హోండా లివో బిఎస్6 డిస్క్ బ్రేక్ వేరియంట్ ధరెంతో తెలుసా?

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎమ్ఎస్‌ఐ) ఇటీవలే భారత మార్కెట్లో తమ కొత్త బిఎస్6 'హోండా లివో' ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఇందులో కంపెనీ ఓ కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

హోండా లివో బిఎస్6 డిస్క్ బ్రేక్ వేరియంట్ ధరెంతో తెలుసా?

డిస్క్ బ్రేక్ ఆప్షన్‌తో టాప్-ఆఫ్-ది లైన్ వేరియంట్‌గా రానున్న కొత్త, హోండా లివో డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.74,256 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. గడచిన జూన్ 2020లో హోండా భారత మార్కెట్లో బిఎస్6 అప్‌డేట్‌తో కొత్త లివో 110 సిసి కమ్యూటర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.

హోండా లివో బిఎస్6 డిస్క్ బ్రేక్ వేరియంట్ ధరెంతో తెలుసా?

అప్పట్లో హోండా కేవలం డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధరను మాత్రమే వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్లో హోండా లివో బిఎస్6 డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.70,056 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కొత్త హోండా బిఎస్6 లివో మోటార్‌సైకిల్‌తో మునుపటి మోడల్‌తో పోలిస్తే అనేక అప్‌డేట్స్ ఉన్నాయి.

MOST READ:బజాజ్ ప్లాటినా 100 ఈఎస్ డిస్క్ వేరియంట్ డెలివరీలు ప్రారంభం

హోండా లివో బిఎస్6 డిస్క్ బ్రేక్ వేరియంట్ ధరెంతో తెలుసా?

ఈ రెండు వేరియంట్లలో బ్రేక్ ఆప్షన్ మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. లివో మోటార్‌సైకిల్‌లో హోండా పిజిఎమ్-ఫై (ఫ్యూయెల్-ఇంజెక్షన్) సిస్టమ్‌తో అప్‌డేట్ చేసిన బిఎస్6-కంప్లైంట్ 110 సిసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇంకా ఇందులో ఈఎస్‌పి (ఎన్‌హ్యాన్స్డ్ స్మార్ట్ పవర్) సాంకేతికతను కూడా ఉపయోగించారు. ఈ రెండు టెక్నాలజీల కలయితో రూపొందింన బిఎస్6 ఇంజన్ ఇప్పుడు మరింత మెరుగైన మైలేజీని, అదే సమయంలో మరింత మెరుగైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ చెబుతోంది.

హోండా లివో బిఎస్6 డిస్క్ బ్రేక్ వేరియంట్ ధరెంతో తెలుసా?

హోండా లివో మోటార్‌సైకిల్‌లోని 109 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 బిహెచ్‌పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.6 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఫోర్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ల్యాండ్ రోవర్ ని కాపాడిన మహీంద్రా థార్, ఎలాగో వీడియో చూడండి

హోండా లివో బిఎస్6 డిస్క్ బ్రేక్ వేరియంట్ ధరెంతో తెలుసా?

హోండా లివో బిఎస్6 మోడల్‌ను కంపెనీ అనేక ఫీచర్లు, అప్‌డేట్స్‌తో మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో మరింత అందంగా కనిపించేలా డిజైన్ చేసిన ఫ్యూయెల్ ట్యాంక్, ఆకర్షనీయమైన కొత్త బాడీ గ్రాఫిక్స్, ట్యాంక్‌కు ఇరువైపులా ఉండే కవర్స్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ విజర్ వంటి ఫీచర్లతో ఇప్పుడు ఇది మరింత స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంటుంది.

హోండా లివో బిఎస్6 డిస్క్ బ్రేక్ వేరియంట్ ధరెంతో తెలుసా?

కొత్త హోండా లివో బిఎస్6 మోటార్‌సైకిల్‌లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో సరికొత్త డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏసిజి స్టార్టర్ మోటర్, పాసింగ్ స్విచ్‌తో కొత్త డిసి హెడ్‌ల్యాంప్‌లు, స్టార్ట్ / స్టాప్ ఇంజన్ స్విచ్ మరియు సర్వీస్-డ్యూ ఇండికేటర్ వంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:కారులో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లండి

హోండా లివో బిఎస్6 డిస్క్ బ్రేక్ వేరియంట్ ధరెంతో తెలుసా?

ఇంకా ఇందులో 17 మి.మీ పొడవైన సీటు కూడా ఉంటుంది, ఇది రైడర్ మరియు పిలియన్ ఇద్దరికీ మరింత సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేశారు. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో 5-స్టెప్ అడ్జస్టబల్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి.

హోండా లివో బిఎస్6 డిస్క్ బ్రేక్ వేరియంట్ ధరెంతో తెలుసా?

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇది డ్రమ్ లేదా డిస్క్ బ్రేక్‌ ఆప్షన్లతో లభ్యం కానుంది. డిస్క్ బ్రేక్ వేరియంట్‌లో ముందు వైపు 240 మిమీ డిస్క్, వెనుక వైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉంటాయి. మెరుగైన బ్రేకింగ్ కోసం ఇవి రెండూ కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ (సిబిఎస్) ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి.

MOST READ:పవిత్రమైన కాబాపై విమానాలు ప్రయాణించవు, ఎందుకో తెలుసా ?

హోండా లివో బిఎస్6 డిస్క్ బ్రేక్ వేరియంట్ ధరెంతో తెలుసా?

కొత్త హోండా లివో బిఎస్6 డిస్క్ బ్రేక్ వేరియంట్ మోటార్‌సైకిల్ మొత్తం నాలుగు రంగులలో (అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ మరియు బ్లాక్) లభ్యం కానుంది.

హోండా లివో బిఎస్6 డిస్క్ బ్రేక్ వేరియంట్ ధరెంతో తెలుసా?

హోండా లివో బిఎస్6 డిస్క్ వేరియంట్ ధరపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో కొత్త హోండా లివో బిఎస్6 డిస్క్ బ్రేక్ వేరియంట్‌ను విడుదల చేసిన దాదాపు రెండు నెలల తర్వాత కంపెనీ ఇందులో డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర వివరాలను వెల్లడి చేసింది. హోండా లివో బిఎస్6 మార్కెట్లోని 110 సిసి మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో హీరో స్ప్లెండర్ ప్లస్, టివిఎస్ రేడియాన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Honda Motorcycles & Scooters India (HMSI) has revealed the prices of the top-spec 'disc brake' variant of the recently updated BS6-compliant Livo motorcycle. The Honda Livo BS6 disc brake variant is priced at Rs 74,256, ex-showroom (Delhi). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X