ఆఫ్ సిస్టమ్‌తో సైడ్ స్టాండ్ ఇండికేటర్‌ని కలిగి ఉంటుంది.

బెంగళూరులో విడుదల చేసిన బిఎస్-6 హోండా డియో : ధర, ఇతర వివరాలు

ఈ స్కూటర్ 110 సిసి బిఎస్ 6 ఇంజిన్‌తో హోండా యొక్క పిజిఎం-ఎఫ్‌ఐ టెక్నాలజీతో పాటు ఇఎస్‌పి మెరుగైన స్మార్ట్ పవర్ సిస్టమ్‌ని కలిగి ఉంటుంది. హోండా డియో స్కూటర్‌లోని 110 సిసి ఇంజన్ 8000 ఆర్‌పిఎమ్ వద్ద 7.6 బిహెచ్‌పి మరియు 4750 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రతిసారి సైలెంట్, జోల్ట్-ఫ్రీ స్టార్టింగ్ ను నిర్ధారిస్తుంది.

బెంగళూరులో విడుదల చేసిన బిఎస్-6 హోండా డియో : ధర, ఇతర వివరాలు

కొత్త హోండా బిఎస్-6 నాలుగు కొత్త రంగులలో వస్తుంది. మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్, కాండీ జాజ్ బ్లూ, స్పోర్ట్స్ రెడ్ & వైబ్రంట్ ఆరెంజ్ కలర్ ఎంపికలలో బేస్ ‘స్టాండర్డ్' వేరియంట్ అందించబడుతుంది. అయితే టాప్ 'డీలక్స్' వేరియంట్‌ను మాట్టే సాంగ్రియా రెడ్ మెటాలిక్, డాజిల్ ఎల్లో మెటాలిక్ & మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో మాత్రమే అందిస్తున్నారు.

బెంగళూరులో విడుదల చేసిన బిఎస్-6 హోండా డియో : ధర, ఇతర వివరాలు

కొత్త బిఎస్ 6 హోండా డియో కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అదేవిధంగా దాని డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. లాంచ్ చేసిన రోజునే కంపెనీ బిఎస్ 6 డియో స్కూటర్ లను 300 యూనిట్లకు పైగా డెలివరీ చేసినట్లు హోండా ప్రకటించింది.

బెంగళూరులో విడుదల చేసిన బిఎస్-6 హోండా డియో : ధర, ఇతర వివరాలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్లలో హోండా డియో ఒకటి. అంతే కాకుండా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ ద్విచక్ర వాహనం. హోండా డియో మార్కెట్లో మోటో-స్కూటర్ మరియు టివిఎస్ జుపీటర్ , హీరో ప్లెజర్ మరియు మాస్ట్రో ఎడ్జ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
New (2020) Honda Dio BS6 Launched In Bangalore: Prices Start At Rs 64,584. Read in Telugu.
Story first published: Wednesday, February 26, 2020, 11:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X