మ్యాక్సీ స్కూటర్‌ను ఆవిష్కరించిన హోండా
భారతదేశంలో ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హోండా మోటార్‌సైకిల్స్ 2020 పిసిఎక్స్ 150 మ్యాక్సీ స్కూటర్‌ను నాలుగు కొత్త రంగుల్లో థాయ్‌లాండ్‌లో ఆవిష్కరించింది. హోండా ఆవిష్కరించిన మ్యాక్సీ స్కూటర్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. !

హోండా యొక్క 2020 పిసిఎక్స్ 150 మోడల్ స్కూటర్ సాధారణంగా బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఈ స్కూటర్ ముందు భాగం ఫాసియా మరియు సీటు ఎరుపు రంగులో ఉంటుంది. 2020 మ్యాక్సీ స్కూటర్ నలుపు మరియు తెలుపు రంగులలో విక్రయించబడుతుంది.

స్కూటర్ యొక్క కొన్ని భాగాలు తెలుపు మరియు ఎరుపు రంగులో కూడా ఉంటాయి. అంతే కాకుండా అదనంగా కొత్త పిసిఎక్స్ 150 స్కూటర్ హోండా గ్రే మరియు ఫుల్ రెడ్ అనే రెండు కొత్త రంగులలో విక్రయించబడింది.

ఈ రెండు రంగుల స్కూటర్లలోని అల్లాయ్ వీల్స్ గోల్డ్ కోటింగ్ కలిగి ఉంటాయి. ఈ కొత్త రంగులను పక్కన పెడితే హోండా ఈ 2020 స్కూటర్ మోడల్‌లో ఎటువంటి కాస్మెటిక్ మార్పులు చేయలేదు.

హోండా కొత్త స్కూటర్ లో వున్న హెడ్‌లైట్, స్టైలిష్ బాడీవర్క్, ఎల్‌ఈడీ లాంప్స్‌తో కూడిన కొత్త స్కూటర్ పాత స్కూటర్ లాగా కనిపిస్తుంది. హోండా యొక్క స్మార్ట్ కంట్రోలర్ కూడా ఈ మ్యాక్సీ స్కూటర్‌లో ఉంటుంది. బ్లూ బ్యాక్‌లిట్ ఎల్‌ఈడీ నీప్‌తో కూడిన ఈ స్మార్ట్ కంట్రోలర్ సీటు మరియు పెట్రోల్ ట్యాంక్ మూతను తెరిచి లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.

ఈ హోండా మ్యాక్సీ స్కూటర్‌లో స్మార్ట్ కీ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు యుఎస్‌బి ఛార్జింగ్ సాకెట్స్ కలిగి ఉంటుంది. హై టెక్నాలజీ కార్లలో వున్న వెల్ కం లైట్లను ఈ హోండా మ్యాక్సీ స్కూటర్ కలిగి ఉంటుంది.

హోండా పిసిఎక్స్ స్కూటర్ 149 సిసి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 13.3 బిహెచ్‌పి శక్తిని మరియు 14 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ సివిటి గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ మిషన్ ద్వారా పనిచేస్తుంది.

కొత్త హోండా పిసిఎక్స్ 150 స్కూటర్ త్వరలో దక్షిణ ఆసియాలో విడుదల కానుంది. భారతదేశంలో స్కూటర్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ విభాగంలో ఉన్న ఇతర కంపెనీ స్కూటర్లను దేశీయ మార్కెట్లో ప్రారంభించిన తర్వాత ఈ ఉత్పత్తి ధర నిర్ణయించబడే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








