రాబోయే రెండు సీజన్లు మావే - మోటోజిపి కోసం హోండా కీలక ప్రకటన!

మోటోజిపి 2021 సీజన్ కోసం హోండా రేసింగ్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌సి) తమ రైడర్ లైనప్‌లో రెండు ప్రధాన ప్రకటనలు చేసింది. ఇందులో మొదటిది ప్రస్తుతం ఉన్న రైడర్ అలెక్స్ మార్క్వెజ్ ఒప్పందంలో మరో రెండు సంవత్సరాలు గడువు పొడిగింపు. ఇకపోతే, రెండవది పోల్ ఎస్పార్గారోను కొత్త రైడర్‌గా చేర్చుకోవటం.

మోటోజిపి కోసం హెచ్ఆర్‌సి కీలక ప్రకటన

అలెక్స్ మార్క్వెజ్‌తో ఒప్పందం పొడగింపు విషయానికి వస్తే, హెచ్ఆర్‌సి ఈ 24 ఏళ్ల మాజీ మోటో2 వరల్డ్ ఛాంపియన్‌తో తమ రేసింగ్ బృందం మరో రెండేళ్ల పాట ఒప్పందాన్ని పొడగిస్తున్నట్లు తెలిపింది. అలెక్స్ 2020 సీజన్‌ను పూర్తిచేస్తూ, తన సోదరుడు మరియు ఎనిమిది సార్లు మోటోజిపి ప్రపంచ ఛాంపియన్ అయిన మార్క్ మార్క్వెజ్‌తో కలిసి, 2021 మరియు 2022 మోటోజిపి సీజన్ కోసం హోండా శాటిలైట్ టీమ్ - ఎల్‌సిఆర్ హోండా తరఫున పోటీ చేయనున్నారు.

అలెక్స్ మార్క్వెజ్ కాంట్రాక్ట్ పొడిగింపు గురించి మాట్లాడుతూ, "హోండా రేసింగ్ కార్పొరేషన్‌తో నా పునరుద్ధరణను ప్రకటించినందుకు చాలా గర్వంగా ఉంది. హెచ్‌ఆర్‌సి నాకు మోటోజిపికి వచ్చే అవకాశాన్ని ఇచ్చింది మరియు 2020 చివర్లో ఎల్‌సిఆర్ హోండా బృందంలో చేరడం ఆనందంగా ఉంది. మోటోజిపిలో గొప్ప అనుభవం పెద్ద జట్టులో పోటీపడటం సంతోషంగా ఉంద"ని అన్నారు.

"హోండా కుటుంబంలో కొనసాగడానికి నాపై నమ్మకం ఉంచినందుకు గాను నేను హెచ్‌ఆర్‌సి మరియు ఎల్‌సిఆర్ హోండా బృందాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంచి ఫలితాలతో వారి విశ్వాసాన్ని నిరూపించడానికి నేను కృషి చేస్తాను. ఇప్పుడు, నేను జెరెజ్‌లో సీజన్‌ను ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నాను మరియు ఈ సంవత్సరం నా బెస్ట్ ఇవ్వడానికి నేను పూర్తిగా దృష్టి సారించాను" అని అలెక్స్ చెప్పారు.

హోండా రేసింగ్ కార్పోరేషన్ (హెచ్‌ఆర్‌సి) ప్రెసిడెంట్ యోషిషిగే నోమురా మాట్లాడుతూ "రాబోయే రెండు సీజన్లలో మోటోజిపి విభాగంలో అభ్యాస ప్రక్రియ ద్వారా అలెక్స్ మార్క్వెజ్‌తో కలిసి పనిచేయడానికి హెచ్‌ఆర్‌సి సంతోషంగా ఉంది. లోతైన పరిశీలన మరియు ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర విశ్లేషణ తరువాత, ఎల్‌సిఆర్ హోండా టీమ్ లోపల పూర్తి ఫ్యాక్టరీ సహకారంతో ప్రీమియర్ క్లాస్‌లో ఎదగడానికి అలెక్స్‌కు గొప్ప అవకాశం ఉందని మేము నమ్ముతున్నాము. రాబోయే మూడు సీజన్లలో ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారా, హెచ్‌ఆర్‌సి మరియు అలెక్స్ ఇద్దరూ వెతుకుతున్న ఫలితాలను మేము సాధిస్తామని మేము నమ్ముతున్నామ"ని అన్నారు.

హెచ్ఆర్‌సి స్టేబుల్ నుండి వచ్చిన మరో వార్త ఏమిటంటే, 2021 సీజన్ కోసం పోల్ ఎస్పర్గారో అనే కొత్త రైడర్‌ను జట్టులో చేర్చుకోవటం. ఆర్‌సి213విపై స్వారీ చేసే ఈ ప్రస్తుత కెటిఎమ్ రైడర్, రెప్సోల్ హోండా జట్టులో ఎనిమిది సార్లు ప్రపంచ ఛాంపియన్ మార్క్ మార్క్వెజ్‌తో మరో రెండేళ్ల పాటు కలిసి పని చేయనున్నాడు.

ప్రస్తుత మోటోజిపి గ్రిడ్‌లో అత్యంత అనుభవజ్ఞులైన రైడర్‌లలో పోల్ ఎస్పర్గారో ఒకరు. 104 ప్రీమియర్-క్లాస్ గ్రాండ్ ప్రిక్స్‌లో పోటీ చేసిన పోల్ 2006 నుండి ఈ స్పోర్ట్‌లో ఛాంపియన్‌షిప్ కోసం పోరాడుతున్నాడు.

పాల్ ఎస్పార్గారో సంతకం, అలెక్స్ మార్క్వెజ్ కాంట్రాక్ట్ పొడగింపు విషయంలో హెచ్ఆర్‌సిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

అలెక్స్ మార్క్వెజ్‌ను రెప్సోల్ హోండా రేసింగ్ టీమ్ నుండి ఎల్‌సిఆర్ హోండాకు తరలించడాన్ని చూస్తుంటే, మోటోజిపిలో ఇంకా తన భవిష్యత్తు ఏంటో ధృవీకరించబడని మరియు ప్రస్తుతం ఈ స్థానంలో కొనసాగుతున్నటు వంటి కాల్ క్రచ్లో నిష్క్రమణను ఇది నిర్ధారిస్తుంది. అలెక్స్ మార్క్వెజ్ పొడిగింపు మరియు పోల్ ఎస్పర్గారోను చేర్చడంతో 2021 మోటోజిపి సీజన్ కోసం హెచ్‌ఆర్‌సి జాక్‌పాట్‌ను తాకినట్లుగా అనిపిస్తోంది.

Article Published On: Thursday, July 16, 2020, 11:12 [IST]
English summary
HRC Sign Pol Espargaro For 2021: Alex Marquez Moved To LCR Honda With 2-Year Contract Extension. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+