హీరో మా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను కాపీ కొట్టింది: హోండా

ఒకప్పుడు హీరో, హోండా రెండు కంపెనీలు కలిసి భారత్‌లో అద్భుతమైన ద్విచక్ర వాహనాలను అందించిన సంగతి మనందరికీ తెలిసినదే. ఎప్పుడైతే హీరో నుంచి హోండా విడిపోయిందో అప్పటి నుండి ఈ రెండు కంపెనీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ద్విచక్ర వాహనాల విభాగంలో అగ్రస్థానం కోసం ఈ రెండు కంపెనీలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుంటాయి.

హీరో మా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను కాపీ కొట్టింది: హోండా

తాజాగా.. ఈ ఇరు కంపెనీల మధ్య కొత్త వివాదం ఒకటి పుట్టుకొచ్చింది. హీరో సంస్థకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగం హీరో ఎలక్ట్రిక్ తమ స్కూటర్ డిజైన్‌ను కాపీ కొట్టిందంటూ హోండా మోటార్ జపాన్ ఆరోపిస్తోంది. ఈ మేరకు మే 22, 2020న కోర్టులో ఓ దావా కూడా వేసింది. హీరో ఎలక్ట్రిక్ డ్యాష్ (Dash) స్కూటర్‌లోని ఫ్రంట్ అండ్ రియర్ ల్యాంప్ డిజైన్‌ను తమ మూవ్ (Moove) ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి కాపీ కొట్టారని హోండా ఆరోపిస్తోంది.

హీరో మా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను కాపీ కొట్టింది: హోండా

ఈటి ఆటోలో ప్రచురితమైన కథనం ప్రకారం, హోండా మోటార్ జపాన్ భారత్‌కు చెందిన హీరో ఎలక్ట్రిక్‌పై కాపీరైట్ ఉల్లంఘన కేసు ఫైల్ చేసింది. 'రిజిస్టర్డ్ డిజైన్' కలిగిన తమ మూవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ముందు మరియు వెనుక లైట్ డిజైన్లను హీరో ఎలక్ట్రిక్ తన డ్యాష్ స్కూటర్ కోసం కాపీ చేసిందని హోండా తన పిటిషన్‌లో పేర్కొంది.

MOST READ: ఇది కూడా చదవండి: మ్యాక్సీ స్కూటర్‌ను ఆవిష్కరించిన హోండా

హీరో మా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను కాపీ కొట్టింది: హోండా

అంతేకాకుండా.. హీరో డ్యాష్ తయారీని, అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని మరియు మార్కెట్లో డ్యాష్ స్కూటర్‌కి సంబంధించిన ప్రకటనలను కూడా పూర్తిగా ఆపివేయాలని ఈ జపాన్ బ్రాండ్ హోండా డిమాండ్ చేస్తోంది. కాగా.. ఈ విషయంపై హీరో ఎలక్ట్రిక్ ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయింది.

హీరో మా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను కాపీ కొట్టింది: హోండా

ఢిల్లీ హైకోర్టులో ఈ విషయంపై హీరో, హోండా కంపెనీల మధ్య విచారణ సాగుతోంది. తొలుత మే 29 హోండా తమ వాదనలను వినిపించగా, జూన్ 2న హీరో తమ వాదనలను వినిపించింది. ప్రస్తుతానికి ఈ కేసు జూన్ 11కి వాయిదా పడింది.

MOST READ: ఇది కూడా చదవండి: బిఎస్-6 హోండా CD 110 డ్రీమ్‌బైక్ : ధర & ఇతర వివరాలు

హీరో మా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను కాపీ కొట్టింది: హోండా

వాస్తవానికి హోండా మూవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో అమ్ముడు కావడం లేదు. జపాన్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, హీరో ఎలక్ట్రిక్ మాత్రం తమ డ్యాష్ స్కూటర్‌ని ఆగస్ట్ 2019లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం హీరో డ్యాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.62,000గా (ఎక్స్-షోరూమ్) ఉంది.

హీరో మా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను కాపీ కొట్టింది: హోండా

హీరో ఎలక్ట్రిక్ డ్యాష్ స్కూటర్‌లో 48V 28Ah లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఈ బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే గరిష్టంగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవటానికి నాలుగు గంటల సమయం పడుతుంది.

MOST READ: ఇది కూడా చదవండి: హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపైన అమేజింగ్ ఆఫర్..ఇప్పుడు 29 వేలకే స్కూటర్

హీరో మా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను కాపీ కొట్టింది: హోండా

డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బి చార్జింగ్, విశాలమైన బూట్ స్టోరేజ్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అనేక విశిష్టమైన ఫీచర్లతో హీరో డ్యాష్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను డిజైన్ చేశారు.

హీరో మా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను కాపీ కొట్టింది: హోండా

హీరో ఎలక్ట్రిక్ విషయంలో హోండా కోర్టుకి వెళ్లడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

డ్యాష్ స్కూటర్ విషయంలో హోండా చేస్తున్న ఆరోపణలపై హీరో ఎలక్ట్రిక్ ఇంకా మీడియాతో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆటో పరిశ్రమ ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ నుంచి తేరుకుంటున్న తరుణంలో హీరోపై హోండా ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. ఈ పరిస్థితులను గమనిస్తుంటే, హోండా కూడా భారత ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో కాలు మోపేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ, ఈ విషయంలో ఇరు కంపెనీల నుంచి ఓ అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి ఉండక తప్పదు.

Source: ఈటి ఆటో

Most Read Articles

English summary
Honda Motor Japan has sued Hero Electric over 'design infringement' on the 22nd of May 2020. The Japanese brand states that the front and rear lamp design on their Moove electric scooter has been copied and used on the Hero Electric Dash model. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more