బైక్స్ కొనాలనుకునే వారికి కొత్త ఫైనాన్స్ స్కీమ్ : హోండా

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు హోండా ఇటీవల దేశవ్యాప్తంగా తన వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ఫైనాన్స్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్కీమ్ ద్వారా వినియోగదారుడు వాహన ఖర్చులో దాదాపు 95 శాతం వరకు ఫైనాన్స్ సదుపాయం కల్పించబడుతుంది.

బైక్స్ కొనాలనుకునే వారికి కొత్త ఫైనాన్స్ స్కీమ్ : హోండా

వినియోగదారుడు మొదటి మూడు నెలలకు నెలవారీ వాయిదాలో మిగిలిన లోన్ లో ఇఎమ్ఐ మొత్తంలో 50 శాతం ఉంటుంది. కస్టమర్ ఈ లోన్ టైంమ్ దాదాపు 3 సంవత్సరాలు అంటే 36 నెలల వరకు ఎంచుకోవచ్చు. కానీ ఈ స్కీమ్ పరిమిత కాలానికి మాత్రమే.

బైక్స్ కొనాలనుకునే వారికి కొత్త ఫైనాన్స్ స్కీమ్ : హోండా

కస్టమర్లు కొత్త హోండా ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే మరియు ఈ ఆఫర్ పొందటానికి సిద్ధంగా ఉంటే, వారు తమ సమీప హోండా డీలర్‌షిప్‌లను సంప్రదించి కొత్త స్కీమ్ పొందవచ్చు. కస్టమర్‌కు వారు కోరుకున్న ద్విచక్ర వాహనాల కొనుగోలుపై ప్రతి నెలా భారీ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు.

బైక్స్ కొనాలనుకునే వారికి కొత్త ఫైనాన్స్ స్కీమ్ : హోండా

హోండా ఇటీవల తమ కొత్త బిఎస్ 6 కంప్లైంట్ లివో మోటార్‌సైకిల్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇది డ్రమ్ మరియు డిస్క్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. కొత్త లివో ధరలు రూ. 69,422, ఎక్స్‌షోరూమ్‌తో ప్రారంభమవుతాయి. కొత్త హోండా బిఎస్ 6 లివో మోటార్‌సైకిల్ మునుపటి మోడల్‌పై అనేక నవీకరణలు కలిగి ఉంటుంది.

బైక్స్ కొనాలనుకునే వారికి కొత్త ఫైనాన్స్ స్కీమ్ : హోండా

కొత్త బిఎస్ 6 లివో హోండాలో బిఎస్-6 కంప్లైంట్ 110 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది. కొత్త మోటారుసైకిల్, బ్రాండ్ యొక్క ESP (మెరుగైన స్మార్ట్ పవర్) సాంకేతికతను కూడా కలిగి ఉంది, అదే సమయంలో మెరుగైన పనితీరుతో పాటు మెరుగైన ఇంధన-సామర్థ్యాన్ని అందిస్తుందని పేర్కొంది.

బైక్స్ కొనాలనుకునే వారికి కొత్త ఫైనాన్స్ స్కీమ్ : హోండా

హోండా కంపెనీ ఇటీవల కాలంలో రూ. 73,336 ప్రారంభ ధరతో దేశీయ మార్కెట్లో గ్రాజియా 125 బిఎస్ 6 స్కూటర్‌ను విడుదల చేసింది. కొత్త హోండా గ్రాజియా స్కూటర్ ఇప్పుడు బిఎస్-6 కంప్లైంట్ 124 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పి మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇది V- టైప్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

బైక్స్ కొనాలనుకునే వారికి కొత్త ఫైనాన్స్ స్కీమ్ : హోండా

ఈ స్కూటర్ స్టాండర్డ్ మరియు డీలక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. హోండా గ్రాజియా 125 బిఎస్ 6 స్కూటర్ మాండా సైబర్ ఎల్లో, పెర్ల్ సైరన్ బ్లూ, మాట్టే యాక్సిస్ గ్రే మరియు పెర్ల్ స్పార్టన్ రెడ్ అనే కలర్స్ లో లభిస్తుంది.

బైక్స్ కొనాలనుకునే వారికి కొత్త ఫైనాన్స్ స్కీమ్ : హోండా

హోండా కొత్త ఫైనాన్స్ స్కీమ్ గురించి డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

హోండా కంపెనీ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫైనాన్స్ స్కీమ్ ద్వారా తమ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ స్కీమ్ ద్వారా వినియోగదారులు మొదటి మూడు నెలలు ఇఎమ్ఐ లో కొంత భాగాన్ని మాత్రమే ఇవ్వవలసి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ విధానం ద్వారా ఎక్కువమంది వినియోగదారులు తమ బ్రాండ్ వాహనాలను కొనుగోలుచేయడానికి అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 6, 2020, 10:13 [IST]
English summary
Honda Introduces A New Finance Scheme For Its Customers. Read in Telugu.
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+