రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం కోసం కర్ణాటక పోలీసులకు మోటార్ సైకిళ్లను అందించనున్న హోండా!

ఇండియాలో ప్రసిద్ధి చెందిన సంస్థలలో హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి. హోండా సంస్థ ఇప్పటికే పలు ప్రాంతాలలో సేవా కార్యక్రామాలు జరిపి తమ సేవాదృక్పధాన్ని చాటుకుంటోంది. ఇప్పుడు కర్ణాటక పోలీసులకు రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం కోసం హోండా మోటార్ సైకిళ్లను అందించాలని సంకల్పించింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం కోసం కర్ణాటక పోలీసులకు మోటార్ సైకిళ్లను అందించనున్న హోండా!

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కర్ణాటకలో పోలీసుల సహకారంతో రహదారి భద్రతా కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రాణాలను రక్షించే ఉద్దేశ్యంతో ప్రమాద బాధితులకు సత్వర సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుని ఈ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా కర్ణాటక పోలీస్ ఫోర్స్ కి అనుకూలమైన మోటార్ సైకిల్స్ ని అందిచాలని నిర్ణయించుకుంది. పోలీసులకు అనుకూలంగా ఈ మోటార్ సైకిల్స్ ని తయారు చేయనుంది.

రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం కోసం కర్ణాటక పోలీసులకు మోటార్ సైకిళ్లను అందించనున్న హోండా!

పోలీసులకు అనుగుణంగా తయారు చేసే మోటార్ సైకిల్స్ రివాల్వింగ్ ఫ్లాషర్స్ & బ్లింకర్స్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, సైరన్లు, ఫ్లాష్ లైట్లు, సేఫ్టీ హెల్మెట్లు, విండ్‌స్క్రీన్ మరియు క్రూయిజర్ సైడ్ బాక్స్‌ వంటి ఫీచర్స్ ని కలిగి ఉంటాయి.

రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం కోసం కర్ణాటక పోలీసులకు మోటార్ సైకిళ్లను అందించనున్న హోండా!

ఈ కార్యక్రమంలో సెంట్రల్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మిస్టర్ కె వి శరత్ చంద్ర, జనరల్ & కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ హెచ్ఎంఎస్ఐ డైరెక్టర్ హర్భజన్ సింగ్ మరియు హెచ్ఎంఎస్ఐ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ హిరోకి చుబాచి పాల్గొన్నారు.

రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం కోసం కర్ణాటక పోలీసులకు మోటార్ సైకిళ్లను అందించనున్న హోండా!

ఈ కార్యక్రమంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ హోండా సంస్థ బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా సమాజంలో సానుకూల మార్పులు తీసుకు రావడానికి ప్రయత్నిస్తుంది. కర్ణాటక మనకు కర్మ భూమి ఇక్కడి ప్రజలతో మాకు ఒక ప్రత్యేకమైన సంభందం ఉంది. కాబట్టి ఇక్కడి సమాజం యొక్క అభివృద్ధికి హోండా కట్టుబడి ఉంది. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అన్నారు.

రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం కోసం కర్ణాటక పోలీసులకు మోటార్ సైకిళ్లను అందించనున్న హోండా!

హోండా కంపెనీ ఇప్పటికే పలు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు చేపట్టింది. మహారాష్ట్ర, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మరియు గుజరాత్ వంటి రాష్ట్రాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించింది. హోండా ఎల్లప్పుడూ ప్రజల భద్రతకు మొదటి స్థానం కల్పిస్తుంది. విద్య, రహదారి భద్రతలతో ప్రజలకు మరిన్ని సేవాకార్యక్రమాలను చేయాలని భావిస్తోంది.

రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం కోసం కర్ణాటక పోలీసులకు మోటార్ సైకిళ్లను అందించనున్న హోండా!

హోండా సంస్థ సామాజిక కార్యక్రమాలలో భాగంగా ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, విద్య, రహదారి భద్రత, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ క్రీడలు వంటి ఇతర రంగాలలో చాలా సేవ చేసింది.హోండా యొక్క ఆరోగ్య అభియాన్ ప్రాజెక్ట్ లో భాగంగా కోలార్ జిల్లాలోని 49 గ్రామాల నుండి 50,000 మందికి ఈ అవకాశాన్ని కల్పించింది. ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ, కంటిశుక్లం ఆపరేషన్లు, గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు & మందులు, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాలు మరియు వికలాంగులకు సహాయక వ్యవస్థల్లో హోండా చురుకుగా పాల్గొంటుంది.

రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం కోసం కర్ణాటక పోలీసులకు మోటార్ సైకిళ్లను అందించనున్న హోండా!

సంస్థ యొక్క హరిత్ ఉడాన్ ప్రాజెక్ట్ కోలార్ లోని 18 గ్రామాలకు చెందిన 39 కుటుంబాల జీవనోపాధికి తోడ్పడే 23,000 పండ్ల చెట్లను నాటారు. హోండాకు చెందిన శిక్ష ఇవామ్ కౌషల్ వికాస్ అభియాన్ ప్రభుత్వ పాఠశాలల 100 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు కొత్త కంప్యూటర్ ల్యాబ్‌లు, బ్లాక్‌బోర్డులు, పుస్తకాలు, ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం ద్వారా 21,000 మంది విద్యార్థులకు ప్రయోజనాన్ని చేకూర్చారు.

రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం కోసం కర్ణాటక పోలీసులకు మోటార్ సైకిళ్లను అందించనున్న హోండా!

కోలార్ లోని హోండా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కంపెనీ మరియు మైసూర్, మంగళూరులోని రెండు హోండా స్కిల్ ఎన్‌హాన్స్‌మెంట్ సెంటర్స్ ద్వారా ఉద్యోగ ఆధారిత వృత్తి నైపుణ్య శిక్షణను కూడా అందిస్తున్నారు. అదేవిధంగా హోండా వివిధ పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్‌లలో అన్ని వయసుల వారికి దాదాపు 75,000 మందికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించింది. ఇంకా కోలార్ వద్ద మల్టీపర్పస్ ఇండోర్ మరియు అవుట్డోర్ స్టేడియం మాలూర్ వద్ద ఒక ఇంకో మల్టీపర్పస్ స్టేడియంను కంపెనీ నిర్మించింది మరియు కోలార్ పట్టణంలో 1,100 ఎల్ఇడి వీధి దీపాలను ఏర్పాటు చేసింది.

రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం కోసం కర్ణాటక పోలీసులకు మోటార్ సైకిళ్లను అందించనున్న హోండా!

హోండా చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలలో భాగంగానే కర్ణాటక పోలీసులకు అనుకూలమైన వాహనాలను త్వరలో అందివ్వనున్నారు.

Most Read Articles

English summary
Honda Provides Motorcycles To Karnataka Police For Road Safety Program:Details. Read in Telugu
Story first published: Saturday, January 11, 2020, 15:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X