హోండా యొక్క కొత్త బ్రాండ్ : గ్రోమ్ 125 మినీ బైక్

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ తన బ్రాండ్ అయిన గ్రోమ్ 125 మినీ బైక్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొన్ని దేశాలలో గ్రోమ్ 125 అని పిలువబడే ఈ బైక్ హోండా ఎంఎస్ఎక్స్125 ని అనేక మార్పులతో మాడిఫై చేయబడింది.

హోండా యొక్క కొత్త బ్రాండ్ : గ్రోమ్ 125 మినీ బైక్

హోండా గ్రోమ్ నాలుగు కలర్ అప్సన్లలో విడుదలైంది. అవి మినీ బైక్ చెర్రీ రెడ్, బ్లూ రాస్ప్బెర్రీ, హాలోవీన్ ఆరెంజ్ మరియు ఇన్క్రెడిబుల్ గ్రీన్ అనే నాలుగు కలర్స్. ఇది ఎబిఎస్ వెర్షన్‌లో మాత్రమే లభించే చెర్రీ రెడ్ కలర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ మినీబైక్ ప్రారంభ ధర రూ. 2.57 లక్షలు.

హోండా యొక్క కొత్త బ్రాండ్ : గ్రోమ్ 125 మినీ బైక్

హోండాకు మినీబైక్ విభాగంలో మినిమోటో అనే బైక్ ఉంది. మినిమోటో సిరీస్‌లోని మంకీ ధర రూ. 3.02 లక్షలు. హోండా మంకీ బైక్ అంతర్జాతీయ మార్కెట్లో చాలా ఎక్కువ ప్రజాదరణను కూడా పొందింది.

MOST READ:లాక్‌డౌన్‌లో ఇల్లు చేరడం చాలా సింపుల్ : ఇలా చేయండి

హోండా యొక్క కొత్త బ్రాండ్ : గ్రోమ్ 125 మినీ బైక్

హోండా గ్రోమ్ మినీబైక్‌లో 124.9 సిసి ఎయిర్-కూల్డ్ ఎఫ్‌ఐ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 9.57 బిహెచ్ పి మరియు 10.9 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ హోండా గ్రోమ్ మినీ బైక్ బరువు 103 కిలోలు. ఈ బైక్ చాలా ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటుంది.

హోండా యొక్క కొత్త బ్రాండ్ : గ్రోమ్ 125 మినీ బైక్

హోండా గ్రోమ్ మినీ బైక్ సీటు 762 మిమీ ఎత్తు కలిగి ఉంది. ఈ బైక్ ముందు భాగంలో 220 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక వైపు 190 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి.

MOST READ:రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 2020 ఏప్రిల్ లో ఎలా ఉన్నాయో చూసారా ?

హోండా యొక్క కొత్త బ్రాండ్ : గ్రోమ్ 125 మినీ బైక్

మినీ-బైక్‌లో 12 అంగుళాల టైర్ 31 ఎంఎం యుఎస్‌డి ఫోర్కులు మరియు వెనుక మోనోషాక్ ఉంది. మినీబైక్ మంచి మైలేజ్ ఇస్తుంది. హోండా గ్రోమ్ మినీబైక్ 125 లో 5.5 లీటర్ ఇంధన ట్యాంక్ ఉంది. హోండా పూర్తి ఎల్‌ఈడీ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎబిఎస్‌ను గ్రోమ్ బైక్‌లో ఏర్పాటు చేయబడింది. ఈ మినీబైక్ మంచి రైడింగ్ అనుభూతిని కలిగిస్తుంది.

హోండా యొక్క కొత్త బ్రాండ్ : గ్రోమ్ 125 మినీ బైక్

హోండా కంపెనీ ఇప్పటికే తమ బ్రాండ్ వాహనాలైన సిబి హార్నెట్ 160 ఆర్, ఎక్స్‌బ్లేడ్ మరియు సిబిఆర్ 250 ఆర్ బైక్‌ల పేరును అధికారిక వెబ్‌సైట్ నుండి తొలగించింది. కానీ హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బైక్ బిఎస్-6 ఉద్గార నియమానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. మిగిలిన రెండు మోడళ్లను నిలిపివేసే అవకాశం ఉంది.

MOST READ:ఈ ఫెరారీ సూపర్ కార్ కేవలం 15 వేలు మాత్రమే

Most Read Articles

English summary
2020 Honda Grom revealed. Read in Telugu.
Story first published: Monday, May 4, 2020, 15:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X