ఇండియన్ మోటార్‌సైకిల్ కాంపిటీషన్: ఫ్రీ యూరప్ ట్రిప్!
అమెరికన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ 'ఇండియన్ మోటార్‌సైకిల్' ఓ కొత్త 'టెస్ట్-రైడ్' పోటీని ప్రకటించింది, ఇందులో పాల్గొనేవారికి 2021లో ఉచిత యూరప్ ప్రయాణ అవకాశాన్ని కల్పిస్తుంది.

ఇందుకు రైడర్లు చేయాల్సిందల్లా, సెప్టెంబర్ 30 లోపుగా సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌లో ఏదైనా ఇండియన్ మోటార్‌సైకిల్‌ను పరీక్షించడం (టెస్ట్ రైడ్ చేయటం) ద్వారా ఈ పోటీలోకి ప్రవేశించవచ్చు. ఇందులో పాల్గొనేవారు తమ సోషల్ మీడియాలో మోటార్‌సైకిల్‌తో తాము తీసుకున్న ఆసక్తికరమైన ఫొటోను పోస్ట్ చేసి సరైన ట్యాగ్‌లు మరియు హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించాలి.

ఇండియన్ మోటార్‌సైకిల్‌ను టెస్ట్ రైడ్ చేయటానికి కాంపిటీషన్‌లో పాల్గొనేవారు, వారు సందర్శించిన డీలర్‌షిప్‌ను ట్యాగ్ చేయాలి మరియు మోటార్‌సైకిల్‌తో వారు తీసుకున్న చిత్రాన్ని పోస్ట్ చేసేటప్పుడు #IndianTestRide అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించాలి. ఈ చిత్రాలను ఇండియన్ బ్రాండ్ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది మరియు సదరు పోస్టులకు సరైన ట్యాగ్‌లు మరియు హ్యాష్‌ట్యాగ్‌లు ఉన్నాయో లేదో తనిఖీ చేస్తుంది.

ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు టెస్ట్ రైడ్ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు రైడర్లకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత ఈ కాంపిటీషన్ నుండి నలుగురు విజేతలను ఎంపిక చేసుకొని, వారి జీవితకాలంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని అనుభూతిని అందించనుంది. రైడర్లు పోస్ట్ చేసే సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా, అది ఎంత సృజనాత్మకంగా ఉందో దానిపై విజేతలను ఎంపిక చేస్తారు.

ఇందులో గెలిచిన విజేతలకు ఇండియన్ మోటార్‌సైకిల్ యూరప్‌లోని ఒక గమ్యస్థానానికి ప్రయాణ ఖర్చులు (తిరిగి రావడంతో సహా), ఒక హోటల్‌లో నాలుగు రాత్రుల వసతి (పూర్తి బోర్డింగ్‌తో సహా), ఒక భారతీయ మోటారుసైకిల్ మరియు రెండు రోజుల ప్రయాణం కోసం టూర్ గైడ్‌ను అందిస్తుంది. అలాగే ఈ ఈవెంట్‌ను కవర్ చేయడానికి వీడియోగ్రాఫర్‌లు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లను కూడా ఏర్పాటు చేస్తుంది.

దీని అదనంగా, టెస్ట్ రైడ్ పూర్తి చేసిన రైడర్లు ఆటోమేటిక్‌గా #ఇండియన్ టెస్ట్ రైడ్ పోటీలో పాల్గొనేందుకు అర్హత పొందుతారు. అలాగే టెస్ట్ రైడ్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ‘ఇండియన్ మోటార్‌సైకిల్ టెస్ట్ రైడర్' కాఫీ కప్పును అందజేస్తామని కంపెనీ ప్రకటించింది.

ఈ పోటీ ప్రస్తుతానికి బ్రాండ్ యొక్క కొన్ని గ్లోబల్ మార్కెట్లకు మాత్రమే పరిమితమై ఉంది. ఇంకా దీనిని భారతదేశానికి పరిచయం చేయలేదు. అయితే, ఇండియన్ మోటార్‌సైకిల్ భవిష్యత్తులో #ఇండియన్ టెస్ట్ రైడ్ పోటీని మన దేశానికి తీసుకువస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ఇక ఇండియన్ మోటార్‌సైకిల్ సంబంధిత ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే తమ బిఎస్6 మోటార్‌సైకిళ్లను ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతానికి ఈ బ్రాండ్‌కు బిఎస్6 కంప్లైంట్ మోటార్‌సైకిళ్లు మన దేశంలో లేవు మరియు దేశంలో కోవిడ్-19 పరిస్థితి కారణంగా కంపెనీ వీటి విడుదలకు సంబంధించిన నిర్ధిష్ట సమయాన్ని నిర్ణయించలేకపోతోంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఇండియన్ మోటార్‌సైకిల్ టెస్ట్ రైడ్ కాంపిటీషన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఈ కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ ప్రయాణానికి ఎంత మంది ఆసక్తి చూపుతారనేది ప్రశార్థకంగా ఉంది. మరోవైపు ఈ కాంపిటీషన్ కేవలం విదేశాలకు మాత్రమే పరిమితమై ఉంది, మన దేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు. ఏదేమైనప్పటికీ, ఇందులో గెలిచిన నలుగురు అదృష్టవంతులు మాత్రం నాలుగు రాత్రులు ప్రపంచంలోని హాటెస్ట్ మోటార్‌సైకిల్ గమ్యస్థానాలలో ఒకదాన్ని సందర్శించే అవకాశం పొందుతారు.


Click it and Unblock the Notifications








