హోండా నుండి రానున్న కొత్త సిబి250 మోటార్‌సైకిల్; పేటెంట్ వివరాలు లీక్

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా, భారత మార్కెట్ కోసం ఓ కొత్త ప్లాన్‌ను సిద్ధం చేసుకుంది. భారత 250సీసీ మోటార్‌సైకిల్ విభాగంలో ఓ కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ విభాగంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది.

హోండా నుండి రానున్న కొత్త సిబి250 మోటార్‌సైకిల్; పేటెంట్ వివరాలు లీక్

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ గతంలో విడుదల చేసిన సిబి 350 బైక్‌కు దిగువన ఓ కొత్త 250సీసీ బైక్‌ను సిబి బ్యాడ్జింగ్‌తో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. మార్కెట్లో హోండా సిబి 350 ఈ మోడల్‌కు వినియోగదారుల నుండి మంచి స్పందన లభించింది.

హోండా నుండి రానున్న కొత్త సిబి250 మోటార్‌సైకిల్; పేటెంట్ వివరాలు లీక్

ఈ నేపథ్యంలో కొత్త సిబి 250 మోటార్‌సైకిల్‌కు కూడా అదే తరహాలో స్పందన లభించగలదని కంపెనీ ధీమాగా ఉంది. హోండా సిబి 250 బైక్‌కి సంబంధించిన పేటెంట్ చిత్రాలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ చిత్రంలో చూసినట్లుగా కొత్త హోండా సిబి 250 చూడటానికి సిబి 300 ఆర్ మాదిరిగా అనిపిస్తుంది.

హోండా నుండి రానున్న కొత్త సిబి250 మోటార్‌సైకిల్; పేటెంట్ వివరాలు లీక్

అయితే, ఇందులో ఉపయోగించబోయే పరికరాలు చాలావరకు సిబి 400 ఎస్ఎఫ్ మోడల్ మాదిరిగా ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఫ్రేమ్ మరియు బాడీ భాగాలను ఈ మోడల్ నుండి గ్రహించే ఆస్కారం ఉంది. ఇందులో ట్రెడిషనల్ డబుల్ క్రాడల్ టైప్ ఫ్రేమ్ మరియు స్వింగార్మ్‌లను ఉపయోగించవచ్చని అంచనా.

హోండా నుండి రానున్న కొత్త సిబి250 మోటార్‌సైకిల్; పేటెంట్ వివరాలు లీక్

ఈ మోటార్‌సైకిల్ సస్పెన్షన్ విషయంలో కూడా కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోనుంది. ప్రత్యేకించి వెనుక సస్పెన్షన్ సెటప్‌లో నేరుగా స్వింగార్మ్‌తో అనుసంధానించబడిన మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ముందు వైపు ట్రెడిషనల్ ఫ్రంట్ ఫోర్కులు లభ్యం కానున్నట్లు తెలుస్తోంది.

హోండా నుండి రానున్న కొత్త సిబి250 మోటార్‌సైకిల్; పేటెంట్ వివరాలు లీక్

ఈ మోటార్‌సైకిల్‌‌లోని కీలక భాగాలను ఫ్రేమ్‌పై ఇంజన్‌కు దిగువన అమర్చబడి ఉంటాయి, ఇది ఇప్పుడు హోండా యొక్క ఆధునిక బైక్‌లలో ఒక సాధారణమైన విషయంగానే చెప్పుకోవచ్చు. ఇక ఇందులోని సీట్, వీల్స్ మరియు రియర్ డిజైన్ వంటి మిగిలిన పరికరాలను సిబి400ఎస్ఎఫ్ మోడల్ నుండి గ్రహించబడుతాయి.

హోండా నుండి రానున్న కొత్త సిబి250 మోటార్‌సైకిల్; పేటెంట్ వివరాలు లీక్

ప్రస్తుతానికి హోండా 250సీసీ బైక్ ఇంకా ప్రారంభ స్థితిలోనే ఉన్నందున, దీనికి సంబంధించిన సమాచారం చాలా పరిమితంగా ఉంది. అయితే, ఈ బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు మాత్రం చాలా ముమ్మరంగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీని రియల్ కాన్సెప్ట్ స్కెచ్‌లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

హోండా నుండి రానున్న కొత్త సిబి250 మోటార్‌సైకిల్; పేటెంట్ వివరాలు లీక్

హోండా తమ మొదటి తరం సిబి 250 మోటార్‌సైకిల్‌ను 1970 కాలంలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 1992లో ఇందులో ఓ కొత్త తరం మోడల్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత 2003లో సిబిఎఫ్250 పేరుతో అధునాతన మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో దీని శక్తి మరియు టార్క్ సాధారణంగానే ఉన్నప్పటికీ, ఈ బైక్‌పై అప్పట్లో ఎటువంటి ఫిర్యాదులు రాలేదు.

హోండా నుండి రానున్న కొత్త సిబి250 మోటార్‌సైకిల్; పేటెంట్ వివరాలు లీక్

ఆ తర్వాతి కాలంలో హోండా సిబిఎఫ్250 ఓ ఐకానిక్ మిడిల్‌వెయిట్ క్లాసిక్ మోటార్‌సైకిల్‌గా మారింది. ప్రస్తుతం హోండా సిబి సిరీస్‌లో 125ఆర్ నుండి మొదలుకొని 1000ఆర్ఆర్ వరకూ విభిన్న రకాల మోడళ్లను అందిస్తోంది.

హోండా నుండి రానున్న కొత్త సిబి250 మోటార్‌సైకిల్; పేటెంట్ వివరాలు లీక్

ప్రస్తుతం, హోండా అందిస్తున్న కొత్త బిఎస్6 కంప్లైంట్ సిబి350 మోడల్‌ను హోండా యొక్క ప్రీమియం డీలర్‌షిప్ కేంద్రాలయిన బిగ్‌వింగ్ అవుట్‌లెట్ల ద్వారా మాత్రమే విక్రయిస్తున్నారు. కాగా, కొత్త సిబి250 మోడల్ ధరను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ దీనిని స్థానికంగానే ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.

Article Published On: Tuesday, December 15, 2020, 13:24 [IST]
English summary
Honda Plans To Launch New 250cc Bike In India, Details Revealed. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+