Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫిబ్రవరి నెలలో హస్క్ వర్నా బైక్స్ అమ్మకాలు ఎంతో తెలుసా.. ?
హస్క్ వర్నా మోటార్ సైకిల్స్ ఫిబ్రవరి 25 న స్వర్ట్‌పిలీన్ 250, విట్‌పిలీన్ 250 బైక్‌లను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో విడుదలైనప్పటినుంచి ఫిబ్రవరిలో ఎన్ని హస్క్ వర్నా బైక్‌లు అమ్ముడయ్యాయనే విషయాన్నీ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.. ?

బైక్ వాలే నివేదికల ప్రకారం హస్క్ వర్నా మోటార్ బైక్స్ దాదాపు 163 యూనిట్లు ఫిబ్రవరిలో అమ్ముడయ్యాయని తెలిపింది. హస్క్ వర్నా బైక్‌లను లాంచ్ చేయడానికి ఒక నెల ముందే బైక్‌లను ప్రీ-బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీని ఫలితంగా ఫిబ్రవరిలో 163 యూనిట్లు అమ్ముడయ్యాయి.

హస్క్ వర్నా స్వర్ట్‌పిలీన్ 250, విట్‌పిలీన్ 250 బైక్‌ల ధరలను గమనించినట్లయితే దాదాపు రూ. 1.80 లక్షలు (ఎక్స్ షోరూం). హస్క్ వెర్నా ఈ బైక్‌లను భారతదేశంలోని కెటిఎం షోరూమ్‌ల ద్వారా విక్రయిస్తుంది.

కరోనా వైరస్ కారణంగా ఈ బైకుల అమ్మకాలు ప్రస్తుతం ఆగిపోయాయి. రాబోయే నెలల్లో ఈ బైక్‌ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

కొత్తగా లాంచ్ అయినప్పటికీ ఈ బైక్‌లకు ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. హస్క్ వర్నా విట్‌పిలీన్ 250 మరియు స్వర్ట్‌పిలీన్ 250 బైక్ లలో 248.8 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 27 బిహెచ్పి శక్తి వద్ద 24 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్లలో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటాయి. విట్‌పిలీన్ 250 మరియు స్వర్ట్‌పిలీన్ 250 బైక్‌ల రూపకల్పన 401 బైక్‌ల మాదిరిగానే ఉంటుంది.

ఈ బైక్‌లోని చాలా ఉపకరణాలు కెటిఎమ్ డ్యూక్ 250 బైక్ నుండి తీసుకోబడ్డాయి. హస్క్ వర్నా దేశీయ మార్కెట్లో 250 సిసి బైక్ విభాగంలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. ఇది విజయవంతమవుతుందా లేదా అనేది రాబోయే నెలల్లో తెలుస్తుంది.

ఏది ఏమైనా ఇటీవల కాలంలో విడుదలైన హస్క్ వర్నా ఇండియన్ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందింది. ఇది చూడటానికి మంచి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా వాహనదారునికి మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.