కొత్త హోండా లివో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) భారత మార్కెట్లో మరో కొత్త బిఎస్6 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. హోండా నుంచి లభ్యం కానున్న ఈ ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిల్ 'హోండా లివో'లో కంపెనీ బిఎస్6 వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

కొత్త హోండా లివో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

భారత మార్కెట్లో హోండా నుంచి బిఎస్6 అప్‌డేట్ పొందిన 110 సిసి కమ్యూటర్ మోటార్‌సైకిల్ జాబితాలో తాజాగా ఈ కొత్త'హోండా లివో' వచ్చి చేరింది. కొత్త హోండా బిఎస్6 లివో మోటార్‌సైకిల్‌తో మునుపటి మోడల్‌తో పోలిస్తే అనేక అప్‌డేట్స్ ఉన్నాయి.

కొత్త హోండా లివో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇందులో హోండా పిజిఎం-ఫై (ఫ్యూయెల్-ఇంజెక్షన్) సిస్టమ్‌తో అప్‌డేట్ చేసిన బిఎస్6-కంప్లైంట్ 110 సిసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇంకా ఉందులో ఇఎస్‌పి (ఎన్‌హ్యాన్స్డ్ స్మార్ట్ పవర్) సాంకేతికతను కూడా ఉపయోగించారు. ఈ రెండు టెక్నాలజీల కలయితో రూపొందింన బిఎస్6 ఇంజన్ ఇప్పుడు మరింత మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని (మైలేజీని), అదే సమయంలో మరింత మెరుగైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ పేర్కొంది.

MOST READ: విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP, ఎవరో తెలుసా ?

కొత్త హోండా లివో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

మార్కెట్లో కొత్త హోండా లివో 110సీసీ బైక్‌ను విడుదల చేసిన సందర్భంగా హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యాద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, "తమ బిఎస్6 లైనప్‌లో కొత్త విలువను సృష్టించడం ద్వారా తమ బ్రాండ్‌పై కస్టమర్ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని, హోండా లివోను 2015లో ప్రారంభించినప్పటి ఇప్పటి వరకూ కొనుగోలుదారులను ఎంతగా ఆకట్టుకుంటోదని, హోండా యొక్క సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం మరియు దాని అర్బన్ స్టయిల్‌తో, హోండా లివో బిఎస్6 ఈ విభాగంలో స్టైల్, పనితీరు, విలువులను మరింత పెంచుతుందని" అన్నారు.

కొత్త హోండా లివో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హోండా లివో బిఎస్6 మోడల్‌ను కంపెనీ అనేక ఫీచర్లు, అప్‌డేట్స్ మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో మరింత అందంగా కనిపించేలా డిజైన్ చేసిన ఫ్యూయెల్ ట్యాంక్, ఆకర్షనీయమైన కొత్త బాడీ గ్రాఫిక్స్, ట్యాంక్‌కు ఇరువైపులా ఉండే కవర్స్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ విజర్ వంటి ఫీచర్లతో ఇప్పుడు ఇది మరింత స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంటుంది.

MOST READ: మరింత పొడుగు పెరగనున్న హెవీ వెహికల్స్, ఎందుకంటే ?

కొత్త హోండా లివో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త హోండా లివో బిఎస్6 మోటార్‌సైకిల్‌లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో సరికొత్త డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎసిజి స్టార్టర్ మోటర్, పాసింగ్ స్విచ్‌తో కొత్త డిసి హెడ్‌ల్యాంప్‌లు, స్టార్ట్ / స్టాప్ ఇంజిన్ స్విచ్ మరియు సర్వీస్-డ్యూ ఇండికేటర్ వంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి.

కొత్త హోండా లివో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇంకా ఇందులో 17 మి.మీ పొడవైన సీటు కూడా ఉంటుంది, ఇది రైడర్ మరియు పిలియన్ ఇద్దరికీ మరింత సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేశారు. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో 5-స్టెప్ అడ్జస్టబల్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇది డ్రమ్ లేదా డిస్క్ బ్రేక్‌ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ (సిబిఎస్) స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు.

MOST READ: కెజిఎఫ్ స్టార్ యష్ లగ్జరీ కార్లు, ఎలా ఉన్నాయో చూసారా ?

కొత్త హోండా లివో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త హోండా లివో బిఎస్6 మోటారుసైకిల్ రెండు వేరియంట్లు నాలుగు రంగులలో (అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ మరియు బ్లాక్) లభ్యం కానుంది. భారత మార్కెట్లో కొత్త హోండా లివో బిఎస్6 ప్రారంభ ధర రూ.69,422 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కొత్త హోండా లివో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హోండా లివో బిఎస్6 విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త హోండా లివో బిఎస్6 హోండా బ్రాండ్ లైనప్‌లో సరికొత్తగా వచ్చిన చేసిన 110 సిసి కమ్యూటర్ రేంజ్ మోటార్‌సైకిల్. లివో హోండా బ్రాండ్ లైనప్‌లో బిఎస్6 అప్‌డేట్‌ను అందుకున్న ఐదవ మోటార్‌సైకిల్, ఇప్పటికే యునికార్న్, ఎస్‌పి 125, సిడి 110 మరియు సిబి షైన్‌లు బిఎస్6 వెర్షన్‌తో అప్‌గ్రేడ్ అయ్యాయి.

హోండా లివో బిఎస్6 మార్కెట్లోని 110 సిసి మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో హీరో స్ప్లెండర్ ప్లస్, టివిఎస్ రేడియాన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Honda Motorcycles & Scooters India (HMSI) has launched their new BS6-compliant Livo motorcycle in the Indian market. The new Honda Livo BS6 commuter-level offering is available in two variants: Drum and Disc and is offered with a starting price of Rs 69,422, ex-showroom. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X