హోండా డియో బిఎస్6 స్కూటర్ ధరల పెంపు; వరుసగా ఇది మూడవసారి

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) అందిస్తున్న స్టైలిష్ స్కూటర్ డియో ధరలను మరోసారి పెంచింది. ఈ స్కూటర్‌లో బిఎస్6 అప్‌డేట్ చేసిన తర్వాత వరుసగా ధరలను పెంచడం ఇది మూడోసారి. హోండా డియోలో లభిస్తున్న రెండు వేరియంట్‌ల ధరలు పెరిగాయి. ఈ రెండు వేరియంట్లపై సుమారు రూ.473 మేర ధరలు పెరిగాయి.

హోండా డియో బిఎస్6 స్కూటర్ ధరల పెంపు; వరుసగా ఇది మూడవసారి

హోండా డియోను రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. అవి: ‘ఎస్‌టిడి' (స్టాండర్డ్) మరియు టాప్-స్పెక్ ‘డిఎల్‌ఎక్స్' (డీలక్స్). తాజా ధరల పెరుగుదల తరువాత, మార్కెట్లో హోండా డియో బిఎస్6 స్టాండర్డ్ మోడల్ ధర రూ.61,970గా ఉంటే డిఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ.65,320 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి.

హోండా డియో బిఎస్6 స్కూటర్ ధరల పెంపు; వరుసగా ఇది మూడవసారి

భారత మార్కెట్లో బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా డియో అప్‌డేట్ అయిన తర్వాత కంపెనీ మూడోసారి ఈ స్కూటర్ ధరలను పెంచింది. విడుదల సమయంలో, హోండా డియో బిఎస్6 మోడల్స్ దాని బిఎస్4 మోడళ్ల కంటే ఎక్కువ ధరను కలిగి ఉన్నాయి. ఆ సమయంలో‘ఎస్‌టిడి' వేరియంట్‌ను రూ.5,749 మరియు‘డిఎల్‌ఎక్స్' వేరియంట్‌ను రూ.7,099 మేర పెంచారు.

MOST READ:కొత్త విమానంలో ప్రయాణించిన భారత రాష్ట్రపతి ; ఇంతకీ ఈ విమానం ప్రత్యేకత ఏంటో తెలుసా

హోండా డియో బిఎస్6 స్కూటర్ ధరల పెంపు; వరుసగా ఇది మూడవసారి

బిఎస్6 స్కూటర్ ధరలను పెంచినప్పటికీ, ఇది దాని బిఎస్4 మోడల్ కంటే మెరుగైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ నివేదికల ప్రకారం, లాంచ్ సమయంలో హోండా డియో బిఎస్6 మోడల్‌ను 20 పేటెంట్ దరఖాస్తులతో అభివృద్ధి చేసినట్లు కంపెనీ పేర్కొంది.

హోండా డియో బిఎస్6 స్కూటర్ ధరల పెంపు; వరుసగా ఇది మూడవసారి

ఈ స్కూటర్‌లో 110 సిసి బిఎస్6 ఇంజన్‌ను హోండా యొక్క ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మరియు ఇఎస్‌పి (మెరుగైన స్మార్ట్ పవర్) సిస్టమ్‌తో అభివృద్ధి చేశారు. హోండా డియో స్కూటర్‌లోని 110 సిసి ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.6 బిహెచ్‌పి పవర్‌ను మరియు 4,750 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బిఎస్6 హోండా డియో బ్రాండ్ యొక్క ‘ఎసిజి' స్టార్టర్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది, ఇది ప్రతిసారీ సైలెంట్ స్టార్ట్ అనుభవాన్ని అందిస్తుంది.

MOST READ:ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొత్త కలర్స్‌లో కూడా

హోండా డియో బిఎస్6 స్కూటర్ ధరల పెంపు; వరుసగా ఇది మూడవసారి

హోండా డియో బిఎస్6 స్కూటర్‌లో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది, ఇది రైడర్‌కు అనేక రకాల సమాచారాన్ని అందిస్తుంది. వీటిలో రియల్ టైమ్ రేంజ్ మరియు ఇంధన సామర్థ్యం, ఇది ట్రిప్ మీటర్, గడియారం మరియు సర్వీస్ ఇండికేటర్ మొదలైన వాటిని ప్రదర్శిస్తుంది. ఇంకా ఇందులో ఇంజన్ కట్-ఆఫ్ సిస్టమ్‌తో సైడ్-స్టాండ్ ఇండికేటర్‌ను కూడా కలిగి ఉంటుంది.

హోండా డియో బిఎస్6 స్కూటర్ ధరల పెంపు; వరుసగా ఇది మూడవసారి

బిఎస్6 హోండా డియోలో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ రిబ్స్, కొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు లోగో డిజైన్, డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్, కొత్త టెయిల్ లాంప్ డిజైన్ మరియు స్పోర్ట్ స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ వంటి ఇతర మార్పులు ఉన్నాయి. ఇది ప్రత్యేకమైన డ్యూయల్-ఫంక్షన్ స్విచ్‌తో కూడి ఉంటుంది, ఇది అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్ మరియు రీఫ్యూయలింగ్‌ను సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

MOST READ:వరల్డ్ రికార్డ్ సృష్టించిన పోర్ష్ ఎలక్ట్రిక్ సూపర్ కార్, ఎలాగో తెలుసా?

హోండా డియో బిఎస్6 స్కూటర్ ధరల పెంపు; వరుసగా ఇది మూడవసారి

కొత్త 2020 హోండా డియో యొక్క వీల్‌బేస్ 22 మి.మీ పెంచబడింది, ఇది మంచి స్థిరత్వం మరియు నిర్వహణకు సహాయపడుతుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో కొత్త టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్ మరియు వెనుక భాగంలో మూడు-దశలుగా సర్దుబాటు చేయగల యూనిట్ ఉంటాయి. ఇందులోని రెండు వేరింట్‌లు కూడా డ్రమ్ బ్రేక్స్‌ను కలిగి ఉంటాయి.

హోండా డియో బిఎస్6 స్కూటర్ ధరల పెంపు; వరుసగా ఇది మూడవసారి

హోండా డియో బిఎస్6 ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హోండా డియో బిఎస్6 అప్‌డేట్ తర్వాత వరుసగా మూడవసారి ధరల పెంపును అందుకుంది. అయితే, ఇది మునుపటి రిటైల్ ధరలతో పోలిస్తే, స్వల్ప పెరుగుదలగానే ఉంది. ఫలితంగా, పెరిగిన ధరలు మార్కెట్లో ఈ స్కూటర్ అమ్మకాలను ప్రభావితం చేయబోవని తెలుస్తోంది. దేశంలో యువ స్కూటర్ కొనుగోలుదారులలో హోండా డియోకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

MOST READ:కొత్త మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఎలా ఉందో చూసారా !

Most Read Articles

English summary
Honda Dio BS6 Prices Increased For The Third Time Since Launch, New Price List Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X