హోండా డియో బీఎస్6 స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు & మైలేజ్ కోసం

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్లోకి సరికొత్త హోండా డియో బీఎస్6 వెర్షన్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 59,990 రూపాయలు, బీఎస్6 హోండా ఆక్టివా కంటే దీని ధర చాలా తక్కువ. అంతే కాదండోయ్.. ఆక్టివాను తీసుకొచ్చి 18 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని హోండా కంపెనీ సెలబ్రేట్ చేసుకుంటోంది.

హోండా డియో బీఎస్6 స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు & మైలేజ్ కోసం

సరికొత్త హోండా డియో బీఎస్6 స్కూటర్ పూర్తిగా ఒక కొత్త డిజైన్ శైలిలో వచ్చింది. అత్యాధునిక ఫీచర్లు, లేటెస్ట్ కనెక్టెడ్ టెక్నాలజీతో పాటు పేటెంట్ హక్కులు పొందిన సుమారు 20 రకాల ఆవిష్కరణలు ఇందులో వచ్చాయి.

హోండా డియో బీఎస్6 స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు & మైలేజ్ కోసం

ఇందులో హోండా ఎంతగానో నమ్మదగిన 110సీసీ కెపాసిటీ గల పీజీఎమ్-ఎఫ్ఐ (హోండా ఇకో టెక్నాలజీ) ఇంజన్ కలదు. దీని అద్వితీయమైన స్మార్ట్ పవర్ అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడుతోంది. నిశ్శబ్దంగా స్టార్ట్ అయ్యే ఇంజన్, తక్కువ పొగనిచ్చే ఇకో-ఫ్రెండ్లీ ఇంజన్, ప్రతి యాక్సిలరేషన్‌లో కూడా గరిష్ట పవర్ మరియు స్మూత్ రైడింగ్ కల్పించేందుకు ఇందులో హోండా వారి ఇఎస్‌పీ (eSP) టెక్నాలజీ వచ్చింది.

హోండా డియో బీఎస్6 స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు & మైలేజ్ కోసం

బీఎస్6 హోండా డియో స్కూటర్‌లో ఏసీజీ స్టార్టర్ సిస్టమ్ వచ్చింది. ఇది గేర్ల నుండి వచ్చే శబ్దాన్ని తగ్గిస్తుంది, ఇందుకోసం ఆఫ్‌సెట్ సిలిండర్, తేలికపాటి బరువున్న క్రాంక్‌షాఫ్ట్ మరియు మైలేజ్ పెంచే ఆప్టిమైజ్డ్ పిస్టన్ వంటి ఇంజన్ పరికరాలు వచ్చాయి.

హోండా డియో బీఎస్6 స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు & మైలేజ్ కోసం

సరికొత్త హోండా డియో బీఎస్6 స్కూటర్‌లో ప్రోగామ్ చేయబడిన ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ వచ్చింది. ఇంజన్‌లోని ఆరు ఇంటెలిజెంట్ సెన్సార్ల ద్వారా వచ్చే సమాచారం మరియు ఇంజన్ డేటా ఆధారంగా, సిలిండర్‌లోకి ఎంత పెట్రోల్ కావాలో అంతే మొత్తాన్ని సరఫరా చేస్తుంది ఈ కొత్త ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్. దీంతో స్మూత్ రైడింగ్ మరియు అత్యుత్తమ పవర్ అవుట్‌పుట్ సాధ్యమవుతుంది.

హోండా డియో బీఎస్6 స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు & మైలేజ్ కోసం

డియో బీఎస్ వెర్షన్‌లో మైలేజ్, వాస్తవిక మైలేజ్, మిగిలి ఉన్న పెట్రోల్‌తో ప్రయాణించగల దూరం వంటి వివరాలనిచ్చే ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చింది. అదనంగా, ట్రిప్ మీటర్, గడియారం, సర్వీస్ ఇండికేటర్ మరియు అత్యాధునిక ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ కలదు.

హోండా డియో బీఎస్6 స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు & మైలేజ్ కోసం

న్యూ హోండా డియో బీఎస్6 మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే ఫ్రెష్ లుక్‌లో ఉంది. రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ రిబ్స్, రీడిజైన్ చేసిన ఎల్ఈడీ ల్యాంప్, మోడ్రన్ టెయిల్ ల్యాంప్, స్పోర్ట్స్ స్ల్పిట్ గ్రాబ్ రెయిల్, పదునైన మరియు న్యూ బాడీ గ్రాఫిక్స్ ఉన్నాయి.

హోండా డియో బీఎస్6 స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు & మైలేజ్ కోసం

ఇందులో విభిన్నమైన డ్యూయల్ ఫంక్షన్ స్విచ్ కలదు. సింగల్ స్విచ్ ద్వారా సీట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్‌లో న్యూ పాకెట్ వచ్చింది. ఇందులో మెరుగైన రైడింగ్ కల్పించేందుకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. ఎలాంటి రోడ్డు మీదనైనా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు.

హోండా డియో బీఎస్6 స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు & మైలేజ్ కోసం

హోండా కంపెనీ తమ డియో బీఎస్6 స్కూటర్ వీల్ బేస్‌ను ఏకంగా 22మిమీల వరకూ పెంచింది. ఇది రైడర్లకు మరింత స్టెబిలిటీ మరియు ధైర్యాన్ని ఇస్తుంది. మెరుగైన బ్రేకింగ్ కోసం కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. రైడర్ ముందు లేదా వెనుక ఏ బ్రేక్ ప్రెస్ చేసినా.. బ్రేకింగ్ పవర్ రెండు చక్రాలకు సమానంగా వెళుతుంది. దీంతో టైర్ స్కిడ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

హోండా డియో బీఎస్6 స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు & మైలేజ్ కోసం

హోండా న్యూ డియో బీఎస్6 రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. అవి, స్టాండర్డ్ మరియు డీలక్స్. స్టాండర్డ్ వేరియంట్ మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, క్యాండీ జాజి బ్లూ, స్పోర్ట్స్ రెడ్ మరియు వైబ్రంట్ ఆరేంజ్ నాలుగు విభిన్న రంగుల్లో లభిస్తోంది.

హోండా డియో బీఎస్6 స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు & మైలేజ్ కోసం

డియో డీలక్స్ వేరియంట్ విషయానికి వస్తే, మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్, డాజిల్ ఎల్లో మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ అనే మూడు రంగుల్లో ఎంచుకోవచ్చు. సరికొత్త బీఎస్6 హోండా డియో స్కూటర్ ధరల శ్రేణి రూ. 59.990 నుండి రూ. 63,340 మధ్య ఉంది.

హోండా డియో బీఎస్6 స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు & మైలేజ్ కోసం

అదనంగా, హోండా కంపెనీ ఆరేళ్ల వారంటీ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో మూడేళ్ల స్టాండర్డ్ మరియు మరో మూడేళ్ల పాటు ఆప్షనల్ వారంటీని కలిస్పోంది. టూ వీలర్ పరిశ్రమలో ఆరేళ్ల వారంటీ రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ వారంటీ డియో బీఎస్6 లోని రెండు వేరియంట్లకు వర్తిస్తాయి.

హోండా డియో బీఎస్6 స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు & మైలేజ్ కోసం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా టూ వీలర్ లైనప్‌లో యాక్టివా తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్న మోడల్ హోండా డియో. బీఎస్6 వెర్షన్‌లో ఇంజన్ అప్‌డేట్‌తో పాటు నమ్మశక్యంగాని ఫీచర్లు, డిజైన్, టెక్నాలజీ మరియు ధరలతో పాటు ఏకంగా 6 సంవత్సరాలు వారంటీని కూడా ప్రకటించింది. 60 వేల రూపాయల బడ్జెట్ మంచి స్కూటర్ కోసం చూస్తున్నారా..? అయితే ఓ సారి హోండా డియో బీఎస్6 గురించి ఆలోచించండి!

Most Read Articles

English summary
Honda Dio BS6 Models Launched In India Starting At Rs 59,990: Dio’ing The New Way!. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X