Just In
- 21 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 24 hrs ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సెప్టెంబర్ 30న కొత్త హోండా హైనెస్ మోటార్‌సైకిల్ విడుదల, టీజర్ వీడియో
జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) సెప్టెంబర్ 30వ తేదీన కొత్త లగ్జరీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ఓ కొత్త టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది. 'యువర్ హైనెస్ ఈజ్ అరైవింగ్ సూన్' అనే ట్యాగ్లైన్లతో ఓ టీజర్ వీడియోను విడుదల చేసింది.

ఇందులో ఓ మోడల్ బైనాక్యులర్స్ ఉపయోగించి మోటార్‌సైకిల్ ప్రయాణాన్ని వీక్షించడాన్ని మనం గమనించవచ్చు. టీజర్లో పేర్కొన్న ట్యాగ్లైన్స్ని బట్టి చూస్తుంటే, హోండా మోటార్‌సైకిల్ నుండి కొత్తగా రానున్న బైక్ చాలా ప్రీమియం మోడల్ అయి ఉండొచ్చని తెలుస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మోడల్‌ను హోండా హెచ్'నెస్ అని పిలిచే అవకాశం ఉంది.

హోండా బిగ్‌వింగ్ ఇండియా తమ అధికారిక సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన టీజర్ వీడియోను గమనిస్తుంటే, ఈ బ్రాండ్ నుంచి రానున్న కొత్త మోటార్‌సైకిల్ ఆల్ట్రా ప్రీమియం మోటార్‌సైకిల్ అని తెలుస్తోంది. దీనిని ప్రత్యేకంగా బ్రాండ్ యొక్క ప్రీమియం బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది.
MOST READ:ఎంజి గ్లోస్టర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !
మార్కెట్ ఊహాగానాల ప్రకారం, కొత్త మోటార్‌సైకిల్ 300 - 500 సిసి విభాగంలో లభ్యమయ్యే క్రూయిజర్ స్టైల్ మోడల్ అని తెలుస్తోంది. ఇది ఈ విభాగంలో నేరుగా రాయల్ ఎన్ఫీల్డ్ మరియు జావా వంటి మోటార్‌సైకిళ్లకు ప్రత్యక్ష పోటీనిచ్చే అవకాశం ఉంది.
ఈ కొత్త మోటార్‌సైకిల్ హోండా అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న రెబెల్ 300 మోడల్ ఆధారంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఈ కొత్త మోటారుసైకిల్‌లో అనేక ముఖ్యమైన అప్‌గ్రేడ్స్ మరియు మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకించి భారత మార్కెట్‌కు అనుగుణంగా దీనిని మోడిఫై చేసే అవకాశం ఉంది.
MOST READ:బ్రేకింగ్ : నగరాల్లో డీజిల్ వెహికల్స్ నిషేధం.. ఎందుకో తెలుసా ?

హోండా నుంచి కొత్తగా రానున్న ప్రీమియం మోటార్‌సైకిల్ 500 సిసి మోడల్ కావచ్చని కూడా పుకార్లు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఏంటనేది తెలియాలంటే సెప్టెంబర్ 30 వరకూ వేచి ఉండాల్సిందే.

హోండా ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదల చేసిన హార్నెట్ 2.0 విషయంలోనూ ఇదే జరిగింది. కొత్త హోండా హార్నెట్ 2.0ను అంతర్జాతీయ మార్కెట్లో హోండా విక్రయిస్తున్న సిబి 190ఆర్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసి, భారత మార్కెట్‌కు అనుగుణంగా అనేక మార్పులతో దీనిని అప్‌గ్రేడ్ చేశారు.
MOST READ:ఈ ప్లాన్ ద్వారా కారు కొనకుండా కార్ ఓనర్ అవ్వొచ్చు.. ఎలాగో మీరే చూడండి

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 మోటార్‌సైకిల్‌లో 184సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్పి పవర్‌ను మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 16.1 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

అంతర్జాతీయ మోడల్‌తో పోల్చితే హార్నెట్ 2.0 లో చేసిన మార్పుల కారణంగా హోండా ఈ మోటార్‌సైకిల్‌ను అత్యంత పోటీ ధరకే విక్రయించేందుకు అవకాశం ఏర్పడింది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.1.26 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.
MOST READ:భారత్‌లో కార్యకలాపాలను నిలిపివేసిన లగ్జరీ బైక్ కంపెనీ హార్లే డేవిడ్సన్, ఎందుకో తెలుసా ?

హోండా కొత్త మోటార్‌సైకిల్ టీజర్ వీడియోపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
టీజర్ వీడియో ప్రకారం, హోండా ప్రవేశపెట్టబోయేది ప్రీమియం మోటార్‌సైకిల్ అని తెలుస్తోంది. ప్రస్తుతానికి కొత్త ఉత్పత్తికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని కంపెనీ వెల్లడించలేదు. ఈ కొత్త మోటార్‌సైకిల్ గురించి మాకు సమాచారం అందిన వెంటనే మీకు తెలియజేస్తాము.