కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లోనే హోండా టూవీలర్ బుకింగ్స్

దేశంలో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో, హోండా ఇండియా తన అధికారిక వెబ్‌సైట్ www.honda2wheelersindia.com లో 'ఆన్‌లైన్ బుకింగ్' ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఇది కొనుగోలుదారులకు , సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ హోండా వాహనాల కొనుగోలుపై వినియోగదారులకు త్వరితగతిన, పారదర్శకమైన బుకింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లోనే హోండా టూవీలర్ బుకింగ్స్

ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు తమ అభిమాన హోండా ద్విచక్ర వాహనాన్ని ఎంచుకోవచ్చు, తమకు నచ్చిన వేరియంట్, కలర్ మరియు హోండా అధీకృత డీలర్‌ను ఎంచుకోవచ్చు. కస్టమర్లు కేవలం ఆరు సాధారణ దశల్లో బుకింగ్ ప్రక్రియు పూర్తి చేసుకోచ్చు. కాంటాక్ట్‌లెస్ కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌ను మరింత బలోపేతం చేయడానికి మరియు సామాజిక దూరాన్ని కొనసాగించడానికి కంపెనీ ఈ ప్రోగ్రామ్‌తో ముందుకు వచ్చింది.

కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లోనే హోండా టూవీలర్ బుకింగ్స్

బ్రాండ్‌తో కస్టమర్ల డిజిటల్ ఎంగేజ్‌మెంట్‌ను పెంచడానికి ప్రాధాన్యత ఇచ్చేలా ప్రారంభించిన ఈ ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ గురించి హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యాద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, "ఈ కొత్త యుగంలో కాంటాక్ట్‌లెస్ కస్టమర్‌తో కనెక్ట్ అవ్వడానికి డిజిటలైజేషన్ చాలా కీలకమైనది. కస్టమర్లు మా అధికారిక వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా వారి అభిమాన హోండా టూ వీలర్‌ను, ఇంటి నుంచి బయటకు రాకుండానే బుక్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. మొత్తం వాహనాల ఎంపిక మరియు బుకింగ్ ప్రక్రియ సురక్షితమైనది మరియు కేవలం కొన్ని సాధారణ క్లిక్‌లుతో కంప్రెస్ చేయబడింది కాబట్టి వినియోగదారులు మనశ్శాంతిగా విశ్రాంతి తీసుకోవచ్చ"ని అన్నారు.

కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లోనే హోండా టూవీలర్ బుకింగ్స్

హోండాకి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే బిఎస్6 కంప్లైంట్ ఎక్స్-బ్లేడ్‌ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ మోడల్ ప్రారంభ ధఱ రూ.1.55 లక్షలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది. ఈ మోటారుసైకిల్ రెండు వేరియంట్లలో (సింగిల్-డిస్క్ మరియు డబుల్ డిస్క్) లభ్యం కానుంది. ఇందులో కొత్త ఫీచర్లు, పరికరాలు ఉన్నాయి.

కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లోనే హోండా టూవీలర్ బుకింగ్స్

కొత్త హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్6 మోటారుసైకిల్‌లో ఇప్పుడు ఇదివరకటి 160 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌నే అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 13.67 బిహెచ్‌పి మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 14.7 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లోనే హోండా టూవీలర్ బుకింగ్స్

హోండా ఎక్స్-బ్లేడ్‌లో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు మోనో-షాక్ సస్పెన్షన్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 276 మిమీ సింగిల్ డిస్క్ మరియు వేరియంట్‌ను బట్టి వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ లేదా 130 మిమీ డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఈ మోటారుసైకిల్ సింగిల్-ఛానల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా కలిగి ఉంటుంది. బేస్ వేరియంట్ 146 కిలోల బరువును, టాప్ ఎండ్ వేరియంట్ 147 కిలోల బరువును కలిగి ఉంటుంది.

కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లోనే హోండా టూవీలర్ బుకింగ్స్

హోండా టూవీలర్స్ ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హోండా ఈ ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా టూవీలర్ కొనుగోలు ప్రక్రియను చాలా సులభతరం చేసింది. ఇకపై హోండా వాహనాన్ని కొనాలనుకునే కస్టమర్లు షోరూమ్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. హాయిగా ఇంట్లో కూర్చునే, కేవలం కొన్ని సింపుల్ క్లిక్‌లతో తమకు నచ్చిన ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, July 11, 2020, 11:25 [IST]
English summary
Honda India has launched its digital, secure and convenient 'Online Booking' platform on its official website. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+