ఇకపై బిఎస్-6 వెర్షన్ లో రానున్న హోండా డియో

జపాన్ ద్విచక్ర వాహన తయారీదారు అయిన హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలను కలిగి సంస్థలలో ఒకటిగా ఉంది. ఇప్పుడు కంపెనీ కొన్ని వాహనాలను బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయనుంది. ఈ వాహనాలను గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

ఇకపై బిఎస్-6 వెర్షన్ లో రానున్న హోండా డియో

అత్యంత ప్రాజాదరణ పొందిన హోండా డియో ఇప్పుడు బిఎస్-6 నిబంధనలకు అనుగుణంగా మరియు డిజైన్ పరంగా గణనీయమైన మార్పును పొందనుంది. ఇది బిఎస్-6 కంప్లైంట్ ఇంజిన్ని కలిగి ఉంటుంది.

ఇకపై బిఎస్-6 వెర్షన్ లో రానున్న హోండా డియో

హోండా ఇప్పటిదాకా దేశంలో ఎక్కువ అమ్మకాలను జరిపిన కంపెనీలలో అగ్రస్థానంలో నిలిచింది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. హోండా డియో కొంతవరకు బాగా ప్రాచుర్యం పొందిన యాక్టివా యొక్క స్పోర్టియర్ వెర్షన్ లాగా ఉంటుంది. ఇది చాల మంది వినియోగదారులను ఆకర్షించే విధంగా ఉంటుంది.

ఇకపై బిఎస్-6 వెర్షన్ లో రానున్న హోండా డియో

2020 హోండా డియో మునుపటి మోడల్ కంటే ఎక్కువ డిజైన్ ని పొందుతుంది. నవీనీకరించిన హోండాలో పుల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ మరియు డిఆర్‌ఎల్‌తో వస్తుంది. దీనికి ఎన్ని మార్పులు చేసినప్పటికీ ఇది చూడటానికి మునుపటి మోడల్ లాగా ఉంటుంది. డియో కొత్త గ్రాఫిక్ డిజైన్ మరియు కొత్త కలర్స్ లో రానుంది. ఇది హోండా యాక్టివా 6జి ప్లాట్ ఫామ్ పై ఆధారపడి ఉంటుంది.

ఇకపై బిఎస్-6 వెర్షన్ లో రానున్న హోండా డియో

హోండా బిఎస్-6 కంప్లైంట్ 109.51 సిసి ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది 7.6 బిహెచ్‌పి మరియు 8.79 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది బిఎస్-4 కంప్లైంట్ కార్బ్యురేటెడ్ యూనిట్‌తో పోలిస్తే అవుట్‌పుట్ గణాంకాలు కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో ఉన్న ఇంజిన్ మంచి ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. పవర్ ప్లాంట్ బ్రాండ్ యొక్క హోండా ఎకో టెక్నాలజీ వ్యవస్థతో మెరుగైన స్మార్ట్ టంబుల్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

ఇకపై బిఎస్-6 వెర్షన్ లో రానున్న హోండా డియో

ఇప్పుడు దాదాపు వాహనాలన్నీ బిఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారు చేస్తున్నారు. ఇందులో ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వంటివి బాగా నవీనీకరించబడి ఉంటాయి. ఇవన్నీ రాబోయే తరంలో వినియోగదారునికి అనుకూలంగా ఉండటానికి ఉపయోగపడతాయి.

ఇకపై బిఎస్-6 వెర్షన్ లో రానున్న హోండా డియో

ప్రస్తుతం బిఎస్-4 హోండా డియో స్టాండర్డ్ మరియు డీలక్స్ వేరియంట్ల ధరలు రూ. 53,000 నుంచి రూ. 60,000 వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటాయి. బిఎస్-4 మోడల్ వాహనాలకంటే బిఎస్-6 వాహనాలు దాదాపుగా రూ. 5,000 ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా డియో బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారు చేయబడుతోంది. బిఎస్-6 హోండా యొక్క ఖచ్చితమైన ధరలు ఇంకా తెలియరాలేదు. ముందు ఉన్న వాహనాలకంటే కొంత ఎక్కువ ధరలను కలిగి వుంటాయని మాత్రం ఊహించవచ్చు. హోండా డియో యమహా రే-జెడ్ మరియు హీరో మాస్ట్రో ఎడ్జ్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండటమే కాకుండా హోండా యాక్టివాకి కొంత అంతర్గత పోటీని కూడా ఇవ్వనుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Dio BS6 scooter teased – Gets Activa 6G BS6 engine. Read in Telugu.
Story first published: Tuesday, February 4, 2020, 15:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X