Just In
- 9 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 10 hrs ago క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 13 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 15 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హోండా యొక్క కొత్త బ్రాండ్ : గ్రోమ్ 125 మినీ బైక్
హోండా మోటార్‌సైకిల్ కంపెనీ తన బ్రాండ్ అయిన గ్రోమ్ 125 మినీ బైక్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొన్ని దేశాలలో గ్రోమ్ 125 అని పిలువబడే ఈ బైక్ హోండా ఎంఎస్ఎక్స్125 ని అనేక మార్పులతో మాడిఫై చేయబడింది.
హోండా గ్రోమ్ నాలుగు కలర్ అప్సన్లలో విడుదలైంది. అవి మినీ బైక్ చెర్రీ రెడ్, బ్లూ రాస్ప్బెర్రీ, హాలోవీన్ ఆరెంజ్ మరియు ఇన్క్రెడిబుల్ గ్రీన్ అనే నాలుగు కలర్స్. ఇది ఎబిఎస్ వెర్షన్లో మాత్రమే లభించే చెర్రీ రెడ్ కలర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ మినీబైక్ ప్రారంభ ధర రూ. 2.57 లక్షలు.
హోండాకు మినీబైక్ విభాగంలో మినిమోటో అనే బైక్ ఉంది. మినిమోటో సిరీస్‌లోని మంకీ ధర రూ. 3.02 లక్షలు. హోండా మంకీ బైక్ అంతర్జాతీయ మార్కెట్లో చాలా ఎక్కువ ప్రజాదరణను కూడా పొందింది.
MOST READ:లాక్డౌన్లో ఇల్లు చేరడం చాలా సింపుల్ : ఇలా చేయండి
హోండా గ్రోమ్ మినీబైక్లో 124.9 సిసి ఎయిర్-కూల్డ్ ఎఫ్ఐ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 9.57 బిహెచ్ పి మరియు 10.9 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ హోండా గ్రోమ్ మినీ బైక్ బరువు 103 కిలోలు. ఈ బైక్ చాలా ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటుంది.
హోండా గ్రోమ్ మినీ బైక్ సీటు 762 మిమీ ఎత్తు కలిగి ఉంది. ఈ బైక్ ముందు భాగంలో 220 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక వైపు 190 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి.
MOST READ:రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 2020 ఏప్రిల్ లో ఎలా ఉన్నాయో చూసారా ?
మినీ-బైక్‌లో 12 అంగుళాల టైర్ 31 ఎంఎం యుఎస్డి ఫోర్కులు మరియు వెనుక మోనోషాక్ ఉంది. మినీబైక్ మంచి మైలేజ్ ఇస్తుంది. హోండా గ్రోమ్ మినీబైక్ 125 లో 5.5 లీటర్ ఇంధన ట్యాంక్ ఉంది. హోండా పూర్తి ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఎబిఎస్‌ను గ్రోమ్ బైక్‌లో ఏర్పాటు చేయబడింది. ఈ మినీబైక్ మంచి రైడింగ్ అనుభూతిని కలిగిస్తుంది.
హోండా కంపెనీ ఇప్పటికే తమ బ్రాండ్ వాహనాలైన సిబి హార్నెట్ 160 ఆర్, ఎక్స్‌బ్లేడ్ మరియు సిబిఆర్ 250 ఆర్ బైక్‌ల పేరును అధికారిక వెబ్సైట్ నుండి తొలగించింది. కానీ హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బైక్ బిఎస్-6 ఉద్గార నియమానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. మిగిలిన రెండు మోడళ్లను నిలిపివేసే అవకాశం ఉంది.