Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిఎస్6 టూవీలర్లలో హోండా అరుదైన రికార్డ్; ఇండస్ట్రీలోనే మొదటిసారి!
జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారత మార్కెట్లో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వాహనాల్లో బిఎస్6 నిబంధలను తప్పనిసరి చేసిన అతి కొద్ది సమయంలోనే దేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా బిఎస్6 కంప్లైంట్ ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది. భారత ద్విచక్ర వాహన పరిశ్రమలో ఈ మైలురాయిని సాధించిన మొట్టమొదటి బ్రాండ్ తమదేనని హోండా తెలిపింది.

హోండా అందిస్తున్న పాపులర్ స్కూటర్ యాక్టివా 6జి మరియు పాపులర్ మోటార్‌సైకిల్ షైన్ 125 మోడళ్లకు పెరిగిన భారీ డిమాండ్ కారణంగానే అధిక అమ్మకాల సంఖ్యను నమోదు చేయగలిగామని హోండా తెలిపింది. హోండా తమ స్కూటర్లు, కమ్యూటర్ మోటార్‌సైకిళ్ళు మరియు ప్రీమియం బైక్‌లతో కలిపిన ప్రస్తుతం మొత్తం 11 బిఎస్6 వాహనాలను విక్రయిస్తోంది.

దేశంలో అప్‌గ్రేడ్ చేసిన బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా ఉత్పత్తులను ప్రారంభించిన మొట్టమొదటి తయారీదారు తామేనని, మరియు 1 ఏప్రిల్ 2020 గడువుకు ముందే ఈ ప్రగతిని సాధించామని హెచ్ఎమ్ఎస్ఐ తెలిపింది.
MOST READ:శ్రామిక్ ట్రైన్స్ వల్ల ఇండియన్ రైల్వే ఎంత వసూలు చేసిందో తెలుసా ?

గడచిన ఆర్థిక సంవత్సరంలో హోండా మొత్తం 6.5 లక్షల బిఎస్6 కంప్లైంట్ ద్విచక్ర వహనాలను విక్రయించి, భారత ఉపఖండంలోనే అత్యధికంగా అమ్ముడైన బ్రాండ్‌గా నిలిచింది.

ఈ విషయంపై హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యాద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ.. "హోండాలో ఈ వియజం సాధించినందుకు మాకు చాలా గర్వంగా ఉంది, మా 11 అధునాతన బిఎస్-6 మోడల్స్ విశ్వాస ఓటును గెలుచుకున్నాయి మరియు భారతదేశ వ్యాప్తంగా కస్టమర్లలో కొత్త ఆనందాన్ని తీసుకొచ్చాయ"ని అన్నారు.
MOST READ:మీరు చూసారా.. మాడిఫై చేయబడిన ఫోర్డ్ ఎండీవర్ ఎస్యూవీ

"నిజానికి, బిఎస్-6 యుగంలో హోండా నుండి ఇదొక నిశ్శబ్ధ విప్లవం లాంటింది. మా ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో 110సిసి స్కూటర్లు మరియు మోటార్‌సైకిళ్ల నుండి 1100సిసి ప్రీమియం అడ్వెంచర్ బైక్‌ల వరకు అందుబాటులో ఉన్న ఉత్పత్తులతో ఈ బ్రాండ్ పరిశ్రమలో అత్యంత వైవిధ్యమైనదిగా నిలుస్తుంద"ని ఆయన చెప్పారు.

ఆరోగ్యం, భద్రత మరియు పరిశుభ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చాలా మంది కస్టమర్లు ఇప్పుడు తమ సొంత వాహనాలను మరియు వ్యక్తిగత రవాణా పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని హోండా తెలిపింది.
MOST READ:కొత్త యమహా XSR 155 బైక్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

వాహనాల కోసం ఆన్లైన్ బుకింగ్‌లు, ఇండస్ట్రీ ఫస్ట్ సిక్స్ ఇయర్స్ వారంటీ మరియు అనేక ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాలు వంటి బహుళ కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా హోండా తన విలువను మరింత పెంచుకుంటోంది.

ఇక హోండాకు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే అన్యూజ్డ్ వెహికల్ క్యాంపైన్‌ను ప్రారంభించింది. ఈ క్యాంపైన్లో హోండా ఇదివరకే ముందస్తుగా రిజిస్టర్ చేయబడిన బిఎస్4 మోడళ్లను స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా భారీ తగ్గింపు ధరలతో విక్రయిస్తోంది.
MOST READ:బైకర్పై పోలీసులకు పిర్యాదు చేసిన జయ బచ్చన్ : ఎందుకంటే ?

ప్రభుత్వం ప్రకటించిన ఏప్రిల్ 1, 2020 గడువుకు ముందే బిఎస్4 వాహనాలు ప్రీ-రిజిస్టర్ చేయబడ్డాయి మరియు ఇవన్నీ కూడా ఓడోమీటర్లో సున్నా కిలోమీటర్ల రీడింగ్‌ను కలిగి ఉంటాయి. మరింత సమాచారం కోసం మీ సమీపంలోని హోండా అధీకృత డీలరును సంప్రదించండి.

హోండా అరుదైన బిఎస్6 రికార్డుపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
వాస్తవానికి బిఎస్6 నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ద్విచక్ర వాహన ధరలకు రెక్కలు వచ్చాయి. అట్టి పరిస్థితుల్లో కూడా హోండా ఇంత భారీ సంఖ్యలో అమ్మకాలు నమోదు చేయగలిగిందంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇంత తక్కువ సమయంలో 11 లక్షల బిఎస్6 కంప్లైంట్ ద్విచక్ర వాహనాలను విక్రయించడం పెద్ద విజయమే. అందుకు హోండాకు అభినందనలు.