హోండా మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై డిసెంబర్ 2020 ఆఫర్స్

ఇయర్ ఎండ్ సమీపిస్తుండటంతో దేశంలోని వాహన తయారీదారులు తమ అమ్మకాల లక్ష్యాలను చేరుకునేందుకు మరియు పాత స్టాక్‌లను క్లియర్ చేసుకునేందుకు వాహనాలపై భారీ తగ్గింపులను అందిస్తున్నారు. ఇదే కోవలో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ కూడా తమ ప్రోడక్ట్ లైనప్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై డిస్కౌంట్లను ప్రకటించింది.

హోండా మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై డిసెంబర్ 2020 ఆఫర్స్

డిసెంబర్ 2020 నెల ఆఫర్లలో భాగంగా హోండా అందిస్తున్న పాపులర్ యాక్టివా 6జి మరియు హార్నెట్ 2.0 మోడళ్లపై కంపెనీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఈ రెండు మోడళ్లను క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఇఎమ్ఐ ఆప్షన్‌పై కొనుగోలు చేసినట్లయితే, సదరు కస్టమర్లు 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

హోండా మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై డిసెంబర్ 2020 ఆఫర్స్

ఈ విధానం ద్వారా కొనుగోలు చేయటం వలన ఎలాంటి ముందస్తు చెల్లింపు (డౌన్‌పేమెంట్) చేయాల్సిన అవసరం ఉండదని, అంతేకాకుండా ఇందుకోసం ఎటువంటి డాక్యుమెంటేషన్ మరియు హైపోథెకేషన్ అవసరం లేదని కంపెనీ తమ ప్రకటనలో పేర్కొంది.

MOST READ:ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

హోండా మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై డిసెంబర్ 2020 ఆఫర్స్

ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందించే బ్యాంకులు, ఆర్థిక సంస్థల వివరాలను కూడా కంపెనీ తమ ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రకటన ప్రకారం, హోండా హార్నెట్ 2.0ను ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టెడ్, ఫెడరల్ బ్యాంక్ కంపెనీల కార్డుల నుండి ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ సౌలభ్యం లభిస్తుంది.

హోండా మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై డిసెంబర్ 2020 ఆఫర్స్

అలాగే, హోండా యాక్టివా 6 స్కూటర్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టెడ్, ఫెడరల్ బ్యాంక్ కంపెనీల కార్డుల నుండి ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ సౌలభ్యం లభిస్తుంది. పైన పేర్కొన్న బ్యాంకులలో ఏదైనా బ్యాంక్ ఖాతా లేదా క్రెడిట్ కార్డును కలిగి ఉన్న కస్టమర్లు ఎలాంటి వెయిటింగ్/పేపర్ వర్క్ లేకుండా ఈ మోడళ్లను సొంతం చేసుకోవచ్చు.

MOST READ:మీకు తెలుసా.. అమెరికాలో 2021 రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ఒక టీవీ షో హోస్ట్

హోండా మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై డిసెంబర్ 2020 ఆఫర్స్

హోండా అందిస్తున్న పాపులర్ స్కూటర్ యాక్టివాకు భారత మార్కెట్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భారతదేశ స్కూటర్ చరిత్రను తిరగరాసిన హోండా యాక్టివా, గడచిన కొన్ని దశాబ్ధాలుగా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. దేశంలోనే అత్యధికంగా అమ్మడవుతున్న స్కూటర్లలో హోండా యాక్టివా అన్ని మోడళ్ల కన్నా ముందంజలో ఉంటుంది.

హోండా మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై డిసెంబర్ 2020 ఆఫర్స్

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఆరవ తరం హోండా యాక్టివా 6జి మోడల్‌ను కంపెనీ ఈ ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత్‌లో యాక్టివా బ్రాండ్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని కంపెనీ ఇటీవలే యాక్టివా 6జి లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను కూడా విడుదల చేసింది.

MOST READ:కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

హోండా మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై డిసెంబర్ 2020 ఆఫర్స్

ఇక హోండా హార్నెట్ 2.0 విషయానికి వస్తే, గడచిన ఆగస్ట్ 2020 నెలలో కంపెనీ ఈ మోడల్‌ను ధర రూ.1.26 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసింది. స్పోర్టీ డిజైన్, అగ్రెసివ్ క్రీజ్ లైన్స్, స్టైలిష్ బాడీ కాంటౌర్స్ మరియు గ్రాఫిక్స్‌తో ఇది చాలా స్పోర్టీగా కనిపిస్తుంది.

హోండా మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై డిసెంబర్ 2020 ఆఫర్స్

హోండా హార్నెట్ 2.0 మోటార్‌సైకిల్‌లో పిజిఎమ్-ఫై టెక్నాలజీతో తయారు చేసిన కొత్త బిఎస్6 కంప్లైంట్ 184సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 16.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

Most Read Articles

English summary
Honda Motorcycle December Cashback Offer On Activa And Hornet Details, Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X