ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !

కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కరోనా నియంత్రణలో భాగంగా భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ ప్రకటన కారణంగా చాలా మంది డీలర్లు షోరూమ్‌లను మూసివేయడం జరిగింది.

ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !

కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్న కారణంగా ఆటోమొబైల్ కంపెనీ షోరూమ్‌లను మూసివేశారు. ది ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎక్కువగా క్షీణించాయి. ఇది 11% నుండి 13% కి తగ్గుతుందని అంచనా. ప్రస్తుతం 20 నుండి 21 లక్షల యూనిట్లకు పడిపోయింది. ప్రస్తుతం చాలా కంపెనీలు తమ అమ్మకాలను నిలిపివేసాయి.

ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !

ప్రస్తుత పరిస్థితి గురించి ఐసిఆర్‌ఎ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయని చెప్పారు. అంతే కాకుండా మిగిలిన బిఎస్ 4 వాహనాలను విక్రయించడానికి సంస్థలపై కూడా ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది.

ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !

2020 ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహన సంస్థలకు కూడా మంచిది కాదు. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ వల్ల వాహనం ఉత్పత్తులే కాకుండా బిఎస్ 4 వాహనాల అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. ఈ కాలంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు దాదాపు 16% పడిపోయాయి.

ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !

దేశంలో కార్లు మాత్రం ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. చాలా బైక్ కంపెనీలకు ఆన్‌లైన్‌లో విక్రయించే అవకాశం లేదు. అమ్మకాల పరిమాణం తక్కువగా ఉండటమే దీనికి కారణం.

ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !

భారతదేశంలో దిగువ మరియు మధ్యతరగతి ప్రజలు కరోనా వైరస్ సంక్రమణతో చాలా ఇబ్బందులనుఎదుర్కొంటున్నారు. ఈ వర్గానికి చెందిన కస్టమర్లే ద్విచక్ర వాహనాల ప్రధాన కస్టమర్లు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ద్విచక్ర వాహన సంస్థలు ఈ కస్టమర్లను కోల్పోతున్నాయి మరియు అమ్మకాలు మరింత తగ్గే అవకాశం కూడా ఉంది.

ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !

రోజు రోజుకి పెరుగుతున్న కరోనా వల్ల ఈ లాక్ డౌన్ ని మరింత పొడిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాబట్టి మున్ముందు కూడా ఈ ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. ఏది ఏమైనా భయంకరమైన కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడటానికి లాక్ డౌన్ ప్రస్తుత పరిస్థుల్లో చాలా అవసరం అని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి.

Most Read Articles

English summary
Indian two wheeler sales will decline in FY21. Read in Telugu.
Story first published: Thursday, April 9, 2020, 16:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X