స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 ధరలను ప్రకటించిన హస్క్ వర్నా

బజాజ్ ఆటో భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హస్క్ వర్నారెండు మోటార్ సైకిల్స్ యొక్క ధరలను ప్రకటించింది. హస్క్ వర్నా యొక్క ఆ రెండు వెహికల్స్ లో ఒకటి హస్క్ వర్నా స్వార్ట్‌పిలెన్ 250, రెండు హస్క్ వర్నా విట్‌పిలెన్ 250. ఈ వాహనాల యొక్క ప్రస్తుత ధర 1.80 లక్షల రూపాయలు (ఎక్స్‌షోరూమ్‌).

స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 ధరలను ప్రకటించిన హస్క్ వర్నా

హస్క్ వర్నా మోటారు సైకిళ్ల కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. పూణేకు చెందిన ఒక డీలర్ రూ. 5 వేల రూపాయలకు బుకింగ్స్ ప్రారంభించినట్లు ప్రకటించారు.

స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 ధరలను ప్రకటించిన హస్క్ వర్నా

సాధారణంగా హుస్క్ వర్నా మోటారు సైకిళ్లను గోవా ఇండియా బైక్ వీక్ 2019 లో ఆవిష్కరించారు. స్వీడన్ ప్రీమియం మోటారుసైకిల్ తయారీదారు అయిన హస్క్ వర్నా, కెటిఎమ్ గ్రూప్‌లో భాగంగా, బజాజ్ ఆటో ద్వారా భారతదేశానికి తీసుకువచ్చారు.

స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 ధరలను ప్రకటించిన హస్క్ వర్నా

ఈ హస్క్ వర్నా మోటారు సైకిళ్లను దేశవ్యాప్తంగా కేటీఎం షోరూమ్‌ల ద్వారా ప్రత్యేకంగా రిటైల్ చేయనున్నారు. ఈ మోటార్‌సైకిళ్లను మార్చిలో లాంచ్ చేయనున్నారు మరియు దేశంలోని 275 పట్టణాలలోని 400 కెటిఎం డీలర్ల వద్దకు వెళ్లనుంది.

స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 ధరలను ప్రకటించిన హస్క్ వర్నా

హస్క్ వర్నా స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250 ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ప్రీమియం విభాగాలలోని ఇతర మోటార్‌సైకిళ్ల నుండి ప్రత్యేకంగా కనిపించేటట్లు చేస్తాయి.

స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 ధరలను ప్రకటించిన హస్క్ వర్నా

స్వార్ట్‌పిలెన్ 250 మంచి డిజైన్‌ను కలిగి ఉంది. ఇది డబుల్ పర్పస్ టైర్లను కలిగి ఉంటుంది. ఇది ఎలాంటి రోడ్లలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా తయారు చేయబడింది. విట్‌పిలెన్ 250 మరింత స్పోర్టియర్ డిజైన్‌ను కలిగి ఉంది, హ్యాండిల్‌ బార్‌లపై క్లిప్‌ను కలిగి ఉంటుంది. ఇవి లీన్-ఇన్ రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది.

స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 ధరలను ప్రకటించిన హస్క్ వర్నా

హస్క్ వర్నా యొక్క రెండు మోటార్‌సైకిళ్లలో 248.76 సిసి ఫ్యూయల్-ఇంజెక్ట్, లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ని కలిగి ఉంటాయి. ఇది 29.5 బ్రేక్ హార్స్‌పవర్ మరియు 24 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 ధరలను ప్రకటించిన హస్క్ వర్నా

మోటారు సైకిళ్ళు ముందు భాగంలో డబ్ల్యుపి అపెక్స్ - యుఎస్డీ 43 మిమీ ఫోర్కులు మరియు వెనుక వైపు డబ్ల్యుపి అపెక్స్ మోనో-షాక్‌ని కలిగి ఉంటాయి. బ్రేకింగ్ విధులను గమనించినట్లైతే ముందు భాగంలో ఒకే 320 ఎంఎం డిస్క్ మరియు వెనుక భాగంలో 230 ఎంఎం డిస్క్ నిర్వహిస్తారు. డబుల్ ఛానల్ ఎబిఎన్ ఒక ప్రమాణంగా అందించబడుతుంది.

స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 ధరలను ప్రకటించిన హస్క్ వర్నా

స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250 బరువు కేవలం 154 కిలోగ్రాములు మరియు 153 కిలోగ్రాములు. అంటే కెటిఎం డ్యూక్ 250 కన్నా ఏడు కిలోగ్రాముల తక్కువ బరువును కలిగి ఉంటుంది. రెండు మోటార్‌సైకిళ్లను ప్రస్తుతం పరిచయ ధర 1.80 లక్షల రూపాయలకు (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) అందిస్తున్నారు.

స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 ధరలను ప్రకటించిన హస్క్ వర్నా

బజాజ్ ఆటో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ మాట్లాడుతూ, ప్రీమియం మోటార్ సైకిల్ విభాగం గత ఐదేళ్ళలో దాదాపు 19% కాంపౌండ్ అన్యువల్ గ్రోత్ రేట్ (CAGR) లో భారతదేశంలో బలమైన వృద్ధిని సాధించింది.

స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 ధరలను ప్రకటించిన హస్క్ వర్నా

హస్క్ వర్నా యొక్క రెండు మోటార్ సైకిల్స్ అద్భుతంగా రూపొందించబడ్డాయి. ఇది మంచి రైడింగ్ కోసం అభివృద్ధి చేయబడింది. మంచి పనితీరుని చూపించడమే కాకుండా మంచి డిజైన్ని కూడా కలిగి ఉంటాయి.

స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 ధరలను ప్రకటించిన హస్క్ వర్నా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

హస్క్ వర్నా కాంపాక్ట్ చట్రం డిజైన్, డబ్ల్యుపి సస్పెన్షన్ మరియు ప్రీమియం క్వాలిటీ భాగాలతో, ఈ రెండు మోటార్ సైకిల్స్ ఖచ్చితంగా డైనమిక్ పనితీరును మరియు గొప్ప రైడింగ్ సౌకర్యాన్ని అందిస్తాయని మేము భావిస్తున్నాము. హస్క్ వర్నామోటార్ సైకిల్స్ కి సంబంధించి పూర్తి సమాచారం త్వరలో మీ ముందుకు తీసుకు వస్తాము.

Most Read Articles

English summary
Husqvarna Svartpilen 250 & Vitpilen 250 Prices Announced At Rs 1.8 Lakh: Bookings Open At Rs 5,000. Read in Telugu.
Story first published: Tuesday, February 25, 2020, 17:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X