సరికొత్త హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్ టీజర్ విడుదల, వివరాలు

'హోండా మోటార్‌సైకిల్ స్కూటర్ ఇండియా' తమ సరికొత్త బిఎస్6 వెర్షన్ 'గ్రాజియా' స్కూటర్‌కి సంబంధించి ఓ కొత్త టీజర్ వీడియోని రిలీజ్ చేసింది. ఈ కొత్త 2020 హోండా గ్రాజియా స్కూటర్‌లో బిఎస్6 వెర్షన్ ఇంజన్ అప్‌గ్రేడ్‌‌తో పాటుగా డిజైన్, ఫీచర్ల పరంగా కూడా మార్పులు చేర్పులు ఉండనున్నాయి.

సరికొత్త హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్ టీజర్ విడుదల, వివరాలు

హోండా తమ గ్రాజియా స్కూటర్ టీజర్ వీడియోని చూస్తుంటే మరికొద్ది రోజుల్లోనే ఈ మోడల్ మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. సరికొత్త ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ డిజైన్‌ను ఈ టీజర్‌లో చూడొచ్చు.

సరికొత్త హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్ టీజర్ విడుదల, వివరాలు

ఇంజన్ పరంగా హోండా గ్రాజియా స్కూటర్‌లో ఇదివరకటి 125సీసీ ఇంజన్‌నే ఉపయోగించారు. కాకపోతే, ఈ ఇంజన్‌ను బిఎస్6 కాలుష్య నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ అప్‌గ్రేడ్ కారణంగా ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఫిగర్స్ కొద్దిగా మారే అవకాశం ఉంది. బిఎస్4 స్కూటర్‌లోని ఇంజన్ 8.5 బిహెచ్‌పి పవర్‌ని, 10.5 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. బిఎస్6 ఇంజన్ పవర్, టార్క్ వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ: మహీంద్రా సుప్రో అంబులెన్స్ : ధర & ఇతర వివరాలు

సరికొత్త హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్ టీజర్ విడుదల, వివరాలు

ఈ టీజర్ వీడియోలో హోండా 'A Quiet Revolution' మరో కొత్త విషయాన్ని కూడా ప్రస్తావించింది. దీన్ని బట్టి చూస్తుంటే హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్ ఈ బ్రాండ్‌కి చెందిన ఏసిజి స్టార్టర్ లేదా సైలెంట్ ఎలక్ట్రిక్ స్టార్ట్ టెక్నాలజీ ఇందులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాంకేతికత వలన ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు క్రాంకింగ్ సౌండ్ రాకపోవచ్చు.

సరికొత్త హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్ టీజర్ విడుదల, వివరాలు

కొత్త 2020 హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్‌లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని కూడా పూర్తిగా డిజిటలైజ్ చేశారు. ఈ క్లస్టర్‌ను రెండు ఎల్‌సిడి ప్యానెళ్లుగా విభజించారు. టీజర్‌ను గమనిస్తే, టైమ్ క్లాక్, రేంజ్ టూ ఎంప్టీ, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి వివరాలను ఈ క్లస్టర్స్ తెలియజేస్తాయి. ఇంజన్, పవర్, ఎకో వంటి వాటి కోసం ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

MOST READ: మీకు తెలుసా.. ఈ కారు, బైక్ కంటే చాలా చీప్

సరికొత్త హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్ టీజర్ విడుదల, వివరాలు

హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్‌లోని ప్రీమియం ఫీచర్లను చూస్తుంటే, ఇదివరకు మార్కెట్లో లభ్యమైన బిఎస్4 వెర్షన్ ధర కన్నా ఈ కొత్త బిఎస్6 వెర్షన్ ధర మరింత ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. బిఎస్4 వెర్షన్ బైక్ ఇది వరకు రూ.61,561 (ఎక్స్-షోరూమ్) ధరకు అమ్ముడయ్యేది.

సరికొత్త హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్ టీజర్ విడుదల, వివరాలు

హోండా ఇటీవలే తమ గ్రాజియా స్కూటర్‌ని అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించి వేసింది. బిఎస్4 వాహనాలను బిఎస్6కి అప్‌గ్రేడ్ చేయాల్సింది సర్కారు ఆదేశాలు జారీ చేయటం, అందుకు ఏప్రిల్ నెల వరకూ గడువు విధించిన నేపథ్యంలో హోండా తమ అధికారిక వెబ్‌సైట్ నుంచి గ్రాజియా స్కూటర్‌ను తొలగించి వేసింది. ఆ తర్వాత హోండా ఫ్యాక్టరీలో ఈ మోడల్ ఉత్పత్తిని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.

MOST READ: సివిక్ డీజిల్ ఎడిషన్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన హోండా, డెలివరీస్ ఎప్పుడంటే?

హోండాకి సంబంధించిన ఇతర వార్తల్లోకి వెళితే.. మోటార్‌సైకిల్ బ్రాండ్ హోండా మోటార్ కంపెనీపై జపాన్‌లో సైబర్ అటాక్ జరిగింది. ఈ సైబర్ అటాక్ కారణంగా హోండా సర్వెర్లలో వైరస్ చొరబడి, ప్రొడక్షన్ ప్రక్రియలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్‌లోని హోండా మోటార్‌సైకిల్స్ మరియు స్కూటర్స్ ఇండియాపై కూడా ఈ ప్రభావం పడింది. ఈ సైబర్ అటాక్ కారణంగా, హోండా సంస్థకు చెందిన వివిధ దేశాల్లోని 11 ఇతర ప్లాంట్‌ల ఉత్పత్తిపై కూడా ప్రభావం పడింది.

సరికొత్త హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్ టీజర్ విడుదల, వివరాలు

హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హోండా విడుదల చేసిన టీజర్‌ని చూస్తుంటే సరికొత్త 2020 గ్రాజియా స్కూటర్ మరిన్ని ప్రీమియం ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీ, మోడ్రన్ డిజైన్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ కొత్త గ్రాజియా స్కూటర్ ప్రీమియం 125సీసీ స్కూటర్ విభాగంలో నెంబర్ వన్ ఛాయిస్‌గా ఉండబోతోందని అనిపిస్తుంది.

Most Read Articles

English summary
Honda Motorcycle and Scooter India is about ready to launch the all-new BS6 compliant Grazia model in the Indian market. The company released a teaser video of the Honda Grazia BS6 model via its social media handles. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X