భారత్‌లో హోండా హార్నెట్ 2.0 & డియో రెప్సోల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

హోండా మోటార్ సైకిల్స్ ఇండియా తమ కొత్త 'రెప్సోల్ హోండా లిమిటెడ్' వెర్షన్లలయిన హార్నెట్ 2.0 మరియు డియో మోడళ్లను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. కొత్త హోండా హార్నెట్ రెప్సోల్ ఎడిషన్ ధర రూ .1.28 లక్షలు కాగా, హోండా డియో రెప్సోల్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 69,757. రెండు ధరలు ఎక్స్-షోరూమ్ (గురుగ్రామ్, హర్యానా).

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 & డియో రెప్సోల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

రెప్సోల్ హోండా హార్నెట్ 2.0 & డియో మోడల్స్ రెండూ లిమిటెడ్-ఎడిషన్ వెర్షన్లుగా ఉంటాయి, ఇవి ఈ వారం నుండి భారతదేశంలోని అన్ని కంపెనీ డీలర్‌షిప్‌లలో లభిస్తాయి. దాని కోసం బుకింగ్స్ నేటి నుండి కూడా చేసుకోవచ్చు, డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 & డియో రెప్సోల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

మోటారుసైకిల్ మరియు స్కూటర్ మోడల్స్ రెండూ ఇప్పుడు రెప్సోల్ హోండా రేసింగ్ టీమ్ ప్రేరేపిత బాడీ గ్రాఫిక్స్ తో వస్తాయి. వీటిలో శక్తివంతమైన ఆరెంజ్ వీల్ రిమ్స్ ఉంటాయి, ఇవి రెండు మోడళ్లలో డిజైన్ థీమ్‌ను మరింత పెంచుతాయి.

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 & డియో రెప్సోల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

హార్నెట్ 2.0 మరియు డియోలోని రెండు రెప్సోల్ హోండా లిమిటెడ్ వెర్షన్లు బ్రాండ్ యొక్క రేసింగ్ జట్టు యొక్క నిరంతర విజయాన్ని జరుపుకునేందుకు ప్రవేశపెట్టబడ్డాయి, ప్రత్యేకించి వారి ఇటీవలి 800 వ మోటోజిపిపై విజయం సాధించిన తరువాత ఈ మోడల్స్ ప్రవేశపెట్టబడ్డాయి.

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 & డియో రెప్సోల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

హోండా హార్నెట్ 2.0 బైక్ 184 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పి శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 16.1 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్‌లో 5 స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 & డియో రెప్సోల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఈ బైక్‌లో గోల్డెన్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్, ఇంజిన్ స్టాప్ స్విచ్ మరియు హజార్డ్ స్విచ్ ఉన్నాయి. దీనిలో స్పోర్టి స్ప్లిట్ సీట్ మరియు ట్యాంక్ ఉన్నాయి, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్ మరియు ఎక్స్-షేప్ ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్‌తో పాటు ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 & డియో రెప్సోల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

హోండా డియో 110 సిసి ఇంజన్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ స్విచ్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ లీడ్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, డిసి ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్ ఉన్నాయి. దీనితో పాటు కాంబి బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇవ్వబడింది.

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 & డియో రెప్సోల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

గత నెలలో కంపెనీ అమ్మకాల నివేదిక ప్రకారం 5,27,180 ద్విచక్ర వాహనాలు అమ్ముడైనట్లు తెలిసింది. గత ఏడాది ఇదే నెలలో 5,17,845 యూనిట్ అమ్మకాలతో పోలిస్తే 2 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ అమ్మకాల విషయానికొస్తే, 2020 అక్టోబర్‌లో 4,94,459 యూనిట్లు అమ్ముడయ్యాయి.

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 & డియో రెప్సోల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

హోండా హార్నెట్ 2.0 మరియు డియో యొక్క ఈ స్పెషల్ ఎడిషన్ ఎంత మంది కస్టమర్‌లను ఆకర్షిస్తుంది అనే విషయం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇటీవల, కంపెనీ ప్రవేశపెట్టిన హోండా హైనెస్ సిబి 350 బైక్ కి మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. ఏది ఏమైనా హోండా మార్కెట్లో తనకంటూ ఒక మంచి స్థానాన్ని నిలుపుకుంటూ వస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, November 20, 2020, 9:19 [IST]
English summary
Honda Hornet 2.0 & Dio Repsol Honda Edition Launched In India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+