ఇండియన్ మోటార్‌సైకిళ్లలో బిఎస్6 మోడళ్లు ఎప్పుడొస్తాయంటే..?

అమెరికాకు చెందిన ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ 'ఇండియన్ మోటార్‌సైకిల్' భారత మార్కెట్లో విక్రయిస్తున్న మోడళ్లలో బిఎస్6 వెర్షన్లను ఇప్పట్లో ప్రవేశపెట్టే సూచనలు కనిపించడం లేదు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా, ఈ ఏడాది చివరికి మాత్రమే బిఎస్6 వాహనాలను భారత్‌లోకి తీసుకురాగలమని కంపెనీ పేర్కొంది.

ఇండియన్ మోటార్‌సైకిళ్లలో బిఎస్6 మోడళ్లు ఎప్పుడొస్తాయంటే..?

దేశంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి తయారీదారులు భారత్‌లో బిఎస్4 వాహనాల విక్రయాలను నిలిపివేయాల్సి ఉంది. కానీ, ఇండియన్ బ్రాండ్ మాత్రం గడువు పూర్తయినా కూడా ఇప్పటికీ బిఎస్6 కంప్లైంట్ మోటార్‌సైకిళ్ళను మార్కెట్లో ప్రవేశపెట్టలేదు. ప్రస్తుత కోవిడ్ -19 పరిస్థితిని బట్టి తాము గడువును నిర్ణయించలేమని పొలారిస్ యాజమాన్యంలో ఉన్న అమెరికన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ తెలిపింది.

ఇండియన్ మోటార్‌సైకిళ్లలో బిఎస్6 మోడళ్లు ఎప్పుడొస్తాయంటే..?

ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి కారణంగా నెలకొన్న ప్రపంచ అనిశ్చితి వలన ఈ మోడళ్ల విడుదల సంబంధించిన నిర్ధిష్ట కాలపరిమితిని నిర్వచించడం చాలా కష్టమని పొలారిస్ ఇండియా హెడ్ లలిత్ శర్మ అన్నారు. కాగా.. ఇండియన్ మోటార్‌సైకిళ్లలో ముందుగా రానున్న బిఎస్6 బైక్‌లలో ఇండియన్ స్కౌట్ శ్రేణి మొదటి మోడల్‌గా నిలువనున్నట్లు తెలుస్తోంది.

MOST READ: కవాసకి నిన్జా 650 బిఎస్6 డెలివరీలు ప్రారంభం - వివరాలు

ఇండియన్ మోటార్‌సైకిళ్లలో బిఎస్6 మోడళ్లు ఎప్పుడొస్తాయంటే..?

ఈ బ్రాండ్ ప్రస్తుతం భారతదేశంలో తమ స్కౌట్, ఎఫ్‌టిఆర్, చీఫ్ మరియు చీఫ్టైన్ శ్రేణి మోటార్‌సైకిళ్లను విక్రయిస్తుంది. ఈ వాహనాలన్నీ వి-ట్విన్ ఇంజన్‌లను కలిగి ఉంటాయి.

ఇండియన్ మోటార్‌సైకిళ్లలో బిఎస్6 మోడళ్లు ఎప్పుడొస్తాయంటే..?

ఇండియన్ మోటార్‌సైకిల్ భారతదేశంలో ఒక సముచితమైన బ్రాండ్. దేశీయవి విపణిలో ఈ బ్రాండ్ విక్రయిస్తున్న మోటార్‌సైకిళ్లన్నింటినీ పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, ఇక్కడి మార్కెట్లోకి దిగుమతి చేసుకొని విక్రయిస్తారు. అధిక దిగుమతి సుంఖాల కారణంగా వీటి రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.

MOST READ: మరోసారి వైరల్ అయిన మహేంద్ర సింగ్ ధోని వీడియో : అదేంటో తెలుసా !

ఇండియన్ మోటార్‌సైకిళ్లలో బిఎస్6 మోడళ్లు ఎప్పుడొస్తాయంటే..?

దేశీయ మార్కెట్లో ఇండియన్ మోటార్‌సైకిల్ తమ మార్కెట్ పనితీరుతో సంతృప్తిగానే ఉంది. భవిష్యత్తులో తమ వాహనాలను భారత్‌లో అసెంబ్లీ చేస్తారా అన్ని విషయంపై కంపెనీ స్పందిస్తూ, ఇప్పట్లో ఆ ఆలోచన లేదని, ప్రస్తుతానికి తమ వాహనాలను సిబియూ రూట్‌లో ఇండియాకు దిగుమతి చేసుకుంటాని తెలిపింది.

ఇండియన్ మోటార్‌సైకిళ్లలో బిఎస్6 మోడళ్లు ఎప్పుడొస్తాయంటే..?

ఇక ఇండియన్ మోటార్‌సైకిల్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే తన చీఫ్, చీఫ్టైన్ మరియు రోడ్‌మాస్టర్ మోటార్‌సైకిళ్ల కోసం క్లైమాకమాండ్ క్లాసిక్ అనే డ్యూయెల్ వెథర్ సీట్లను విడుదల చేసింది.

MOST READ: బజాజ్ ప్లాటినా 100 డిస్క్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇండియన్ మోటార్‌సైకిళ్లలో బిఎస్6 మోడళ్లు ఎప్పుడొస్తాయంటే..?

ఈ కొత్త రకం సీట్లు సుదూర పర్యటన కోసం రూపొందించబడ్డాయి మరియు ఎండాకాలంలో చల్లగా ఉండేందుకు అలాగే చలికాలంలో వేడిగా ఉండేందుకు వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ పనితీరు సమర్థవంతంగా ఉండేందుకు గాను ఈ సీట్ల నిర్మాణంలో థెర్మోఎలెక్ట్రిక్ మాడ్యూల్ మరియు గ్రాఫేన్ నిర్మాణాన్ని ఉపయోగించారు. ఒక్క బటన్‌ను ప్రెస్ చేయగానే సీట్లు ఆటోమేటిక్‌గా చల్లగా లేదా వేడిగా మారిపోతాయి.

ఇండియన్ మోటార్‌సైకిళ్లలో బిఎస్6 మోడళ్లు ఎప్పుడొస్తాయంటే..?

ఈ కొత్త సీట్లు ప్రస్తుతం బ్రాండ్ యొక్క అమెరికన్ మార్కెట్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి మరియు వీటి ధర 1,200 డాలర్ల (సుమారు రూ. 91,000 ప్లస్ టాక్స్) రేంజ్‌లో ఉంది. ఈ క్లైమాకమాండ్ క్లాసిక్ సీట్లు భారత్‌కు వస్తాయా లేదా అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. - ఈ సీట్లకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవటానికి ఈ లింకుపై క్లిప్ చేయండి.

MOST READ: అందుబాటులోకి రానున్న టెస్లా స్మాల్ షార్ట్స్ ; చూసారా ?

ఇండియన్ మోటార్‌సైకిళ్లలో బిఎస్6 మోడళ్లు ఎప్పుడొస్తాయంటే..?

ఇండియన్ మోటార్‌సైకిల్ బిఎస్6 మోడళ్ల లాంచ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో బిఎస్6 ఇండియన్ మోటార్‌సైకిళ్లు విడుదల ఆలస్యం కావటానికి ప్రధాన కారణం, ఈ మోడళ్లు పూర్తిగా అమెరికాలో తయారు కావటమే. సాధారణంగా వీటిని అక్కడి మార్కెట్లో తయారు చేసి, ఇండియాకు దిగుమతి చేసుకోవటానికి బాగానే సమయం పడుతుంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్-19 భయానక పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతుల మద్య కూడా జాప్యం జరుగుతోంది. తాజా పరిస్థితులను గమనిస్తుంటే 2021 మొదటి త్రైమాసికంలో ఇండియన్ మోటార్‌సైకిల్ బిఎస్6 మోడళ్లు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Sources:Autocar India

Most Read Articles

English summary
American motorcycle manufacturer, Indian Motorcycle, has said that it will be ready to launch its BS6 range of motorcycles only closer to the end of the year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X