Just In
Don't Miss
- Movies
ఆ హీరోలు రిజెక్ట్ చేసిన మల్టీస్టారర్ కథలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట!
- News
దారుణం.. మహిళపై ముగ్గురి గ్యాంగ్ రేప్.. జననాంగాల్లో గాజు గ్లాసుతో చిత్రహింసలు...
- Sports
BWF World Tour Finals 2021: టైటిల్‌పై సింధు, శ్రీకాంత్ గురి
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆర్సి, డిఎల్ వ్యవధి మళ్ళీ పొడిగింపు ; సెంట్రల్ గవర్నమెంట్
దేశంలో కరోనావైరస్ వల్ల కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వాహన సంబంధిత రికార్డుల చెల్లుబాటు వ్యవధిని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కానీ ఈ పొడిగింపు వ్యవధిలో వెహికల్ ఇన్సూరెన్స్ ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సి), ఫిట్నెస్ సర్టిఫికేట్ మరియు ఎమిషన్ సర్టిఫికెట్ యొక్క చెల్లుబాటు వ్యవధి మాత్రమే పొడిగించబడింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దీనిపై స్పందిస్తూ, ఇన్సూరెన్స్ బోర్డు ఆగస్టు 24 న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో, ఆటో ఇన్సూరెన్స్ పాలసీని సకాలంలో అప్డేట్ చేయడం అవసరమని తెలిపింది. దీనికి కారణం వారి అక్రిడిటేషన్ వ్యవధి పొడిగించబడలేదు.

ఆటో ఇన్సూరెన్స్ పాలసీ యొక్క చెల్లుబాటు వ్యవధిని పొడిగించలేదని ఇన్సూరెన్స్ బోర్డు స్పష్టం చేసిన తరువాత మోటారు వాహన పాలసీదారులు తమ ఆటో బీమా పాలసీని పునరుద్ధరించాల్సి ఉంటుంది. వాహనదారులు తమ ఇన్సూరెన్స్ పాలసీలను పునరుద్ధరణ చివరి తేదీన లేదా అంతకు ముందే పునరుద్ధరించాలని ఇన్సూరెన్స్ బోర్డు సూచించింది.
MOST READ:లాంగ్ ట్రిప్స్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇవి మరిచిపోకండి

ఇటీవల కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం 1988 ను సవరించింది. సవరణ ప్రకారం వాహనదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి, ఇన్సూరెన్స్ మరియు వాహనానికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్స్ తీసుకెళ్లవలసిన అవసరం లేదు. కొత్త నిబంధన ప్రకారం ట్రాఫిక్ పోలీసులు ధృవీకరణ కోసం రికార్డులు అడిగినప్పుడు, సంబంధిత పత్రాలను డిజిటల్‌గా చూపించవచ్చు.

డిజిలాకర్ లేదా ఎం-ట్రాన్స్పోర్ట్ మొబైల్ యాప్‌లో రికార్డులు తనిఖీ చేసిన తర్వాత పోలీసులు వాహనదారుల నుండి డాక్యుమెంట్స్ చూపించమని అడగరు. ట్రాఫిక్ నిబంధనల పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనను అమలు చేసింది.
MOST READ:కర్ణాటకలో కొత్త హెల్మెట్ రూల్.. అదేంటో తెలుసా ?

అంతే కాకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు జిపిఎస్ మరియు గూగుల్ మ్యాప్స్ కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాహనదారులు తమ నావిగేషన్ కోసం మొబైల్ ఉపయోగించినట్లైతే ఈ చట్టం ప్రకారం జరిమానా విధించాల్సిన అవసరం లేదు.

మొబైల్ ఫోన్లలో జీపీఎస్ వాడే వాహనదారులకు పోలీసులు జరిమానా విధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, డ్రైవింగ్ చేసేటప్పుడు జిపిఎస్ కోసం మొబైల్ ఫోన్ల వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కొత్త చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. అంతే కాకుండా డాక్యుమెంట్స్ డిజిటలైజ్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్, దీనిని ఉపయోగిస్తే మీ డాక్యుమెట్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు.
MOST READ:గంటకు 532.93 కి.మీ వేగంతో ప్రయాణించే వరల్డ్ ఫాస్టెస్ట్ కార్.. మీరు చూసారా