Just In
- 46 min ago
కొత్త హోండా వెజెల్ ఎస్యూవీ టీజర్ విడుదల
- 1 hr ago
సైనికుల కోసం బుల్లెట్ బైక్‌లనే మొబైల్ అంబులెన్స్‌లుగా మార్చేశారు..
- 2 hrs ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 3 hrs ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
Don't Miss
- News
అమరావతిపై జగన్ సర్కారుకు భారీ షాక్- ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులన్నీ కొట్టేసిన హైకోర్టు
- Movies
Box office: 5వ రోజు రెడ్, అల్లుడు అదుర్స్ కలెక్షన్స్.. రామ్ టార్గెట్ ఫినిష్.. ఇంకా పైకిరాని బెల్లంకొండ
- Sports
Brisbane Test: పంత్ హాఫ్ సెంచరీ.. విజయం దిశగా భారత్!! కొట్టాల్సింది 59 పరుగులే!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్ల భారీ జంప్, రిలయన్స్ రూ.2000 మార్క్ క్రాస్
- Lifestyle
మీరు వాడే షాంపూ మంచిది కాకపోతే మీ జుట్టు ఏమి సూచిస్తుంది, తప్పకుండా తెలుసుకోండి..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హోండా వెబ్సైట్ నుంచి మాయమైన సిబి300ఆర్ - కారణమేంటో తెలుసా?
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ ఎంట్రీ లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్ 'హోండా సిబి300ఆర్'ను తమ అధికారిక వెబ్సైట్ నుండి తొలగించి వేసింది. దీన్నిబట్టి చూస్తుంటే, ఇందులో త్వరలోనే ఓ కొత్త బిఎస్6 వెర్షన్ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌ను హోండా యొక్క బిగ్‌వింగ్ ప్రీమియం మోటార్‌సైకిల్ డీలర్‌షిప్‌ల క్రింద విక్రయించబడింది. భారత్‌లో దీని ధర రూ.2.41 లక్షలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉండేది.

హోండా సిబి300ఆర్ భారత మార్కెట్లో విడుదలైన మొట్టమొదటి నియో-రెట్రో స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్. దీనిని హోండా సికెడి (కంప్లీట్లీ నాక్ డౌన్) యూనిట్లుగా మొత్తం విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడి మార్కెట్లో అసెంబ్లింగ్ చేసేది. ఫలితంగా, ఇది దాని కాంపిటీటర్లతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ధరను కలిగి ఉండేది.

ఈ మోటార్‌సైకిల్ మార్కెట్లో విడుదలైన సమయంలో హోండాకు అద్భుతమైన స్పందన లభించింది, కేవలం రెండు నెలల్లోనే మొదటి 500 యూనిట్లను విక్రయించింది. కాగా.. హోండా ఇప్పటి వరకూ తమ సిబి300ఆర్ మోటార్‌సైకిల్‌ను ఇంకా బిఎస్6 ఇంజన్‌కు అప్‌గ్రేడ్ చేయలేదు. ఈ నేపథ్యంలో, ఈ మోడల్‌ను కంపెనీ తమ అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించింది.
MOST READ: ఒకే రోజు 11 జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన ఎంజి మోటార్స్

అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని దక్కించుకున్న హోండా సిబి300ఆర్ మోటార్‌సైకిల్‌లో కంపెనీ ఇప్పుడు బిఎస్6 వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మోడల్ విషయంలో భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి హోండా ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇక ఈ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, హోండా సిబి300ఆర్ ఓల్డ్-స్కూల్ స్టైల్లో గుండ్రటి హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంటుంది. వాస్తవానికి ఈ మోడల్‌కు ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటుంది. ఆధునిక ఎల్ఈడి టెక్నాలజీతో ఇది విభిన్న ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ మోడల్ అప్-రైట్ రైడర్ ఎర్గోనామిక్స్‌తో చాలా సరళమైన డిజైన్‌ను కలిగి ఉంది.
MOST READ: మార్చి 31 తర్వాత అమ్మిన బిఎస్ 4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?

మజిక్యులర్ లుకింగ్ ఫ్యూయెల్ ట్యాంక్ ఇందులో మరో అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ఇంకా ఇందులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యుఎస్డి ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్, పెద్ద సస్పెన్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.ల ఎగ్జాస్ట్ .

సిబి300ఆర్ బైక్‌ను డైమండ్ ఫ్రేమ్‌ను ఉపయోగించి తయారు చేశారు. ఇందులో 286సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 31.4 బిహెచ్పి మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ: త్వరలో అందుబాటులోకి రానున్న ఎగిరే కార్లు, చూసారా !

హోండా సిబి300ఆర్కు భారత మార్కెట్లో గట్టి పోటీ ఉంది. ఈ విభాగంలోని మహీంద్రా మోజో 300, బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్, టివిఎస్ అపాచీ 310ఆర్, బజాజ్ డొమినార్, యమహా ఆర్3 మరియు కెటిఎమ్ 390 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

ఇదివరకు వచ్చిన వార్తల ప్రకారం, హోండా తమ సిబి300ఆర్ మోటార్‌సైకిల్ ధరను అందుబాటులో ఉంచేందుకు గాను ఈ మోడల్‌ను పూర్తిగా భారత్‌లో అసెంబ్లింగ్ చేయాలని యోచిస్తోంది. అదే గనుక జరిగితే ఈ మోడల్ ధర భారీగా తగ్గి, కాంపిటీషన్‌ను తట్టుకునేందుకు సహకరిస్తుంది. ఫలితంగా ఈ మోడల్‌కు డిమాండ్ కూడా కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
MOST READ: సౌరవ్ గంగూలీ లగ్జరీ కార్స్, చూసారా..!

వీటితో పాటుగా, భారత టూవీలర్ మార్కెట్లోని ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో హోండా కొత్త మోడళ్లను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. హోండా మొత్తం నాలుగు ట్విన్ సిలిండర్ 500సీసీ మోటార్‌సైకిళ్లను దేశానికి తీసుకురానుంది. ఈ లైనప్‌లో సిఎమ్ఎక్స్500 రెబెర్ క్రూయిజర్, సిబి500ఎఫ్ నేకెడ్, సిబిఆర్500ఆర్ ఫెయిర్డ్ మరియు సిబి500ఎక్స్ అడ్వెంచర్-టూరర్ మోటార్‌సైకిళ్ళు ఉన్నాయి.

హోండా సిబి300ఆర్ మోటార్‌సైకిల్‌పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లోని 300సీసీ మోటార్‌సైకిల్ విభాగంలో హోండా సిబి300ఆర్ ఒక అద్భుతమైన మోడల్. కాకపోతే ఈ మోడల్ ఉపయోగించే విడిభాగాలను పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటం వలన దీని ధర కూడా అధికంగా ఉంది. అదే ఈ మోడల్‌ను స్థానికంగానే తయారు చేసినట్లయితే, దాదాపు సగం ధరకే ఇది లభించే అవకాశం ఉంది.