హోండా యునికార్న్, యాక్టివా 125, డియో ధరల పెంపు - వివరాలు

జనపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న బిఎస్6 యునికార్న్, యాక్టివా 125 మరియు డియో ధరలను పెంచింది. కాగా, బిఎస్6 అప్‌డేట్ తర్వాత డియో మరియు యాక్టివా 125 స్కూటర్ల ధరల పెరగడం ఇది రెండవసారి.

హోండా యునికార్న్, యాక్టివా 125, డియో ధరల పెంపు - వివరాలు

హోండా ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.93,593 ధరతో బిఎస్6 యునికార్న్‌ను విడుదల చేసింది , ఇది ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. తాజాగా ఈ మోడల్‌పై కంపెనీ రూ.955 మేర ధరను పెంచింది. తాజా ధర పెంపుతో ప్రస్తుతం మార్కెట్లో బిఎస్6 యునికార్న్ కొత్త ధర రూ.94,548గా ఉంది. ఈ మోడల్ విడుదల సమయంలో బిఎస్6 ధర దాని బిఎస్4 ధర కంటే రూ.13,000 అధికంగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

హోండా యునికార్న్, యాక్టివా 125, డియో ధరల పెంపు - వివరాలు

కొత్త 2020 హోండా యునికార్న్ బిఎస్6 మోటార్‌సైకిల్‌లో 162సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 12.7 బిహెచ్‌పి శక్తిని మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 14 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ హోండా యొక్క పిజిఎమ్-ఫై టెక్నాలజీతో పాటు హెచ్ఇటి (హోండా ఎకో టెక్నాలజీ)ని కలిగి ఉంటుంది.

MOST READ:సెక్యూరిటీ లేకుండా రోడ్ మీద బెంజ్ కారు డ్రైవ్ చేస్తున్న రతన్ టాటా [వీడియో]

హోండా యునికార్న్, యాక్టివా 125, డియో ధరల పెంపు - వివరాలు

ఇక హోండా యాక్టివా 125 బిఎస్6 ధర పెంపు విషయానికి వస్తే, ఈ మోడల్‌లో బిఎస్6 అప్‌డేట్ చేసిన రెండవసారి ధర పెరిగింది. గడచిన సంవత్సరం చివర్లో హోండా తమ బిఎస్6 యాక్టివా 125 స్కూటర్‌ను రూ.67,490 ధరతో (ఎక్స్-షోరూమ్, ఇండియా) మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి సారిగా ఈ మోడల్ ధరలను పెంచారు.

హోండా యునికార్న్, యాక్టివా 125, డియో ధరల పెంపు - వివరాలు

తాజాగా ఈ స్కూటర్‌పై రూ.955 ధరను పెంచారు. ప్రస్తుతం యాక్టివా 125 స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి: యాక్టివా 125 బేస్ వేరియంట్ ధర రూ.68,997, డ్రమ్ బ్రేక్స్-అల్లాయ్ వీల్స్ వేరియంట్ ధర రూ.72,497, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ - అల్లాయ్ వీల్స్ వేరియంట్ ధర ర .75,997 లుగా ఉన్నాఇ (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

MOST READ:మీకు తెలుసా.. సచిన్ టెండూల్కర్ మొదటి కార్, ఇదే

హోండా యునికార్న్, యాక్టివా 125, డియో ధరల పెంపు - వివరాలు

కొత్త 2020 యాక్టివ్ 125 బిఎస్6 స్కూటర్‌లో అప్‌డేట్ చేసిన 124 సిసి సింగిల్ సిలిండర్ ఫ్యూయెల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8.4 బిహెచ్‌పి శక్తిని మరియు 10.54 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ హోండా యొక్క సైలెంట్ స్టార్ట్ మరియు ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్‌తో లభిస్తుంది.

హోండా యునికార్న్, యాక్టివా 125, డియో ధరల పెంపు - వివరాలు

హోండా ధరలు పెంచిన ఉత్పత్తుల జాబితాలో మూడవది హోండా డియో. ఈ ఏడాది ప్రారంభంలో హోండా సరికొత్త 2020 డియో బిఎస్6 స్కూటర్‌ను రూ.59,990 (బేస్ వేరియంట్) ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో, డిఎల్‌ఎక్స్ వేరియంట్ ధర రూ.63,340గా ఉండేది. స్కూటర్ విడుదల సమయంలో కంపెనీ దీని ధరను పెంచింది.

MOST READ:ల్యాండ్ రోవర్ ని కాపాడిన మహీంద్రా థార్, ఎలాగో వీడియో చూడండి

హోండా యునికార్న్, యాక్టివా 125, డియో ధరల పెంపు - వివరాలు

తాజాగా హోండా ఇప్పుడు ఈ మోడల్ ధరను రెండవ సారి పెంచింది. కొత్త ధరల ప్రకారం, హోండా డియో బిఎస్6 బేస్ వేరియంట్ ధర రూ.61,497 గాను మరియు డిఎల్‌ఎక్స్ వేరియంట్ ధర రూ.64,847 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) గానూ ఉన్నాయి.

హోండా యునికార్న్, యాక్టివా 125, డియో ధరల పెంపు - వివరాలు

హోండా డియో బిఎస్6 స్కూటర్‌లో 110సిసి బిఎస్6 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది హోండా పిజిఎమ్-ఎఫ్‌ఐ టెక్నాలజీతో పాటు ఈఎస్‌పి (ఎన్‌హాన్స్డ్ స్మార్ట్ పవర్) సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులోని 110 సిసి ఇంజన్ 8000 ఆర్‌పిఎమ్ వద్ద 7.6 బిహెచ్‌పి శక్తిని, 4750 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ హోండా యొక్క పేటెంట్ కలిగిన ఏసిజి సిస్టమ్‌తో లభిస్తుంది, దీని సాయంతో స్కూటర్‌ను సైలెంట్‌గా స్టార్ట్ చేసుకోవచ్చు.

MOST READ:భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త టైర్ తయారీ సంస్థ... గందరగోళంలో ఉన్న ఇతర సంస్థలు

హోండా యునికార్న్, యాక్టివా 125, డియో ధరల పెంపు - వివరాలు

యునికార్న్, యాక్టివా 125, డియో ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హోండా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న టూవీలర్లలో యునికార్న్, యాక్టివా 125 మరియు డియోలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా అద్భుతమైన కమ్యూటర్ వాహనాలు. ఈ మూడు మోడళ్లు కూడా ప్రత్యేకించి యువకులను దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడినవి. కాబట్టి ఈ ధరల పెరుగుదల కంపెనీ అమ్మకాలపై పెద్ద ప్రభావం చూపకపోవచ్చు.

Most Read Articles

English summary
Honda has increased the prices of the BS6 Unicorn, Activa 125 and the Dio. However, the Dio and the Activa 125 both get a hike for the second time this year after the BS6 update. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X