Just In
Don't Miss
- News
కృష్ణాబోర్డుపై జగన్‌కు షాకిచ్చిన కేసీఆర్- విశాఖకు తరలింపుపై అభ్యంతరం- బోర్డుకు లేఖ
- Movies
అఖిల్‌కు భారీ షాకిచ్చిన మోనాల్: తన అసలు లవర్ పేరు చెప్పి ఎమోషనల్.. మొత్తం రివీల్ చేసింది!
- Lifestyle
ప్రతి రాశిచక్రం వారి చింతలను ఎలా నిర్వహించాలో తెలుసా? భాదల నుండి ఇలా భయటపడాలి
- Sports
Brisbane Test: పాపం శుభమన్ గిల్.. తృటిలో సెంచరీ మిస్!!
- Finance
మారుతీ సుజుకీ కార్ల ధరల షాక్, కార్లపై రూ.34,000 వరకు పెంపు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నగరంలో వేలం వేయనున్న వాహనాల జాబితా విడుదల చేసిన హైదరాబాద్ పోలీసులు
సాధారణంగా పోలీసుల వాహనాలను సీజ్ చేసిన తర్వాత, వాటిని సంబంధిత వాహనదారు సొంతం చేసుకోకపోతే వాటిని కొంతకాలం తర్వాత వేలం వేస్తారన్న సంగతి అందరికి తెలిసిందే, ఇప్పుడు తెలంగాణ నగర పోలీసులు వాహనాలను వేలం వేయననున్నట్లు ప్రకటించారు.

నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించడం, ప్రజా నాయకుల రక్షణ మరియు ప్రజా సేవల్లో నిమగ్నమైన పోలీసులు ఇప్పుడు వాహనాలను వేలం వేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్‌లో తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో జరుగుతోంది.

హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్లలో మొత్తం 2,391 వాహనాలు ఉన్నాయి. ఇవన్నీ వృధాగా వదిలివేయబడ్డాయి, అంతే కాదు వీటికి సంబధించి యజమానులు కూడా వీటిని సరైన ఆధారాలను చూపించి సొంతం చేసుకోకపోవడంతో ఇవి అక్కడే వృధాగా పది ఉన్నాయి. ఈ వాహనాలన్నీ వృధాగా పది ఉండటం వల్ల వీటిలో కొన్నింటిని వేలం ద్వారా విక్రయించాలని హైదరాబాద్ పోలీసులు యోచిస్తున్నారు.
MOST READ:2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

మొదటి దశలో 175 వాహనాలను వేలం వేయాలని వారు యోచిస్తున్నారు. ప్రస్తుతం అమ్మకాలకు రిజర్వు చేయబడిన వాహనాల గురించి మొత్తం సమాచారాన్ని పోలీసులు వేలం ద్వారా విడుదల చేశారు.

2004 ఆర్ / డబ్ల్యు చట్టంలోని సెక్షన్ 40 ప్రకారం, నగరంలో యాజమాన్యాన్ని క్లెయిమ్ చేయకుండా వదిలివేసిన వాహనాన్ని వేలానికి పెట్టవచ్చు. దీనిని ఉపయోగించి హైదరాబాద్ నగర పోలీసులు లైసెన్స్ లేని వాహనాలను వేలం వేయాలని నిర్ణయించారు.

క్లెయిమ్ చేయని వాహనాలను మరియు వదిలివేయబడిన వాహనాల జాబితా www.hyderabadpolice.gov.in లో ప్రచురించబడింది. అంతే కాకుండా వాహనాల గురించి సమాచారాన్ని నగర పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో పోస్ట్ చేస్తారు.

ఇందులో వేలం వేయాల్సిన వాహనాల సంఖ్య, ఆర్టీఓ రిజిస్ట్రేషన్, చాసిస్ నెంబర్ వంటి వివిధ సమాచారం ఉంది. ఈ జాబితాలో ఎక్కువగా హోండా యాక్టివా, హీరో స్ప్లెండర్, ఫ్యాషన్ ప్రో, బజాజ్ డిస్కవర్, టివిఎస్ విగో, అపాచీ మరియు హోండా యునికార్న్ ఉన్నాయి.
MOST READ:ఇకపై వాహనాలకు ఈ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ లేకుంటే రూ. 5500 జరిమానా.. అదేంటో తెలుసా?

ఈ ద్విచక్ర వాహనాలు మాత్రమే కాకుండా ఈ జాబితాలో కొన్ని ఆటో రిక్షాలు కూడా చేర్చబడ్డాయి. ఈ వాహనాల్లో దేనినైనా దాని యజమాని క్లెయిమ్ చేయాలంటే, వాహనం యొక్క ఓనర్షిప్ యొక్క ప్రూఫ్ మరియు వాహనానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.

వాహనానికి సంబంధించిన యజమానులు వాహనానికి సంబంధించిన తగిన ఆధారాలు చూపించిన తర్వాత వాహనాన్ని అప్పగించడానికి చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఇది 6 నెలల గ్రేస్ పీరియడ్‌ను కూడా జారీ చేసింది. ఇక్కడ వృధాగా పది ఉన్న కాహళ వాహనాలు దుమ్ముపట్టడం మాత్రమే కాకుండా, చాలా త్రుప్పు కూడా పట్టాయి.
MOST READ:లంబోర్ఘినితో చేతులు కలిపిన అమెరికన్ సింగర్ లేడీ గాగా ; ఎందుకో తెలుసా ?

అనవసరంగా పడి వున్న వాహనాలు నిరుపయోగంగా ఉండటమే కాకుండా, ఇవి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకుంటాయి. అందుకే వీటిని తొలగించేందుకు హైదరాబాద్ పోలీసులు ఒక అడుగు ముందుకు వేశారు. హైదరాబాద్ నగరపోలీసులు వేలంలో వేయనున్న 175 వాహనాల జాబితా ఇప్పటికే విడుదల చేశారు. ఈ వాహనాల జాబితా మొదటి దశగా ప్రచురించబడింది.
Note: Images are representative purpose only.