జావా పెరాక్ మోటార్‌సైకిల్ కొత్త టీజర్ విడుదల, త్వరలో డెలివరీలు!

గత 2018లో భారత మార్కెట్లో రీఎంట్రీ ఇచ్చిన ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ 'జావా మోటార్‌సైకిల్స్' ఇప్పటి వరకూ దేశీయ విపణిలో మూడు మోటార్‌సైకిళ్లను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ తాజాగా ఆఫర్ చేస్తున్న జావా పెరాక్ బాబర్ స్టైల్ మోటార్‌సైకిల్ కోసం కంపెనీ ఓ కొత్త టీజర్ వీడియోని విడుదల చేసింది.

జావా పెరాక్ మోటార్‌సైకిల్ కొత్త టీజర్ విడుదల, త్వరలో డెలివరీలు!

గడచిన నవంబర్ 2019లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన జావా పెరాక్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ రూ.1.94 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) విడుదల చేసింది. అయితే, ఈ మోటార్‌సైకిల్ డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదు. బ్రాండ్ చరిత్రను మరియు పెరాక్ మోటారుసైకిల్ ఫోటోతో ముగుస్తున్న ప్రయాణాన్ని ప్రదర్శించే ఓ కొత్త టీజర్ వీడియోను జావా ఇటీవల విడుదల చేసింది.

జావా పెరాక్ మోటార్‌సైకిల్ కొత్త టీజర్ విడుదల, త్వరలో డెలివరీలు!

జావా పెరాక్ డెలివరీల ప్రారంభం గురించి కంపెనీ అధికారికంగా ఏమీ ప్రస్తావించనప్పటికీ, దాని గురించి ఈ టీజర్ వీడియోలో హింట్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇది ఈ మోడల్ డెలివరీల ప్రారంభం గురించి టీజ్ చేసినట్లుగా ఉంటుంది.

MOST READ:టాటా సుమో గురించి మీకు తెలియని కొన్ని నిజాలు !

జావా పెరాక్ మోటార్‌సైకిల్ కొత్త టీజర్ విడుదల, త్వరలో డెలివరీలు!

ఈ టీజర్ వీడియో అంతటా, ఏడు సంఖ్యను కలిగి ఉన్న ఫిల్లర్ క్యాప్‌తో కూడిన మోటారుసైకిల్ ఫ్యూయెల్ ట్యాంక్‌ను గమనించవచ్చు. అలాగే, ఇదే వీడియోలో మోటార్‌సైకిల్ సైడ్ కవర్‌లో ఉన్న 20వ సంఖ్యను కూడా గమనించవచ్చు. ఈ రెండింటినీ కలిపి చూస్తే, జులై 20వ తేదీన ఈ మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.

జావా పెరాక్ మోటార్‌సైకిల్ కొత్త టీజర్ విడుదల, త్వరలో డెలివరీలు!

జావా పెరాక్ మోటారుసైకిల్ కోసం కంపెనీ గడచిన జనవరి 2020లో ఓ ఎస్టిమేటర్‌ను విడుదల చేసింది. ఈ ఎస్టిమేటర్ సాయంతో కస్టమర్లు పెరాక్ మోడల్ డెలివరీకి సంబంధించిన అంచనా సయమాన్ని తెలుసుకునే వెసలుబాటు ఉండేది. కానీ, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ బాబర్ స్టైల్ మోటార్‌సైకిల్ డెలివరీలు షెడ్యూల్ కన్నా ఎక్కువ ఆలస్యం అయింది.

MOST READ:వావ్ అమేజింగ్ : ఇది రెండు చక్రాలపై నడిచే ట్రాక్టర్..!

జావా పెరాక్ మోటార్‌సైకిల్ కొత్త టీజర్ విడుదల, త్వరలో డెలివరీలు!

ఇకపోతే జావా పెరాక్ మోటారుసైకిల్ విషయానికి వస్తే, ఇది బ్రాండ్ యొక్క ప్రధానమైన మోడల్. ఇది చిన్న మరియు పరిణతి చెందిన ప్రేక్షకులను ఆకట్టుకునే రెట్రో రూపంతో బాబర్ స్టైల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని 334సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ డిహెచ్‌సి ఇంజన్ 30 బిహెచ్‌పి శక్తిని మరియు 31 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

జావా పెరాక్ మోటార్‌సైకిల్ కొత్త టీజర్ విడుదల, త్వరలో డెలివరీలు!

ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. జావా బ్రాండ్ లైనప్‌లోని ఇతర మోడళ్లయిన జావా 300 మరియు జావా ఫోర్టీ-టూ లతో పోలిస్తే, పెరాక్‌లోని ఇంజన్ 41సీసీ అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా ఇది పై రెండు మోడళ్ల కన్నా ఎక్కువగా 3 బిహెచ్‌పి శక్తిని మరియు 3 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:గుంటలో పడిన కారును బయటకు తీసిన ఏనుగు [వీడియో]

జావా పెరాక్ ఇతర ముఖ్య ఫీచర్లను గమనిస్తే, ఇందులో పొడగించిన స్వింగ్ఆర్మ్, రైడర్ కోసం ఒకే సీటు, టియర్‌డ్రాప్ ఆకారంలో ఉండే 14 లీటర్ల ఇంధన ట్యాంక్, డ్యూయెల్ ఎగ్జాస్ట్, టర్న్ ఇండికేటర్లతో కూడిన లో సెట్ టెయిల్ ల్యాంప్స్, గుండ్రటి ఆకారంలో హెడ్‌ల్యాంప్, బార్-ఎండ్ మిర్రర్స్, సింగిల్-పాడ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి.

జావా పెరాక్ మోటార్‌సైకిల్ కొత్త టీజర్ విడుదల, త్వరలో డెలివరీలు!

పెరాక్‌లోని సస్పెన్షన్ సెటప్‌ను గమనిస్తే, ముందు భాగంలో ఫోర్క్ కవర్లతో కూడిన టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో 7 రకాలుగా సర్దుబాటు చేయగల మోనో-షాక్ సస్పెన్షన్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ఇరువైపులా డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ముందు వైపు 280 మిమీ డిస్క్, వెనుక వైపు 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఇవి డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

MOST READ:హీరో బైక్ డ్రైవ్ చేసిన గ్రేట్ ఖలీ [వీడియో]

జావా పెరాక్ మోటార్‌సైకిల్ కొత్త టీజర్ విడుదల, త్వరలో డెలివరీలు!

జావా పెరాక్ టీజర్ వీడియోపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

జావా పెరాక్ ఒక బాబర్ స్టైల్ రెట్రో మోటార్‌సైకిల్, ఇది రోడ్లపై ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా సంక్షోభం కారణంగా ఈ మోటార్‌సైకిల్ మార్కెట్లోకి రావటం ఆలస్యమైంది. కానీ తాజా టీజర్‌ను చూస్తుంటే, పెరాక్ కస్టమర్లకు తాళాలను అప్పగించేందుకు జావా పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

Most Read Articles

Read more on: #jawa motorcycles
English summary
Jawa Perak Deliveries Expected To Begin Soon In India: New Teaser Released. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X