ఇటీవలే విడుదలైంది, అప్పుడే ధర పెరిగింది!

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎమ్ఎస్‌ఐ) గత నెలలో విడుదల చేసిన బిఎస్6 వెర్షన్ హోండా ఎక్స్-బ్లేడ్ ధరను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. విడదల సమయంలో భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.1.55 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉండేది.

ఇటీవలే విడుదలైంది, అప్పుడే ధర పెరిగింది!

అయితే, తాజాగా హోండా ఎక్స్-బ్లేడ్ ధరలను రూ.576 మేర పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. హోండా ఎక్స్-బ్లేడ్ మోటార్‌సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి - సింగిల్-డిస్క్ మరియు డబుల్ డిస్క్. ఈ రెండు వేరియంట్లు కూడా కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో లభిస్తుంది.

ఇటీవలే విడుదలైంది, అప్పుడే ధర పెరిగింది!

తాజాగా ధరల పెంపు తర్వాత ప్రస్తుతం మార్కెట్లో హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్6 కొత్త ధరలు ఇలా ఉన్నాయి. ఎక్స్-బ్లేడ్ సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,06,687 గాను మరియు డ్యూయెల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,10,968 గాను (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.

MOST READ:సెక్యూరిటీ లేకుండా రోడ్ మీద బెంజ్ కారు డ్రైవ్ చేస్తున్న రతన్ టాటా [వీడియో]

ఇటీవలే విడుదలైంది, అప్పుడే ధర పెరిగింది!

కొత్త 2020 హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్6 మోటార్‌సైకిల్ ఇప్పుడు కొత్త రిఫ్రెష్డ్ డిజైన్‌తో లభ్యం కానుంది. ఇది మునుపటి కంటే మరింత మోడ్రన్‌గా, స్పోర్టీగా కనిపిస్తుంది. ఇందులో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్ యూనిట్, ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్, ఆకర్షనీయమైన ఇంధన ట్యాంక్, రీడిజైన్ చేయబడిన ఎగ్జాస్ట్, స్టైలిష్ బాడీ గ్రాఫిక్స్, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, స్ప్లిట్ గ్రాబ్ రెయిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇటీవలే విడుదలైంది, అప్పుడే ధర పెరిగింది!

ఇంజన్ పరంగా, ఎక్స్-బ్లేడ్ బిఎస్6లో ఇదివరకటి 160సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌నే కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించారు. ఈ ఇంజన్ 8000 ఆర్‌పిఎమ్ వద్ద 13.67 బిహెచ్‌పి శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 14.7 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. సచిన్ టెండూల్కర్ మొదటి కార్, ఇదే

ఇటీవలే విడుదలైంది, అప్పుడే ధర పెరిగింది!

ఇందులోని కొత్త బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ హోండా బ్రాండ్ యొక్క ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ టెక్నాలజీలో భాగంగా మెరుగైన పనితీరు మరియు సామర్థ్యం కోసం ఇంజన్‌లో మెరుగైన ఎయిర్-ఫ్యూయెల్ కలయిక ఉండేలా ఇందులో 8 ఆన్బోర్డ్ సెన్సార్లు ఉంటాయని కంపెనీ పేర్కొంది.

ఇటీవలే విడుదలైంది, అప్పుడే ధర పెరిగింది!

కొత్త ఎక్స్-బ్లేడ్‌లోని సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్‌ ఉంటుంది. అలాగే, ముందు భాగంలో 276 మిమీ డిస్క్ మరియు డ్యూయెల్ డిస్క్ వేరియంట్ కోసం కోసం 220 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో సింగిల్-డిస్క్ వేరియంట్ కోసం 130 మిమీ డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఇందులో సింగిల్-ఛానల్ ఏబిఎస్ స్టాండర్డ్‌గా లభిస్తుంది.

MOST READ:ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉపయోగించనున్న కొత్త కార్స్ : ఫోర్స్ ట్రాక్స్ టైఫూన్

ఇటీవలే విడుదలైంది, అప్పుడే ధర పెరిగింది!

హోండా ఎక్స్-బ్లేడ్ మోటార్‌సైకిల్ ధర పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్6 దాని మునుపటి వెర్షన్ కంటే మరింత ఆధునికంగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఈ మోడల్ మొత్తం ధరతో పోల్చుకుంటే, పెరిగిన ధరలు స్వల్పమే కాబట్టి, ఇది దీని అమ్మకాలపై పెద్ద ప్రభావం చూపకపోవచ్చని తెలుస్తోంది. ఇది ఈ విభాగంలో హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, టివిఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి, సుజుకి జిక్సెర్ 155 మరియు బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Honda Motorcycles & Scooter India (HMSI) launched the BS6 X-Blade in the Indian market last month at a starting price of Rs 1.05 lakh, ex-showroom (Delhi). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X