Just In
- 18 min ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 45 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 2 hrs ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 3 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
Don't Miss
- News
జగన్ సర్కారుకు షాక్- గుంటూరులో నామినేషన్లు ప్రారంభం- మిగతాచోట్ల టీడీపీ, జనసేన ధర్నాలు
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డీలర్ల వద్దకు బిఎస్6 హోండా గ్రాజియా; త్వరలోనే డెలివరీలు!
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ గడచిన జూన్ నెలాఖరులో విడుదల చేసిన సరికొత్త బిఎస్6 హోండా గ్రాజియా 125 స్కూటర్ ఇప్పుడు డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటోంది. మరికొద్ది రోజుల్లోనే హోండా దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఈ కొత్త బిఎస్6 స్కూటర్ డెలివరీలను చేయటం ప్రారంభించనుంది.

బైక్‌దేఖో నుండి వచ్చిన చిత్రాల ప్రకారం, కొత్త 2020 హోండా గ్రాజియా 125 స్కూటర్ దేశంలోని ఓ డీలర్‌షిప్‌కు చేరుకోవటాన్ని చూడొచ్చు. దేశీయ విపణిలో హోండా గ్రాజియా 125 బిఎస్6 ప్రారంభ ధర రూ.73,912, ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

హోండా బ్రాండ్ లైనప్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగానే, గ్రాజియా స్కూటర్‌ను కూడా స్టాండర్డ్ మరియు డీలక్స్ అనే రెండు వేరియంట్‌లలో ఆఫర్ చేస్తున్నారు. ఇందులో డీలక్స్ వేరియంట్‌లో స్టాండర్డ్ వేరియంట్ కన్నా కొన్ని అదనపు ఫీచర్లతో వస్తుంది.
MOST READ:యమహా ఎఫ్‌జీ25 బిఎస్6 విడుదల; ఎఫ్‌జీఎస్25 ధర వెల్లడి

డీలక్స్ వేరియంట్‌లో ఇంజన్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్ మరియు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉంచాయి. ఫలితంగా, గ్రాజియా 125 బిఎస్6 డీలక్స్ వేరియంట్ ధర రూ.80,978, ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. బిఎస్4 వెర్షన్లతో పోల్చుకుంటే కొత్త బిఎస్6 మోడళ్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి.

ఇందులో ప్రధానంగా, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, అదనపు సమాచారం కోసం డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్రాండ్ యొక్క సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీతో కూడిన ఎసిజి స్టార్టర్ మోటర్, ఫ్యూయెల్-ఇంజెక్షన్ సిస్టమ్, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, స్ప్లిట్ గ్రాబ్ రైల్ మరియు అప్‌డేటెడ్ బాడీ గ్రాఫిక్స్ మొదలైనవి చెప్పుకోవచ్చు.
MOST READ:ఈ స్కూటర్ ధర స్మార్ట్‌ఫోన్ కన్నా చీప్; ఎక్కడో తెలుసా?

ఈ స్కూటర్ కొత్త పాస్-స్విచ్, కొత్త ఇంజన్ స్టార్ట్ / స్టాప్ స్విచ్, సీటు కోసం మల్టీ-ఫంక్షనల్ స్విచ్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు బయటి వైపు ఉండే ఫ్యూయెల్ ట్యాంక్ లిడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. టాప్-ఎండ్ వేరియంట్‌లో ఆఫర్ చేసే ఇంజన్ ఐడిల్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్‌తో పోలిస్తే, బేస్ వేరియంట్‌లో ఇంజన్ కిల్ స్విచ్‌తో మాత్రమే లభిస్తుంది.

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త బిఎస్6 హోండా గ్రాజియా 125 స్కూటర్‌లో మునపటి ఇంజన్‌నే బిఎస్6కి అప్‌గ్రేడ్ చేశారు. ఇందులోని 124 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 8 బిహెచ్‌పి శక్తిని మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:కొడుకుని కలవడానికి 1800 కి.మీ ప్రయాణించిన నిరుద్యోగ మహిళ ; ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ స్కూటర్‌లో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు త్రీ-వే అడ్జస్టబల్ స్ప్రింగ్-లోడెడ్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 190 మి.మీ డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు 130 మి.మీ డ్రమ్ బ్రేక్‌లు ఉంచాయి. ఇంకా ఇందులో ముందు వైపు 12 ఇంచ్ అల్లాయ్ వీల్, వెనుక వైపు 10 అల్లాయ్ వీల్‌లు ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉంటాయి.

మ్యాట్ సైబర్ యల్లో, పెరల్ సైరన్ బ్లూ, మ్యాట్ యాక్సిస్ గ్రే మరియు పెరల్ స్పార్టన్ రెడ్ అనే నాలుగు ఆకర్షనీయమైన రంగులలో హోండా గ్రాజియా 125 బిఎస్6 స్కూటర్ లభిస్తుంది.
MOST READ:బస్ చార్జీలను నిర్ణయించే కొత్త సాఫ్ట్‌వేర్, ఎక్కడో తెలుసా..!

హోండా గ్రాజియా డెలివరీల ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
హోండా గ్రాజియా 125 స్కూటర్ ఈ విభాగంలో యువ మరియు పరిణతి చెందిన కొనుగోలుదారులను ఆకర్షించేలా ఇది అద్భుతమైన మోడ్రన్ డిజైన్, ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ విభాగంలో ఇది యమహా ఫాసినో 125, టివిఎస్ ఎన్-టార్క్ 125 మరియు సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.