వావ్.. ఇది నిజమేనా? మైండ్‌తో కంట్రోల్ అయ్యే హోండా మోటార్‌సైకిల్!

ఆటోమొబైల్ రంగంలో కొత్త రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తున్న సంగతి తెలిసినదే. ఈ కొత్త టెక్నాలజీల సాయంతో ఇప్పటికే మోటారిస్టులు అనేక రకాల ప్రయోజనాలను పొందుతున్న సంగతి తెలిసినదే. యావత్ ప్రపంచం ఇప్పుడు డ్రైవర్ అవసరం లేని వాహనాలను తయారు చేస్తుంటే, హోండా మాత్రం కాస్తంత భిన్నంగా ఆలోచిస్తోంది.

వావ్.. ఇది నిజమేనా? మైండ్‌తో కంట్రోల్ అయ్యో హోండా మోటార్‌సైకిల్!

జపనీస్ మోటార్‌సైకిల్ దిగ్గజం హోండా, ఇప్పుడు మనిషి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునే మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేసే పనిలో బిజీగా ఉంది. హోండా ఇందుకు సంబంధించి ఓ పేటెంట్‌ను కూడా ఫైల్ చేసింది. హోండా మైండ్ రీడింగ్ టెక్నాలజీగా రానున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం మానవ మెదడులోని ఆలోచనలతో పనిచేయనుంది.

వావ్.. ఇది నిజమేనా? మైండ్‌తో కంట్రోల్ అయ్యో హోండా మోటార్‌సైకిల్!

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, ఇది సాధ్యమేనంటోంది హోండా. హోండా అభివృద్ధి చేస్తున్న మైండ్-రీడింగ్ బైక్ కోసం బ్రెయిన్-వేవ్-డిటెక్షన్ సిస్టమ్‌కి గాను కంపెనీ పేటెంట్‌ను కూడా దాఖలు చేసింది. ఈ సాంకేతికతో రైడర్ల ఆలోచనల ద్వారా మోటార్‌సైకిల్‌కు ఆదేశాలు వెళ్తాయి.

MOST READ:ఢిల్లీలో వెహికల్స్ రూట్ మార్చిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

వావ్.. ఇది నిజమేనా? మైండ్‌తో కంట్రోల్ అయ్యో హోండా మోటార్‌సైకిల్!

సింపుల్‌గా చెప్పాలంటే, ఒక రైడర్ ఇంజన్‌ను ఆన్ చేయాలనుకుంటే మనసులో అనుకుంటే సరిపోతుంది. అలాగే బ్రేక్ వేయాలన్నా లేదా వీలీ చేయాలన్నా సరే మనసులో అనుకుంటే చాలు, ఆ వెంటనే మోటార్‌సైకిల్ సదరు రైడర్ ఆలోచనలకు అనుగుణంగా స్పందిస్తుంది.

వావ్.. ఇది నిజమేనా? మైండ్‌తో కంట్రోల్ అయ్యో హోండా మోటార్‌సైకిల్!

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కి చెందిన హోండా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఈ టెక్నాలజీ కోసం పేటెంట్‌ను దాఖలు చేసింది. ఇప్పుడు ఇది ప్రపంచంలోనే చాలా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ టెక్నాలజీ పనిచేయాలంటే రైడర్ ఇందు కోసం తప్పనిసరిగా ఓ అధునాత హెల్మెట్‌ను ధరించాల్సి ఉంటుంది.

MOST READ:భారత నావీలో మరో బ్రహ్మాస్త్రం.. శత్రువుల గుండెల్లో గుబేల్..

వావ్.. ఇది నిజమేనా? మైండ్‌తో కంట్రోల్ అయ్యో హోండా మోటార్‌సైకిల్!

మెదడు-వేవ్ సిగ్నల్‌లను ఎంచుకొని వాటిని బ్రెయిన్-మెషిన్ ఇంటర్‌ఫేస్ (బిఎమ్‌ఐ)కి అందించగల అంతర్నిర్మిత ఎలక్ట్రోడ్‌లతో ఈ హెల్మెట్‌ను తయారు చేశారు. ఈ హెల్మెట్ రైడర్ బ్రెయిన్‌ను ఆధ్యయనం చేసి, దాని ఆదేశాలను మోటార్‌సైకిల్‌కు పంపుతుంది. ఇది ఐఎమ్‌యూ, యాక్సిలెరోమీటర్లు, ఎలక్ట్రానిక్ థ్రోటల్, ఏబిఎస్, టిసి వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటుంది.

వావ్.. ఇది నిజమేనా? మైండ్‌తో కంట్రోల్ అయ్యో హోండా మోటార్‌సైకిల్!

హోండా రిలీజ్ చేసిన పేటెంట్ చిత్రాల ప్రకారం, రైడర్ తన మనస్సును ఉపయోగించి వీలీ లేదా స్టాప్పీని చేయటం ఇందులో గమనించవచ్చు. ప్రస్తుతానికి, ఇది పేటెంట్ మాత్రమే, ఇలాంటి సామర్థ్యం కలిగిన రియల్ వలర్డ్ మోటార్‌సైకిల్‌ను చూడటానికి మనం బహుశా ఒకటి లేదా రెండు సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది.

MOST READ:డ్రీమ్ కార్‌లో కనిపించిన రిషబ్ శెట్టి.. అతని డ్రీమ్ నిజం చేసినది ఎవరో తెలుసా ?

వావ్.. ఇది నిజమేనా? మైండ్‌తో కంట్రోల్ అయ్యో హోండా మోటార్‌సైకిల్!

హోండా అభివృద్ధి చేయబోయే ఈ మైండ్ రీడింగ్ టెక్నాలజీని కేవలం కాన్సెప్ట్‌కు మాత్రమే పరిమితం చేస్తుంగా లేక ఉత్పత్తి దశకు తీసుకువెళ్తుందా అనేది కూడా వేచి చూడాలి. మైండ్ రీడింగ్ బైక్ కొత్త కావచ్చ కానీ మైండ్ రీడింగ్ యంత్రాలు కొత్తేమీ కాదు. వైద్య ప్రయోజనాల కోసం ఇప్పటికే కొన్ని రకాల మైండ్ రీడింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు.

వావ్.. ఇది నిజమేనా? మైండ్‌తో కంట్రోల్ అయ్యో హోండా మోటార్‌సైకిల్!

హోండా మైండ్ రీడింగ్ టెక్నాలజీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

నిజానికి మోటారుసైకిల్ ప్రపంచంలో ఇటువంటి ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలకు హోండా కొత్తేమీ కాదు. గడచిన 2017లో కూడా హోండా ఓ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. హోండా ప్రదర్శించిన సెల్ఫ్ బ్యాలెన్సింగ్ మోటార్‌సైకిల్‌ను స్టాండ్ వేయాల్సిన అవసరం లేకుండానే రెండు చక్రాలపై నిలబెట్టవచ్చు.

MOST READ:సాధారణ కారుని సోలార్ కార్‌గా‌ మార్చిన ఘనుడు.. పూర్తి వివరాలు

Most Read Articles

English summary
Japanese motorcycle major Honda has filed patent for Mind Reading Technology for its upcoming motorcycle. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X